• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /బిజినెస్
  • /PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

PRC: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారం ప్రభుత్వం తాత్సారం చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు పీఆర్టీయూ నల్లగొండ, ఖమ్మం , వరంగల్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 16, 2026, 10:00 AM IST|Updated: Oct 16, 2026, 10:02 AM IST
joinshare
PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!
Image Credit: PRTU TS State Council Meeting Nalgonda

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

'అందరూ జర్నలిస్టులే అయితే అదో పెద్ద సమస్య'.. సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..!!

2

అక్టోబర్ 30న శుక్రుడి ఉదయం.. ఈ 3 రాశులకు డబ్బు, ఉద్యోగం, విజయాల్లో కీలక మార్పులు?

3

దీపావళికి ముందే రూ.2000 జమవుతాయా? PM కిసాన్ 24వ విడతపై బిగ్ అప్‌డేట్!

4

PRC, పెండింగ్ బిల్లులు తేల్చకపోతే ఉద్యమం తప్పదు.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ ఎమ్మెల్సీ శ్రీపాల్ రెడ్డి..!!

5

ఒకే మహిళ.. రెండు ప్రభుత్వ ఉద్యోగాలు.. ఆధార్ లింకింగ్‌తో దొరికిపోయిందిలా..!!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PRC: రాష్ట్రంలో ఉపాధ్యాయుల పీఆర్సీ, పెండింగ్ బిల్లుల పరిష్కారం ప్రభుత్వం తాత్సారం చేస్తే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు పీఆర్టీయూ నల్లగొండ, ఖమ్మం , వరంగల్ నియోజకవర్గ టీచర్ ఎమ్మెల్సీ పింగళి శ్రీపాల్ రెడ్డి.  నల్లగొండలోని జీఎం గార్డెన్ లో 2 రోజులపాటు జరిగే పీఆర్టీయూ  6వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు ఉద్రుతం చేస్తామని స్పష్టం చేశారు.

ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన హక్కుల సాధనకోసం పీఆర్టీయూ ఎల్లప్పుడూ ముందువరుసలో ఉంటుందని.. సమస్యలపై రాజీలేని పోరాటాలు చేస్తామని తేల్చి చెప్పారు. రాబోయే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీఆర్టీయూ అభ్యర్థిగా రాష్ట్ర సంఘ ప్రధాన కార్యదర్శి.. నల్లగొండ జిల్లా వాసి సుంకరి భిక్షం గౌడ్ బరిలోకి దింపుతున్నట్లు వెల్లడించారు. సంఘం   అభివృద్ధికి, ఉపాధ్యాయుల సంక్షేమానికి ఆయన అందించిన సేవలను గుర్తించే ఈ నిర్ణయం తీసుకున్నట్లు శ్రీపాల్ రెడ్డి వెల్లడించారు.

కౌన్సిల్ సమావేశాల ముగింపు సందర్భంగా పీఆర్టీయూ తెలంగాణ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నిక చేసి వివరాలను వెల్లడించారు. రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా సుంకరి భిక్షంగౌడ్ ను ఎన్నున్నారు. ఈయన వచ్చే నెలలో ఉద్యోగ విరమణ పొందనున్నారు. రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా మధుసూదన్ రెడ్డి ఎన్నుకున్నారు.  ఇంతకుముందు హైదరాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు.  

ఈ రెండు రోజుల కౌన్సిల్ సమావేశాల్లో పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు పుల్గం దామోదర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డిలతో పాటు సంఘం ముఖ్య నాయకులు వంగ మహేందర్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పేరి వెంకటరెడ్డి, గుండు లక్ష్మణ్, జగన్మోహన్ గుప్తా, కాళం నారాయణరెడ్డి, మేకల జానారెడ్డి, అద్దంకి సునీల్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
DA Hike
Telugu News
Telangana News