PM Kisan Alert: ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా తొమ్మిది కోట్ల మందికి పైగా రైతులు లబ్ధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకం ద్వారా రైతులకు సాగు ఖర్చుల కోసం ప్రతి ఏడాది రూ.6000 జమ చేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ.2000 చొప్పున డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలో జమ అవుతున్నాయి. ఇప్పటివరకు 23వ విడత నిధులు మంజూరయ్యాయి, ఇప్పుడు రైతులు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. దీపావళికి ముందే ఈ నిధులు అందుతాయని ఎక్స్ (X) వేదికగా చాలామంది కామెంట్స్ చేస్తున్నారు. దీనిపై స్పందిస్తూ PM కిసాన్ కేంద్ర ప్రభుత్వం ఒక వీడియోను విడుదల చేసి, రైతులు చేయాల్సిన పనులపై క్లారిటీ ఇచ్చింది.
కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు 24వ విడత గురించి అధికారికంగా ప్రకటించలేదు. అక్టోబర్ 20వ తేదీ ప్రాంతంలో ఈ నిధులు మంజూరవుతాయని భావిస్తున్నారు. కానీ దీనిపై ఇంకా ఖచ్చితమైన తేదీ వెల్లడి కాలేదు. స్కీమ్ నిబంధనల ప్రకారం, ప్రతి నాలుగు నెలలకు ఒకసారి నిధులు విడుదలవుతాయి. దీని ప్రకారం 24వ విడత అక్టోబర్‌లో రావాల్సి ఉంది. ఈ క్రమంలో మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోను విడుదల చేసింది. అందులో ఈకేవైసీ, ఆధార్ సీడింగ్, ల్యాండ్ సీడింగ్ పనులు పూర్తి చేయకపోతే పేమెంట్స్ ఆగిపోయే ప్రమాదం ఉందని తెలిపింది. ఈ ప్రక్రియలను ముందుగానే పూర్తి చేయాలని రైతులకు అవగాహన కల్పించింది.
e-KYC అప్‌డేట్ చేయడం..
e-KYC అప్‌డేట్ చేస్తేనే 24వ విడత నిధులు మంజూరవుతాయి. దీనిని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ పద్ధతుల్లో పూర్తి చేయవచ్చు. కామన్ సర్వీస్ సెంటర్ల ద్వారా బయోమెట్రిక్ సాయంతో దీనిని పూర్తి చేయవచ్చు.
#PMKISAN से जुड़ी किसी भी जानकारी को साझा करने से पहले उसकी सत्यता अवश्य जांचें। योजना से संबंधित जानकारी के लिए केवल आधिकारिक स्रोतों पर भरोसा करें। अफवाहों से नहीं, सही जानकारी से सशक्त बनें। #AgriGoI #PMKisan #IndianAgriculture #DBT pic.twitter.com/cG7je968Z5
— PM Kisan Samman Nidhi (@pmkisanofficial) September 16, 2026
బ్యాంక్ ఖాతాకు ఆధార్ సీడింగ్ కూడా తప్పనిసరి. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు పొందడానికి ఇది అవసరం. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సూచనల మేరకు, రైతులు తమ బ్యాంక్ బ్రాంచ్‌కు వెళ్లి ఆధార్ సీడింగ్ చేయించుకోవాలి.
అక్టోబర్ 20 లోపు ఈ నిధులు వస్తాయని రైతులు ఆశిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే, మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ 24వ విడతపై ఇంకా అధికారిక ప్రకటన చేయనప్పటికీ, రైతులు ముందుగానే e-KYC, బ్యాంక్ ఖాతాకు ఆధార్ లింక్ వంటి పనులను పూర్తి చేసుకోవాలి.
అర్హత ఉన్న చిన్న, సన్నకారు రైతులు ఈ పీఎం కిసాన్ నిధులను పొందవచ్చు, అయితే వీరు ముందుగానే రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం అర్హత ఉన్నవారు మాత్రమే ఈ నిధులను పొందుతారు. కుటుంబంలో భార్య లేని పక్షంలో భర్త మాత్రమే ఈ పథకానికి అర్హులు అవుతారు.