SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పీఎం కిసాన్ రూ.2000 మీ ఖాతాలో పడలేదా? ఇలా ఫిర్యాదు చేస్తే వెంటనే డబ్బులు మీ అకౌంట్‌లోకి!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రైతులు తమ సాగు అవసరాల కోసం కేంద్ర ప్రభుత్వం నుండి నిధులను పొందుతున్నారు. ఈ పథకం కింద ప్రతి ఏడాది రూ. 6000 రైతులు పొందుతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం ఎంతో ఉపయోగకరంగా ఉంది. ఈ నిధులు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రూ. 2000 చొప్పున నేరుగా రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా జమ అవుతాయి. ఈ పథకం ద్వారా లబ్ధి పొందాలంటే ముందుగా ఈ-కేవైసీ, ఆధార్ సీడింగ్ వంటి ప్రక్రియలను పూర్తి చేయాలి. కేవలం అర్హత ఉన్న రైతులకు మాత్రమే ఈ నిధులు అందుతాయి. ఒకవేళ కొన్ని కారణాల వల్ల మీకు నిధులు మంజూరు కాకపోతే ఏం చేయాలి? ఎక్కడ ఫిర్యాదు చేయాలి? ఈ చిన్న టోల్ ఫ్రీ నంబర్‌కు కాల్ చేయడం లేదా మెయిల్ చేయడం ద్వారా మీరు సులభంగా నిధులు పొందవచ్చు.

Written By Renuka Godugu
Published: Oct 03, 2026, 07:32 AM IST | Updated: Oct 03, 2026, 07:42 AM IST
Image Credit: PM Kisan Update
Join

PM Kisan Update: మీరు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్‌ నిధి యోజన లబ్ధిదారులైతే, 24వ విడతకు సంబంధించిన అప్‌డేట్ ఇంకా రాలేదు. అయితే 23వ విడత ఇంకా జమ కానివారు ముందుగా మీ ఈ-కేవైసీ పనులు పూర్తయ్యాయో లేదో సరిచూసుకోండి. ఒకవేళ మీ తరఫున ఎలాంటి తప్పు లేకపోయినా నిధులు రాకపోతే, పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌ https://pmkisan.gov.in/ లోని హెల్ప్ డెస్క్ సెక్షన్‌లో ఫిర్యాదు చేయండి. లేదా పీఎం కిసాన్ హెల్ప్‌లైన్ నంబర్ 155261 కి కాల్ చేయండి. దీనితో పాటు 1800115526 అనే టోల్ ఫ్రీ నంబర్ కూడా అందుబాటులో ఉంది. అలాగే 01123381092 లేదా 01124300606 నంబర్ల ద్వారా కూడా రైతులు ఫిర్యాదులు చేయవచ్చు. లేనిపక్షంలో pmkisan-ict@gov.in లేదా pmkisan-funds@gov.in కి మెయిల్ చేయవచ్చు. మీరు చేసిన ఫిర్యాదుకు సరైన సమాధానం రాకపోతే, మీ సమీపంలోని అగ్రికల్చర్ డిపార్ట్‌మెంట్ కార్యాలయాన్ని లేదా తహసీల్దార్ కార్యాలయాన్ని సంప్రదించవచ్చు.

ప్రస్తుతం ప్రధానమంత్రి కిసాన్ యోజన ద్వారా కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాల్లో రూ. 6000 జమ చేస్తోంది. దీనిని నాలుగు నెలల వ్యవధిలో రూ. 2000 చొప్పున మూడు విడతలుగా విడుదల చేస్తారు. అయితే, ఈ పథకం కింద నగదు మొత్తాన్ని పెంచుతారా లేదా? అనే విషయంపై ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన లేదు.

ఈ పథకానికి సంబంధించి ఈ-కేవైసీ వంటి పనులను ముందుగానే పూర్తి చేసుకోవాలి. దీని కోసం ప్రధానమంత్రి కిసాన్ అధికారిక వెబ్‌సైట్ లేదా మొబైల్ యాప్‌ను ఉపయోగించవచ్చు. దీని కోసం 'ఆధార్ ఫేస్ అథెంటికేషన్ యాప్' తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ మీరు ఆన్‌లైన్‌లో ఈ-కేవైసీ పూర్తి చేయలేకపోతే, కామన్ సర్వీస్ సెంటర్ లో బయోమెట్రిక్ ప్రక్రియ ద్వారా దీనిని పూర్తి చేయవచ్చు.

Read Also: పీఎం కిసాన్ లబ్దిదారులకు బిగ్ షాక్! ఆ తప్పు చేస్తే రూ. 2,000 

పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ స్టేటస్..
మీరు మీ పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ స్టేటస్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చు.  అధికారిక వెబ్‌సైట్‌ pmkisan-funds@gov.in ను ఓపెన్ చేసి, 'ఫార్మర్ కార్నర్'లోని 'బెనిఫిషియరీ స్టేటస్' లేదా 'బెనిఫిషియరీ లిస్ట్' క్లిక్ చేయాలి. అక్కడ మీ రాష్ట్రం, జిల్లా, బ్లాక్ మరియు గ్రామం పేరు నమోదు చేయాలి. అనంతరం మీ ఆధార్ నంబర్ లేదా రిజిస్ట్రేషన్ నంబర్‌తో మీ పేరు జాబితాలో ఉందో లేదో చెక్ చేసుకోవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES