SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

చిన్న పొరపాటు జరిగినా రూ. 2,000 ఆగిపోతాయి..! పోర్టల్‌లో వెంటనే ఇలా అప్‌డేట్ చేసుకోండి!

మీరు పీఎం కిసాన్‌ లబ్దిదారులా? అయితే, ఈ విషయం ముందుగానే తెలుసుకోవాలి. లేకపోతే మీకు రూ.2000 పడవు. పోర్టల్‌లో జరిగే చిన్నపాటి పొరపాట్ల వల్ల మీకు పీఎం కిసాన్‌ నిధులు ఆగిపోయే అవకాశం ఉంది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Nov 21, 2026, 09:58 IST | Updated: Nov 21, 2026, 10:04 IST
Image Credit: PM Kisan Yojana:
Join

PM Kisan Yojana: ప్రధానం మంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఈ పథకానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ ఉంది. ఇది రైతు సాగు ఖర్చులకు సహాయంగా ఉంటున్నాయి. కొన్ని కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ది పొందుతున్నారు. 24వ విడుత నిధులు దీపావళి ముందు విడుదల చేశారు. ప్రతి ఏడాది ఈ పథకం ద్వారా రూ.6000 రైతుల ఖాతాల్లో జమ అవుతున్నాయి. ప్రతి విడుత రూ.2000 నాలుగు నెలలకు ఒకసారి విడుదల చేస్తారు. అయితే, పీఎం కిసాన్‌ నిధులు పొందాలంటే చిన్న, సన్నకారు రైతులు మాత్రమే అర్హులు. అయితే, ఇవి కాకుండా కొన్ని పోర్టల్‌ తప్పిదాలు జరుగుతాయి. దీనివల్ల రూ.2000 ఆగిపోయే ప్రమాదం ఉంది. తదుపరి విడుత నిధులు పడాలన్నా.. ఆగిపోయిన నిధులు కూడా తిరిగి పొందాలన్నా ఈ తప్పిదాలను ముందుగా సరిదిద్దుకోండి.

పీఎం కిసాన్‌ నిధులు పొందాలంటే సరైన భూ పత్రాలు కూడా కలిగి ఉండాలి. అందులో ఆధార్‌ ఇతర వివరాలు సరిగ్గా పోలి ఉండాలి. ఏవైనా తప్పిదాలు ఉండే వాటిని సరి చూసుకోండి. చాలా మంది రైతులకు ఈ పోర్టల్‌ సంబంధిత సమస్యలే ఎదురవుతాయి. దీనికి ప్రధాన కారణం వివరాలు సరిపోలకపోవడం. ఏవైనా వివరాలు మిస్సయితే చెక్‌ చేయండి. పీఎం కిసాన్‌కు ల్యాండ్‌ సీడింగ్‌ తప్పనిసరి.

కేంద్ర ప్రభుత్వం ఈ మిస్టేక్స్‌ చెక్‌ చేసుకోవడానికి ఆన్‌లైన్‌ విధానాన్ని కూడా తీసుకువచ్చింది. రైతులు తమ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

పీఎం కిసాన్‌ వివరాలు అప్‌డేట్‌ చేసే విధానం..
పీఎం కిసాన్‌ ఖాతా అసంపూర్తిగా ఉన్నా.. లేదా వివరాలు ఏవైనా మిస్సయినా కంగారు పడాల్సిన పనిలేదు. ఆన్‌లైన్‌ పోర్టల్‌లో చెక్‌ చేసుకుని వెంటనే వాటిని అప్‌డేట్‌ చేసుకోవచ్చు.

ముందుగా పీఎం కిసాన్‌ వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి. ఆ తర్వాత అప్‌డేట్‌ మిస్సింగ్‌ ఇన్‌ఫర్మేషన్‌ సెలక్ట్‌ చేయండి. ఆ తర్వాత ఆధార్‌ నెంబర్‌ లేదా రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ కూడా నమోదు చేయాలి. చివరిగా మీ వివరాలు సరిగ్గా ఉన్నాయా? లేదా? రివ్యూ చేయండి.
ఇప్పుడు మీకు కావాల్సిన వివరాలు అప్‌డేట్‌ చేయండి. ఆ తర్వాత ఒకసారి వెరిఫై చేసి సబ్మిట్‌ చేయండి.

పీఎం కిసాన్‌ స్టేటస్‌ చెక్‌ చేసే విధానం..
మీ ఖాతాల్లో పీఎం కిసాన్‌ నిధులు జమ అవుతే వెంటనే ఆన్‌లైన్‌లో చెక్‌ చేసుకోవచ్చు.
అధికారిక వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేయాలి.
ఫార్మర్‌ కార్నర్‌ ఎంపిక చేసి Know Your status ఆప్షన్‌ ఎంచుకోండి. మీ రిజిస్ట్రేషన్‌ నెంబర్‌, క్యాప్చా కోడ్‌ కూడా నమోదు చేసి మీ స్టేటస్‌ చెక్‌ చేసుకోవచ్చు. మీ పీఎం కిసాన్‌ విడుతలు, అర్హత, అప్లికేషన్‌ వివరాలు అక్కడ కనిపిస్తాయి.

కావాల్సిన డాక్యుమెంట్స్‌..
ఈ పీఎం కిసాన్‌ యోజన పొందాలంటే రైతులు సరైన డాక్యుమెంట్స్‌ కూడా కలిగి ఉండాలి.
ముందుగా ఈకేవైసీ పూర్తి చేయండి. ఫార్మర్‌ రిజిస్ట్రేషన్‌, ఫార్మర్‌ ఐడీ తప్పనిసరి. 
ఆధార్‌ మీ బ్యాంకు ఖాతాకు లింక్‌ అయిందా? చూడండి.
అంతేకాదు మీ బ్యాంకు ఖాతా డైరెక్ట్‌ బెనిఫిట్‌ ట్రాన్స్‌ఫర్ కూడా యాక్టివ్‌గా ఉందా? చెక్‌ చేయండి.
ఈ వివరాలన్నీ సరిగ్గా ఉంటే పీఎం కిసాన్‌ నిధులు మంజూరు అవుతాయి.

Read Also: మీ మొబైల్ లేదా ల్యాప్‌టాప్‌తో నిమిషాల్లో పాన్-ఆధార్ లింక్.. స్టెప్-బై-స్టెప్ పూర్తి గైడ్ ఇదే!


పీఎం కిసాన్‌ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకుంటే సరిపోదు. మీరు అర్హులా? చెక్‌ చేయండి. ఆధార్‌ వివరాలు, బ్యాంకు ఖాతా, ఈకేవైసీ, సరైన భూపత్రాలు తప్పనిసరి. ఎప్పటికప్పుడు స్టేటస్‌ చెక్‌ చేయండి. ఏవైనా వివరాలు అసంపూర్తిగా ఉంటే వెంటనే పూర్తి చేయండి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES