SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పోస్ట్ ఆఫీస్ బంపర్ ఆఫర్.. ప్రతినెల రూ.8,000 ఇన్వెస్ట్‌మెంట్‌తో చేతికి రూ. 5.7 లక్షలు.. ఫుల్ క్యాలిక్యులేషన్స్ ఇవే!

రోజువారీ కష్టార్జితంతో చిన్న మొత్తాలను కూడా పొదుపు చేస్తూ ఉంటాం. రోజువారీ ఖర్చులు పోను, అత్యవసర పరిస్థితుల కోసం కొంత నగదును సేవ్ చేయడం భవిష్యత్తుకు ఎంతో భద్రతను ఇస్తుంది. ఆ డబ్బును పెట్టుబడి పెట్టాలనుకుంటే, మీరు పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ ఎంచుకోవచ్చు. ఇది అత్యంత సురక్షితమైనది. మంచి లాభాలను ఇచ్చే పథకం. ప్రతి నెలా ఎనిమిది వేల రూపాయలు పొదుపు చేస్తూ, మీరు ఐదు లక్షలకు పైగా ఎలా పొందవచ్చో ఇప్పుడు పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 29, 2026, 10:31 AM IST | Updated: Sep 29, 2026, 10:33 AM IST
Image Credit: Post Office RD Scheme
Join

మన దేశంలో పోస్ట్ ఆఫీస్ ద్వారా అనేక రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. చిన్న మొత్తంతో ఖాతా ప్రారంభించి, దీర్ఘకాలంలో వీటి ద్వారా మంచి రిటర్న్స్ పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకాలు పూర్తి భద్రతను అందిస్తాయి. అందులో పోస్ట్ ఆఫీస్ రికరింగ్ డిపాజిట్ కూడా ఒకటి, ఇది మీడియం టర్మ్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేసే వారికి మంచి లాభాలను అందిస్తుంది. తక్కువ సమయంలోనే ఎక్కువ నిధిని సృష్టించుకోవచ్చు. మీరు నెలకు కేవలం రూ.100 తో కూడా ఇక్కడ పొదుపు ప్రారంభించి మంచి ప్రయోజనాలు పొందవచ్చు.

పోస్ట్ ఆఫీస్‌లో ఎవరైనా అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇందులో జాయింట్ అకౌంట్ సౌకర్యం కూడా ఉంది. పోస్ట్ ఆఫీస్ నిబంధనల ప్రకారం, పేరు మీద లేకపోయినా జాయింట్ అకౌంట్ ద్వారా ఖాతా తెరవవచ్చు. అలాగే, మైనర్ల పేరు మీద కూడా అకౌంట్లు ఉంటాయి, వీటిని గార్డియన్లు నిర్వహించవచ్చు.

పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్ వివరాలు..
పోస్ట్ ఆఫీస్ RD అకౌంట్‌లో ప్రతి నెలా రూ. 8,000 జమ చేస్తూ, ఐదేళ్ల కాలపరిమితిలో (60 నెలలు) మీరు రూ. 5,00,000 పైగా పొందవచ్చు. ఖాతా ప్రారంభించినప్పటి నుండి ప్రతి నెలా రూ.8,000  పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. దీనిపై మీకు అదనంగా వడ్డీ కూడా లభిస్తుంది, తద్వారా మొత్తం ఐదు లక్షల రూపాయలకు పైగా అందుతుంది. కావాలనుకుంటే మీరు ఈ పెట్టుబడిని మరో ఐదేళ్ల పాటు పొడిగించుకోవచ్చు.

మీరు పోస్ట్ ఆఫీస్ ఆర్డి ఖాతాలో ప్రతి నెలా రూ.8,000 డిపాజిట్ చేస్తూ, ఐదేళ్ల పాటు కొనసాగిస్తే 6.7 శాతం వడ్డీ లభిస్తుంది. ఈ వడ్డీ ద్వారా మీరు సుమారు రూ.92,626 పొందుతారు. 60 నెలల కాలంలో మీరు చేసే మొత్తం డిపాజిట్ రూ.4,80,000 అవుతుంది. ఈ అసలు, వడ్డీ కలిపి మొత్తం రూ.5,72,626 అవుతుంది.

మీకు కావాలంటే ఈ డిపాజిట్‌ను మరో ఐదేళ్ల పాటు కూడా కొనసాగించవచ్చు. దీని కోసం మీరు అదనంగా ఏమీ చెల్లించాల్సిన అవసరం లేదు. మీ అకౌంట్ యాక్టివ్‌గానే ఉంటుంది. వడ్డీ కూడా లభిస్తుంది. ఎటువంటి భద్రతా ఆందోళనలు లేకుండా మీరు ఇందులో పెట్టుబడి పెట్టవచ్చు. పోస్ట్ ఆఫీస్‌లో అందుబాటులో ఉన్న వివిధ రకాల పథకాల్లో చిన్న మొత్తంతో పొదుపు ప్రారంభిస్తే, దీర్ఘకాలంలో మీరు మంచి రిటర్న్స్‌ను పొందవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES