• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • / Rasik dulari Sharan Death: ఆశ్రమంలో శిష్యుడి అనుమానస్పద మృతి.!.. ప్రేమానంద్ జీ మహారాజ్ చుట్టు రాజుకుంటున్న వివాదం.!..

Rasik dulari Sharan Death: ఆశ్రమంలో శిష్యుడి అనుమానస్పద మృతి.!.. ప్రేమానంద్ జీ మహారాజ్ చుట్టు రాజుకుంటున్న వివాదం.!..

Premanand maharaj disciple death Mystery: లలిత్ కుంజ్ లో జరిగిన శిష్యుడి అనుమానస్పద మృతి ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు యూపీ పోలీసులు ఇప్పటికే మృతి చెందిన శిష్యుడి ఫోన్ ను స్వాధీనం చేసుకున్నారు. వాట్సాప్ ఛాట్, డిలీట్ చేసిన డాటాను రికవరీ దిశగా చర్యలు చేపట్టారు.

Written ByInamdar Paresh
Published: Sep 30, 2026, 08:09 AM IST|Updated: Sep 30, 2026, 08:18 AM IST
joinshare
 Rasik dulari Sharan Death: ఆశ్రమంలో శిష్యుడి అనుమానస్పద మృతి.!..  ప్రేమానంద్ జీ మహారాజ్ చుట్టు రాజుకుంటున్న వివాదం.!..
Image Credit: premanandjimaharaj(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Premanand ji maharaj disciple rasik dulari sharan death mystery: ఉత్తరప్రదేశ్ లోని  బృందావన్‌లో ఆశ్రమంలో ప్రముఖ గురువు ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమంలో ఇటీవల శిష్యుడు అనుమానస్పదంగా మృతిచెందడం సంచలనంగా మారింది. ఆశ్రమంలోని నాలుగో అంతస్తు నుంచి పడి దీపక్ లోధి మరణించారు. పోలీసులు దీనిపై వైద్యులతో పోస్ట్ మార్టం నిర్వహించగా.. విచారణలో విస్తు పోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. మృతుడి ప్రైవేట్ పార్ట్‌పై తీవ్రమైన గాయం ఉండటంను గుర్తించారు.  

అదే విధంగా గదిలో రక్తపు మరకలు కూడా పోలీసులు గుర్తించారు. ముఖ్యంగా అధిక రక్తస్రావం వల్ల చనిపోయినట్లు వైద్యులు తమ రిపోర్ట్ లో వెల్లడించారు. అదే విధంగా శరీరంలో పలు చోట్ల బలమైన గాయాలు కూడా అయినట్లు పేర్కొన్నారు. దీంతో పోలీసులు అనుమానస్పద మృతి కింద కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు .మరోవైపు ప్రేమా నంద్ జీ మహారాజ్ కు ప్రపంచ వ్యాప్తంగా శిష్యులు ఉన్నారు. విరాట్ కోహ్లి, అనుష్క జంట తరచుగా యూపీలోనిబృందావన్‌ ఆశ్రమంకు వెళ్తారు.

 ఇలాంటి క్రమంలో ఈ ఘటన జరగటంపై ఆయన శిష్యులు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్రేమానంద్ జీ మహారాజ్ యమునా తీరంలో మరోక ఆశ్రమంలో ఉంటున్నారని తెలుస్తొంది. దీనిపై సీబీఐతో విచారణ జరిపించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 

ఇప్పటి వరకు శిష్యుడి మరణంపై ప్రేమానంద్ జీ మహారాజ్ ఎందుకు స్పందించడంలేదుని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నలు వేస్తున్నారు. దీని వెనుకాల పెద్ద నెట్ వర్క్ ఉందని, ఆశ్రమంలోని దారుణాలు ఏవైన బైటకు తెలుస్తాయని ఈవిధంగా శిష్యుడిని హత్య చేశారా..?.. అంటూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.  మొత్తంగా దీనిపై యూపీ పోలీసులు ప్రస్తుతం అన్ని కోణాల్లో లోతుగా విచారణచేపట్టారు.


దీపక్ లోధి ఎవరంటే..?..


దీపక్ లోధి మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందినవాడు. ఇతను రెండేళ్ల క్రితం ప్రేమానంద్ మహారాజ్ వద్ద దీక్ష స్వీకరించి, రసిక్ దులారి శరణ్‌గా పేరు మార్చుకున్నాడు. శుక్రవారం ఉదయం 10.30 గంటల సమయంలో గురు కృపాకుంజ్ ఆశ్రమం పైనుంచి  పడి చనిపోయాడు. యూపీ పోలీసులు ఈ ఘటనపై అనుమానస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

అక్కడి సీసీ ఫుటేజీని పరిశీలించగా...రసిక్ దులారీ నాలుగో అంతస్తు టెర్రస్‌పై నుంచి కింద పడ్డట్లు గుర్తించారు. పోలీసులు అతని గదిలో టైల్ లను కటింగ్ చేసే   కటింగ్ గ్రైండర్ ను గుర్తించారు. అది పూర్తిగా రక్తంతో తడిసి ఉన్నట్లు తెలిపారు.  ఇక దీపక్ లోధి కుటుంబ సభ్యులు కూడా తమతో ఎప్పుడు మాట్లాడించే వారు కాదని కన్నీళ్లు  పెట్టుకున్నారు. 

శిష్యుల మధ్య ఆధిపత్య పోరా..?.. లేదా ఆస్తుల తగాదాలా..?.. ఈ ఘటన ఎలా జరిగిందని పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనతో యూపీలోని  బృందావన్‌ ఆశ్రమంచుట్టు వివాదం రాజుకుంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Crime News