పంజాబ్‌లో మళ్లీ చేతులు కలిపిన బీజేపీ, అకాలిదళ్ .. ఆరేళ్ల తర్వాత మళ్లీ పొత్తు..!!
Punjab Assembly Election 2027: 2027లో దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాలకు ఎన్నికలు జరగనున్నాయి. అందులో దేశంలో జనాభా పరంగా అతిపెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంతో పాటు ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్‌లకు తొలి మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. అందులో పాకిస్థాన్ సరిహద్దును ఆనుకొని ఉన్న పంజాబ్ ఎన్నికలు ప్రస్తుతం పొలిటికల్‌గా కాక పుట్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ గతంలో అధికారంలో ఉన్న అకాలీదళ్, బీజేపీ కూటమి తిరిగి కూటమిగా ఎన్నికల బరిలో దిగబోతున్నట్టు తెలుస్తుంది. మరి కాసేట్లో దీనిపై ఇరు పార్టీలకు చెందిన నేతలు అధికారిక ప్రకటన చేయనున్నట్టు సమాచారం.
BJP - Akali dal: భారతీయ జనతా పార్టీ ఉత్తరాదిలో అన్ని రాష్ట్రాల్లో పాగా వేసినా పంజాబ్ మాత్రం ఇప్పటికీ కొరకరాని కొయ్యలా మారింది. అన్ని రాష్ట్రాల్లో గెలుస్తున్న పంజాబ్‌లో మాత్రం సొంతంగా అధికారంలోకి రాలేకపోతుంది. గతంలో అకాలీదళ్‌తో పొత్తులో భాగంగా అక్కడి ప్రభుత్వంలో జూనియర్ భాగస్వామిగా ఉండేది. అయితే రైతు చట్టాల నేపథ్యంలో కేంద్రంలోని ఎన్డీయేకు అకాలీ దళ్ రాం రాం చెప్పేసింది. దీంతో అప్పటి నుంచి రెండు పార్టీలు పంజాబ్‌లో విడివిడిగా పోటీ చేసి పెద్దగా సీట్లు సాధించలేకపోయాయి. కానీ బీజేపీ మాత్రం గత అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికల్లో ఓటింగ్ శాతం మాత్రం పెరిగింది. కానీ సీట్లుగా మారలేదు. మరోవైపు ప్రకాశ్ సింగ్ బాదల్ మరణం తర్వాత అకాలీ దళ్ పరిస్థితి మరుగుజ్జులా మారింది. ఆ పార్టీకి వచ్చే సంప్రదాయ ఓట్లు తగ్గిపోయాయి. మరోవైపు పలు సర్వేలు కూడా పంజాబ్‌లో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ, బీజేపీ మధ్య తీవ్ర పోటీ ఉన్నట్టు తెలుపుతున్నాయి.
అసెంబ్లీ ఎన్నికల వేళ పంజాబ్‌లో కీలక పరిణామం..
ఈ నేపథ్యంలో పాత స్నేహితులైన బీజేపీ, అకాలీ దళ్ మళ్లీ కూటమిగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. ఇక బీజేపీకి ఆది నుండి అకాలీ దళ్ నమ్మిన బంటుగా ఉండేది. టీడీపీ సహా పలు పార్టీలు బీజేపీకి జెల్ల కొట్టి ఎన్డీయే నుంచి బయటకు వచ్చినా.. అకాలీదళ్ మాత్రం కూటమి ధర్నాన్ని పాటిస్తూ వచ్చింది. ఇక నరేంద్ర మోడీ సర్కార్ తీసుకొచ్చిన రైతు చట్టాలకు వ్యతిరేకంగా 6 క్రితం కూటమి నుంచి వైదొలిగింది. అంతేకాదు 24 యేళ్ల భాగస్వామ్య బంధం అప్పట్లో బీటలు వారింది. అప్పటి నుంచి అకాలీదళ్ పరిస్థితి ఎటు కాకుండా పోయింది. దీంతో సిక్కులకు పవిత్రమైన గురు నానక్ జయంతి రోజున శిరోమణి అకాలీ దళ్ బీజేపీ పొత్తు పొడిచింది. దీనికి సంబంధించిన అకాళీదళ్ ఛీఫ్ సుఖ్ బీర్ సింగ్ బాధల్, బీజేపీ అగ్ర నేత హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ సంయుక్త ప్రకటన చేశారు.
కొలిక్కి వచ్చిన చర్చలు..
అయితే పొత్తులో భాగంగా సీట్ల పంపకంపై ఇరు పార్టీల మధ్య చర్చలు కొలిక్కి వచ్చాయి. గతంలో జూనియర్ భాగస్వామిగా ఉన్న బీజేపీ.. ఈ సారి పెద్దన్న పాత్రను పోషించనుంది. బీజేపీ ఎక్కువ సీట్లో పోటీ చేయనుంది. అకాలీ దళ్ కూడా తమకు పట్టున్న ప్రాంతాల్లో పోటీకి దిగనుంది. మరోవైపు ఈ నెలాఖరు లోపు జరగనున్న కేంద్ర మంత్రి వర్గ విస్తరణలో అకాలీ దళ్ కు రెండు సీట్లు ఇవ్వనున్నట్టు సమాచారం. 2022 అసెంబ్లీ ఎన్నికల్లో విడివిడిగా పోటీ చేసిన ఎస్ఏడీ 3 సీట్లు.. బీజేపీ 2 సీట్లు మాత్రమే దక్కాయి.
117 సీట్లున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 92 సీట్లు గెలచుకొని అధికారంలో వచ్చింది. అయితే సీఎం అభ్యర్ధి విషయంలో చెరో రెండున్నరేళ్లు కోసం బీజేపీ పట్టుపడుతుంది. ఈ నేపథ్యంలో వీళ్లిద్దరి పొత్తు పంజాబ్ కీలక రాజకీయ మలుపు తిరగనుంది.