• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /పిల్లల కోసం ప్రత్యేకం.. సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు..!

పిల్లల కోసం ప్రత్యేకం.. సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు..!

Jayannth Ticket Prices: సినిమా అంటే కేవలం వినోదం మాత్రమే కాదు.. మంచి విషయాలను నేర్పించే సాధనం కూడా. ముఖ్యంగా పిల్లలకు నచ్చే కథలతో పాటు కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు రావడం చాలా అరుదు. ఈ నేపథ్యంలో బాలల దినోత్సవాన్ని ప్రత్యేకంగా ఎంచుకుని ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ అనే కొత్త సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. నవంబర్ 14న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కానుంది. అంతేకాదు, చిన్నారులు కూడా ఈ సినిమాను సులభంగా చూసేందుకు టికెట్ ధరలను తగ్గించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Written ByVishnu Priya
Published: Nov 13, 2026, 10:29 AM IST|Updated: Nov 13, 2026, 10:58 AM IST
joinshare
పిల్లల కోసం ప్రత్యేకం.. సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు..!

About the Author

Vishnu Priya

Vishnu Priya

విష్ణు ప్రియ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. సినిమాల మీద ఆసక్తితో ఎక్కువగా వినోదం కేటగిరిలో వార్తలు రాస్తున్నారు. అదేవిధంగా హెల్త్, లైఫ్ స్టైల్, క్రైమ్ కేటగిరీలకు సంబంధించిన వార్తలు కూడా రాస్తూ ఉంటారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆమెకు జర్నలిజంలో పదేళ్లకు పైగా అనుభవం ఉంది.  
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
స్కూటర్‌లో దాక్కున్న భారీ కొండచిలువ.. స్టార్ట్ చేయబోతే ఊహించని షాక్!

స్కూటర్‌లో దాక్కున్న భారీ కొండచిలువ.. స్టార్ట్ చేయబోతే ఊహించని షాక్!

2

Vijayawada Digital Arrest: 'డిజిటల్ అరెస్ట్' పేరుతో విజయవాడలో భారీ దోపిడీ.. బెదిరించి రూ.10 కోట్లు కొట్టేశారు!

3

పిల్లల కోసం ప్రత్యేకం.. సినిమా టికెట్‌పై రూ.100 తగ్గింపు..!

4

మీ జీతం, పొదుపు గురించి ఈ 5 రహస్యాలు ఎవరికీ చెప్పకండి.. అప్పుడే మీరు ధనవంతులవుతారు!

5

నవంబర్ 22 నుంచి పవర్‌ఫుల్ లక్ష్మీనారాయణ రాజయోగం.. ఈ 4 రాశులకు జాక్‌పాట్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Jayannth And The Jingo Pen Release Date: నమో జయం ప్రొడక్షన్స్ బ్యానర్‌పై దివ్య ప్రవీణ్ బొలిశెట్టి జయంత్ అండ్ ది జింగో పెన్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జాతీయ అవార్డు గ్రహీత నవీన్ దేశబోయిన దర్శకత్వం వహించారు. మాస్టర్ జయంత్ బొలిశెట్టి ప్రధాన పాత్రలో నటించగా, 'మన శంకర వర ప్రసాద్' సినిమాతో గుర్తింపు పొందిన ఊహా రెడ్డి కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. వీరితో పాటు సత్యం రాజేష్, ఆశిష్ గాంధీ, మానస రాధాకృష్ణన్, తనికెళ్ల భరణి, కాశీ విశ్వనాథ్, మానిక్ రెడ్డి తదితరులు ఈ సినిమాలో నటించారు.

ఈ సినిమా విడుదల సందర్భంగా చిత్రబృందం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. సాధారణంగా రూ.250గా ఉండే టికెట్ ధరను పిల్లల కోసం రూ.150కి తగ్గించినట్లు నిర్మాత దివ్య ప్రవీణ్ బొలిశెట్టి వెల్లడించారు. చిన్నారులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కలిసి ఈ సినిమాను చూడాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. పిల్లల మార్కులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వకుండా, వారి మనసులోని భావాలను కూడా తల్లిదండ్రులు అర్థం చేసుకోవాలనే సందేశాన్ని ఈ సినిమా ద్వారా అందించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు.

దర్శకుడు నవీన్ దేశబోయిన మాట్లాడుతూ, ఈ చిత్రాన్ని కేవలం వ్యాపార కోణంలో చూడటం లేదని స్పష్టం చేశారు. పిల్లలకు బాలల దినోత్సవ కానుకగా మంచి సినిమాను అందించాలనే ఉద్దేశంతోనే టికెట్ ధరను తగ్గించినట్లు చెప్పారు. ఇప్పటికే కొన్ని పాఠశాలలు ప్రత్యేక ప్రదర్శనల కోసం థియేటర్లను బుక్ చేసుకున్నాయని వెల్లడించారు.

ఇక ఈ చిత్రానికి ప్రవీణ్ బొలిశెట్టి అందించిన పాటలకు మంచి స్పందన వస్తోందని చిత్రబృందం తెలిపింది. పిల్లలతో పాటు పెద్దలు, టీచర్లు కూడా ఈ సినిమాతో కనెక్ట్ అవుతారని నటీనటులు, నిర్మాతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

మొత్తానికి బాలల దినోత్సవం సందర్భంగా విడుదలవుతున్న ‘జయంత్ అండ్ ది జింగో పెన్’ సినిమా పిల్లలకు ఎలాంటి అనుభూతిని అందించబోతోందన్న ఆసక్తి నెలకొంది. తక్కువ టికెట్ ధరతో కుటుంబ ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో ఈ సినిమా ఎంతవరకు విజయం సాధిస్తుందో చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telugu Movie
Tollywood