• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /భార్యపై కోపంతో రూ.500 నోట్లకు నిప్పంటించిన భర్త.. చివరకు ఏం చేశాడంటే?

భార్యపై కోపంతో రూ.500 నోట్లకు నిప్పంటించిన భర్త.. చివరకు ఏం చేశాడంటే?

Rajasthan Viral Video: భార్య మీద కోపంతో ఒక వ్యక్తి చేసిన పని ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. వీడియోలో ఒక వ్యక్తి 500 నోట్లను కుప్పలుగా పేర్చి నిప్పంటించాడు. ఆ తర్వాత దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 22, 2026, 12:26 IST|Updated: Nov 22, 2026, 12:27 IST
joinshare
భార్యపై కోపంతో రూ.500 నోట్లకు నిప్పంటించిన భర్త.. చివరకు ఏం చేశాడంటే?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rajasthan Viral Video: కుటుంబ కలహాలతో పాటు భార్యాభర్తల మధ్య చిన్నపాటి అభిప్రాయ విభేదాలు ఒక్కసారి ఊహించని పరిణామాలకు దారితీస్తూ ఉంటాయి. తాజాగా రాజస్థాన్లో జరిగిన ఒక వింత ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో చెక్కర్లు కొడుతోంది. భార్యపై కోపంతో ఒక వ్యక్తి ఏకంగా 500 నోట్లను నిప్పు పెట్టి కాల్ చేయడం సోషల్ మీడియా వినియోగదారులను ఆశ్చర్యానికి గురి చేసేలా చేస్తోంది. అసలు ఆ భార్యాభర్తల మధ్య ఏం జరిగి ఉంటుందో కానీ? ఇలా నిప్పు పెట్టి వాటిని కాల్చడం మాత్రం అందరినీ ఆశ్చర్యపోయేలా చేస్తోంది. అయితే, ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

సమాచారం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన ఒక వివాహిత తన భర్త కోసం సుమారు 22 వేల విలువైన ఖరీదైన సూట్‌ను కొనుగోలు చేయాలనుకుందట.. అయితే, అంత పెద్ద మొత్తం పెట్టి దుస్తులు కొనడం అవసరమా అని భర్త భార్యతో అన్నాడట.. సొంత ఇల్లు కొనుగోలు చేయాలని లక్ష్యంతో డబ్బులు పొదుపు చేయాల్సిన అవసరం ఉందని.. అనవసర ఖర్చులు తగ్గించుకోవాలని అతడు భార్యకు సూచించాడట.. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం చోటుచేసుకుందని సమాచారం..

ఈ గొడవతో మనస్థాపానికి గురైన భార్య అలిగి తన పుట్టింటికి వెళ్ళిపోయిందట.. తీవ్ర ఆగ్రహానికి.. మానసిక ఒత్తిడికి లోనైనా భర్త వింత నిర్ణయం తీసుకున్నాడు.. ఇల్లు కొనుగోలు కోసం బ్యాంకులో జాగ్రత్తగా దాచుకున్న డబ్బులను విత్ డ్రా చేసి ఇంటికి తీసుకువచ్చాడట.. ఆపై తీవ్ర కోపంతో అతను 500 నోట్లను కుప్పలుగా పోసి నిప్పంటించాడట . కళ్ళముందే కరెన్సీ నోట్లు ఖాళీ బూడిదవుతున్న దృశ్యాలను వీడియో తీయగా. అది కాస్త సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ గా మారింది..

ఈ వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియా వినియోగదారులు కామెంట్ల రూపంలో స్పందిస్తూ వస్తున్నారు. కష్టపడి సంపాదించిన డబ్బు ఇలా కోపంతో తగలబెట్టడం మూర్ఖత్వమని కొందరు విమర్శిస్తుండగా.. మరికొందరి ఈ వీడియో పై అనేక అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో వ్యూస్ లైకుల కోసం ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని.. తగలబెట్టిన నోట్లు అసలు కరెన్సీ కాకపోవచ్చు అని అభిప్రాయపడుతున్నారు. అయితే, నోట్లు నిజమైనవని నమ్మిన చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు మాత్రం ఆశ్చర్యపోతూ వస్తున్నారు..
 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Flirting Lines (@flirting.lines)

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Viral News