SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Gujarat Two Headed Snake Video: లక్షల్లో ఒకటి.. గుజరాత్‌లో బైటపడ్డ అరుదైన రెండు తలల పాము.. వీడియో వైరల్..

Two headed snake found in Gujarat: ఒకే శరీరంలో రెండు వేర్వేరు మెదళ్ళు ఈ పాములో ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే.. ఈ అరుదైన పాము ఎక్కువకాలం జీవించదని చెబుతున్నారు.

Written By Inamdar Paresh
Published: Oct 06, 2026, 04:02 PM IST | Updated: Oct 06, 2026, 04:12 PM IST
Image Credit: Twoheadedsnakeingujaratvideo
Join

Rare Two headed wolf snake rescued in Gujarat video: గుజరాత్ లోని  దాహోద్ జిల్లాలో అరుదైన రెండు తలల పాము బైటపడింది. ఈ క్రమంలో ధన్‌పూర్ పరిధిలోని అగస్వాణి గ్రామంలోని  పొలంలో ఈ వింత పాము కనిపించింది.  ఈ పాము రెండు తలలను కల్గి  ఉంది. అదే విధంగా నాలుగు కళ్లను కల్గి ఉండి, సుమారు 6 అంగుళాల పొడవు ఉందని గుర్తించారు. వెంటనే స్థానికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

 

 

ఆ తర్వాత పాములను గుర్తించే నిపుణులు అక్కడకు చేరుకున్నారు. దీనికి  రెండు తలలు విడివిడిగా ఉండి, స్వతంత్రంగా పనిచేస్తున్నాయి. దీన్ని అరుదైన తోడేలు పాము (Wolf Snake) అని పిలుస్తారని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఇది లక్షలో ఒకటైన  అరుదైనపామని  శాస్త్రవేత్తలు సైతం దీన్ని చూసి ఆశ్చర్యపోతున్నారు. కానీ ఈ విశిష్టమైన పాము ఎక్కువ కాలం జీవించదని తెలిపారు.ఈ అరుదైన రెండు తలల పామును అటవీశాఖ అధికారులు సురక్షితంగా  కాపాడారు. ఈ రెండు తలల పాము జాతి గుజరాత్‌లో మొదటిసారిగా కనిపించింది. 

వన్యప్రాణి నిపుణుల ప్రకారం, ఇది ఒక "తోడేలు పాము లేదా సాధారణ వాడుకలో "వరుదంతి" అని కూడా పిలుస్తారు. ఇది పూర్తిగా విషరహితమైన పాము అని, మానవులకు ఎలాంటి ముప్పును కలిగించదని నిపుణులు చెబుతున్నారు. ఇది బల్లులు, చిన్న కీటకాలను ఆహరంగా తీసుకుంటుందని చెబుతున్నారు.    

శాస్త్రీయంగా, దీనిని బైసెఫాలీ అంటారని, ఇది ఒక జన్యుపరమైన రుగ్మత, ఇది పది లక్షల జాతులలో ఒకదానిలో మాత్రమే కనిపిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఈ పాములు ముందుకు  వెళ్లడంలోను, ఆహారంను పట్టుకొవడంలో కూడా తీవ్ర ఇబ్బందులు పడతాయి. 

అదే విధంగా శత్రువుల బారి నుంచి తమను తాము కాపాడు కోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఇలాంటి జీవులు ప్రకృతిలో ఎక్కువ కాలం జీవించలేవని చెబుతున్నారు.  ప్రకృతి యొక్క ఈ అద్భుతమైన రెండు తలల పామును చూసేందుకు స్థానికంగా ఉన్న వన్యప్రాణి ప్రేమికులు భారీగా తరలివస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES