• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రావణ దహనం బూడిద ఇంటికి తెస్తే లక్ష్మీదేవి వస్తుందా? శాస్త్రం ఏం చెబుతోంది?

రావణ దహనం బూడిద ఇంటికి తెస్తే లక్ష్మీదేవి వస్తుందా? శాస్త్రం ఏం చెబుతోంది?

Ravana Dahan Ash: కొన్ని ప్రాంతాల్లో విజయదశమి రోజున రావణ దహనం తర్వాత మిగిలిన బూడిదను ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. కొంతమంది రావణ బొమ్మ తయారీకి వినియోగించిన కట్టెలను కూడా ఇంటికి తెచ్చుకుంటారు. ఇలా తెచ్చుకుంటే లక్ష్మీదేవి ఇంట్లో నిలుస్తుందని వారి నమ్మకం.. అయితే దీనిపై శాస్త్రం ఏం చెబుతుంది? పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 19, 2026, 12:31 PM IST|Updated: Oct 19, 2026, 12:33 PM IST
joinshare
రావణ దహనం బూడిద ఇంటికి తెస్తే లక్ష్మీదేవి వస్తుందా? శాస్త్రం ఏం చెబుతోంది?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. బైక్ షోరూమ్ లో అమ్మవారు పూనినట్లు ఊగిపోయిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాక్.. వీడియో..

Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. బైక్ షోరూమ్ లో అమ్మవారు పూనినట్లు ఊగిపోయిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాక్.. వీడియో..

2

తెలంగాణలో ఎల్‌నినో ముప్పు ఉన్నా 75 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు?

3

రావణ దహనం బూడిద ఇంటికి తెస్తే లక్ష్మీదేవి వస్తుందా? శాస్త్రం ఏం చెబుతోంది?

4

Tiger Shroff firing: టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్..

5

విజయ దశమి నుంచి ఈ రాశులకు అన్ని విజయాలే.. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి.. డబ్బే డబ్బు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Ravana Dahan Ash: విజయదశమి పర్వదినాన చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా రావణ దహనాన్ని పల్లె పల్లెనా చేయడం ఒక ఆచారంగా వస్తుంది. అయితే ఇటీవల కొన్ని ప్రాంతాల్లో దహనం ముగిసిన వెంటనే జనం మంటలను సైతం లెక్కచేయకుండా బూడిదతో పాటు కాల్చిన కర్రల కోసం ఎగబడుతున్నారు. ఈ బూడిదను ఇంట్లో ఉంచితే సాక్షాత్తు లక్ష్మీదేవి నడిచి వస్తుందని.. అలాగే అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు. ఇంతకీ ఇది ఎంతవరకు నిజం.. ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

రావణుడు రాక్షసుడే అయినప్పటికీ ఆయన మహా శివ భక్తుడు.. అంతేకాకుండా సకల వేదాలతో పాటు జ్యోతిష్యం తెలిసిన అపార మేధావి అన్న సంగతి అందరికీ తెలిసిందే.. స్వర్ణలంకకు పరిపాలించే చక్రవర్తి కావడం వల్ల.. ఆయన చితా బస్మానికి విశేష శక్తులు ఉంటాయని చాలామంది నమ్ముతూ ఉంటారు. అంతేకాకుండా అందులో ఉండే శక్తులు మానవులకు మంచి చేస్తాయని అనుకుంటూ ఉంటారు. అయితే మీరు కూడా ఇలాగే అనుకుంటున్నారా?

రావణుడి బొమ్మ బూడిదను ఇంటి గుమ్మానికి కడితే ఎలాంటి దుష్ట శక్తులు.. నరదిష్టి ఇంట్లోకి రావని స్థానికుల నమ్మకం.. కాలిన చెక్కల మొక్కలను ఎరుపు రంగు వస్త్రాలలో చుట్టి బీరువాల్లో లేదా కౌంటర్లలో పెట్టుకుంటే రావణుడి సంపద ప్రభావంతో దరిద్రం పోయి డబ్బులు వస్తుందని చాలామంది భావిస్తారు.. అంతేకాకుండా చేతబడులతో పాటు క్షుద్ర పూజలు ప్రయోగాల నుంచి ఈ బూడిద రక్షిస్తుందని భావన కూడా కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో బలంగా ఉంది..

ఒక శాస్త్రం ఏం చెబుతోంది..
ఈ వింత ఆచారంపై పండితులతో పాటు ఆధ్యాత్మికవేత్తలు పూర్తిగా భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అధర్మానికి.. అహంకారానికి ప్రతీకగా ఉండే రావణుడి బూడిద ద్వారా అష్టలక్ష్ములు ప్రసన్నమవుతారని వాల్మీకి రామాయణం లో గాని.. మరి ఇతర గ్రంథాల్లో కానీ ఎలాంటి ఆధారాలు లేవని.. శుభంతో పాటు పవిత్రత ఉన్న చోటే లక్ష్మీదేవి నివసిస్తుందని తప్ప.. అధర్మ సంకేతాలు దగ్గర కాదని శాస్త్రం చెబుతోంది.. సనాతన సంప్రదాయం ప్రకారం దిష్టిబొమ్మలు లేదా శవాల దహన బూడిదను నివాస గృహాల్లో.. ముఖ్యంగా పూజ మందిరాలు లేదా ధనస్థానాల్లో ఉంచడం నిషిద్ధంగా భావిస్తూ ఉంటారట..

ప్రస్తుత కాలంలో రావణుడి బొమ్మ తయారీలో రసాయన రంగులతో పాటు ప్లాస్టిక్ వ్యర్ధాలు, తీవ్రమైన పేలుడు పదార్థాలు వాడుతూ ఉన్నారు. అలాంటి నిప్పుల్లోకి దూకడం వల్ల గాయాల పాలయ్యే అవకాశాలు ఉన్నాయని.. పూరితమైన ఆ బూడిద తాకడం లేదా ఇంట్లో ఉంచుకోవడం వల్ల చర్మ సమస్యలతో పాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు సూచిస్తున్నారు. దహనం అనేది మనసులో కామతో పాటు క్రోధ అహంకారాలను దహించి వేయడమేనని.. ధర్మంతో పాటు నీతి శ్రమ ఉన్నచోటే నిజమైన సంపద నిలుస్తుందని నిపుణులు చెబుతూ ఉన్నారు..
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Trending News