• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Tiger Shroff firing: టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్..

Tiger Shroff firing: టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్..

Tiger shroff gun fire row: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై ముంబైలో జరిగిన హత్యయత్నం ఘటనలో స్థానిక పోలీసులు 15 టీమ్ లను రంగంలోకి దింపాయి. ఈ క్రమంలో ముగ్గురు అనుమానితుల్ని కోటా రైల్వేస్టేషన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 19, 2026, 12:24 PM IST|Updated: Oct 19, 2026, 12:34 PM IST
joinshare
Tiger Shroff firing: టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్..
Image Credit: Tiger shroff

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. బైక్ షోరూమ్ లో అమ్మవారు పూనినట్లు ఊగిపోయిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాక్.. వీడియో..

Video Viral: ఇదెక్కడి మాస్ రా మావా.. బైక్ షోరూమ్ లో అమ్మవారు పూనినట్లు ఊగిపోయిన మహిళ.. అసలు విషయం తెలిస్తే షాక్.. వీడియో..

2

తెలంగాణలో ఎల్‌నినో ముప్పు ఉన్నా 75 లక్షల ఎకరాల్లో యాసంగి సాగు?

3

రావణ దహనం బూడిద ఇంటికి తెస్తే లక్ష్మీదేవి వస్తుందా? శాస్త్రం ఏం చెబుతోంది?

4

Tiger Shroff firing: టైగర్ ష్రాఫ్‌ పై కాల్పుల ఘటన.. రాజస్థాన్‌లో ముగ్గురు షూటర్ల అరెస్ట్..

5

విజయ దశమి నుంచి ఈ రాశులకు అన్ని విజయాలే.. వృత్తి, వ్యాపారాల్లో పురోగతి.. డబ్బే డబ్బు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Tiger shroff mumbai car firing case three suspects arrested: బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్ పై కాల్పుల ఘటనతో  ముంబై నగరం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఇప్పటికే 1998 నాటి కృష్ణ జింకల వేట  ఘటనలో కండల వీరుడు సల్మాన్ ఖాన్‌ ను లారెన్స్ బిష్టోయ్ గ్యాంగ్ టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. పలు మార్లు ఆయనపై కాల్పులకు కూడా తెగబడింది. ఇక తాజాగా.. ఆయన సన్నిహితులను కూడా ఈ గ్యాంగ్ టార్గెట్ చేసినట్లు ఇటీవల జరిగిన ఘటనతో బైటపడింది.

ముంబై పశ్చిమ శివారు ప్రాంతంలో నిన్న కాల్పుల ఘటన జరిగింది. జుహులోని పుష్పా పార్క్ దగ్గరలో.. నటుడు ష్రాఫ్ ఫుట్‌బాల్ సెషన్ తర్వాత కారులో వెళ్తున్నాడు. ఇంతలో తెల్లని షర్ట్ లు వేసుకున్న దుండగులు బైక్ పై వచ్చి  ష్రాఫ్ కారు పై ఐదు రౌండ్ల వరకు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ష్రాఫ్ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డారు. ష్రాఫ్ కు చిన్నపాటి గాయాలయ్యాయి. 

వెంటనే అప్రమత్తమైన తన డ్రైవర్ ను టైగర్ ష్రాఫ్ కారులో కూర్చుండబెట్టి తనే డ్రైవింగ్ చేస్తు ఆస్పత్రికి తీసుకెళ్లాడు. మొత్తంగా నిన్న పెద్ద ఘటనన నుంచి హీరో ష్రాఫ్ బైటపడ్డాడు. దీనిపై ముంబై పోలీసులు కేసు నమోదు చేసుకుని 15 టీమ్ లను రంగంలోకి దింపాయి. 

అయితే..  నటుడు టైగర్ ష్రాఫ్‌పై జరిగిన హత్యాయత్నం కేసులో అనుమానితులుగా భావిస్తున్న ముగ్గురు షూటర్లను కోటా రైల్వే స్టేషన్  రాజస్థాన్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ గ్యాంగ్ కు 
లారెన్స్ బిష్ణోయ్ ముఠాతో  సంబంధాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. 

పట్టుబడ్డ వారిలో ఇద్దరు హర్యానాకు చెందినవారు కాగా, మరొకరు మహారాష్ట్రకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. పక్కా ప్లాన్ తోనే టైగర్ ష్రాఫ్ పై కాల్పులకు నిందితుడు తెగబడ్డట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ఇప్పటికే ఆ కుటుంబాన్ని పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే  మాట్లాడుతూ కాల్పులకు తెగబడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ముంబైలో ఇలాంటి ఘటనలు జరగనివ్వబోమని తెల్చి చెప్పారు. మరోవైపు ఈ కాల్పుల ఘటనను ఆల్ ఇండియా సినీ వర్కర్స్ అసోసియేషన్ తీవ్రంగా ఖండించింది. ఈ కాల్పుల ఘటనతో దసరా పండగ వేళ ముంబైలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News
Telugu News