SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Realme 17 Pro Plus వచ్చేస్తోంది? 200MP కెమెరా, భారీ బ్యాటరీతో అదిరిపోయే ఫీచర్లు!

Realme 17 Pro Series: త్వరలోనే మార్కెట్లోకి realme 17 ప్రో సిరీస్ స్మార్ట్‌ఫోన్‌ అందుబాటులోకి రాబోతోంది. ఇది ఎన్నో శక్తివంతమైన ఫీచర్లను కలిగి ఉండడమే కాకుండా అద్భుతమైన డిస్ప్లే తో లంచ్ కాబోతోంది. దీనిని కంపెనీ అత్యంత త్వరలోనే అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 25, 2026, 03:33 PM IST | Updated: Oct 25, 2026, 03:34 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Realme 17 Pro Series: ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్‌ తయారీ సమస్త రియల్ మీ త్వరలో మార్కెట్లోకి దిమ్మతిరిగే మొబైల్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ రియల్ మీ 17 సిరీస్‌లో అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌లో భాగంగా మొత్తం రెడ్ మోడల్స్ అందుబాటులోకి రాబోతున్నాయి. మొదటి మోడల్ realme 17 pro అయితే.. రెండవది realme 17 ప్రో ప్లస్ పేరుతో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో కంపెనీ అద్భుతమైన కెమెరా సెటప్‌తో పాటు బ్యాటరీతో లాంచ్ చేసేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అలాగే గత జనవరిలో రియల్ మీ కంపెనీ రియల్ మీ 16 ప్రో సిరీస్‌ను అందుబాటులోకి తీసుకు వచ్చిన సంగతి తెలిసిందే. వీటికి అప్డేట్ వేరియంట్ గా.. ఈ కొత్త సిరీస్ ను అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇందులో కంపెనీ 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు త్రిపుల్ కెమెరా సెటప్ తో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ సిరీస్ కు సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

ఇటీవల లీకైన వివరాల ప్రకారం రియల్ మీ 17 ప్రో అద్భుతంగా ఉండబోతుందని ప్రముఖ టిప్‌స్టర్ దేబయన్ రాయ్ వెల్లడించారు అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 10,000 mAh బ్యాటరీను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. రియల్ మీ 17 ప్రో ప్లేస్ లో ఎన్నో రకాల కొత్త ఫీచర్లు అందుబాటులోకి రాబోతున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది డిజైన్ పరంగా చాలా ప్రత్యేకంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది..

రియల్‌మీ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో శక్తివంతమైన 200-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా యూనిట్ కలిగి ఉండబోతున్నట్లు లీకైన వివరాలు తెలుపుతున్నాయి.. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్‌లో 50-మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, అల్ట్రా-వైడ్-యాంగిల్ కెమెరా కూడా కలిగి ఉండబోతున్నట్లు సమాచారం.. ఇక రియల్‌మీ 17 ప్రోలో 1.5K రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన ఫ్లాట్ OLED డిస్ప్లే ప్యానల్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది.. దీంతోపాటు ఈ స్మార్ట్‌ఫోన్ కొన్ని గేమ్‌ల కోసం 165Hz వరకు రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తున్నట్లు కూడా లీకైన వివరాలు స్పష్టం చేశాయి.. రియల్‌మీ 17 ప్రో లేదా రియల్‌మీ 17 ప్రో ప్లస్ మీడియాటెక్ డైమెన్సిటీ 7500 చిప్‌సెట్‌తో ప్రాసెసర్‌పై రన్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో ప్లాస్టిక్ ఫ్రేమ్ తో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం..

అలాగే ఈ రియల్‌మీ 17 ప్రో స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన డిస్ప్లే గరిష్టంగా 6,500 నిట్స్ వరకు బ్రైట్నెస్ సపోర్ట్ అందిస్తోంది. అంతేకాకుండా ఇది AMOLED స్క్రీన్‌లను కలిగి ఉండబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్ అద్భుతమైన ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ను కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇక గతంలో విడుదలైన రియల్ మీ 16 ప్రో ప్లస్ వివరాల్లోకి వెళితే.. ఇది ఎంతో అద్భుతమైన స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 4 ప్రాసెసర్‌ పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఇది వెనక భాగంలో అద్భుతమైన కెమెరా యూనిట్.. అలాగే ఇది ఎంతో శక్తివంతమైన 7,000 mAh బ్యాటరీను కలిగి ఉండడం విశేషం..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES