• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!

ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!

ప్రైవేట్ రంగంలోని దిగ్గజ టెలికాం కంపెనీ ఎయిర్‌టెల్ ఇప్పటికే కొన్ని మిలియన్ల మంది వినియోగదారులను కలిగి ఉంది. దీని యూజర్ ఫ్రెండ్లీ రీఛార్జీ ప్లాన్ల ద్వారా చాలామంది వివిధ సేవలను పొందుతున్నారు. అంతేకాకుండా, బడ్జెట్ ప్లాన్లలో అప్పుడప్పుడు కొత్త ప్లాన్లను కూడా ఎయిర్‌టెల్ వినియోగదారులకు పరిచయం చేస్తూనే ఉంది. ఈరోజు మనం రూ.838 రీఛార్జ్ ప్లాన్ ద్వారా మీరు పొందే ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 25, 2026, 04:27 PM IST|Updated: Oct 25, 2026, 04:32 PM IST
joinshare
ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!
Image Credit: Airtel 838 Plan Details 2026

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

2

ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!

3

వామ్మో.. యువకుడి ప్యాంటులోకి నాగుపాము.. ఏం చేశారో చూడండి!

4

TGSRTC Weekly Pass: పండగపూట ప్రయాణికులకు ఆర్టీసీ వరం..రూ.600కే 7 రోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణం అన్‌లిమిటెడ్!

5

పగటిపూట వీధి దీపాలు ఆన్‌లోనే.. జగిత్యాల మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యంపై విమర్శలు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

మీరు ఎయిర్‌టెల్ వినియోగదారులైతే, త్వరలోనే మొబైల్ రీఛార్జ్ చేసుకోవాలని అనుకుంటున్నారా? నెల, మూడు నెలలు, తొమ్మిది నెలలు, సంవత్సరం.. ఇలా మీకు ఏ ప్లాన్ ఉత్తమమో ఆలోచిస్తున్నారా? ఈ మధ్య రూ.838 రీఛార్జ్ ప్లాన్ బాగా ట్రెండింగ్లో ఉంది. ఇందులో ఓటీటీ సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్రతిరోజూ ఇంటర్నెట్ డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, ఎస్ఎంఎస్ సౌకర్యాలు కూడా పొందవచ్చు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో రీఛార్జ్ చేసుకుంటే ప్రతిరోజు 3 జీబీ డేటా లభిస్తుంది, అలాగే ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు పొందుతారు. ఈ ప్లాన్తో పాటు అమెజాన్ ప్రైమ్, ఎయిర్‌టెల్ ప్రీమియం, అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం ప్రయోజనాలు కూడా లభిస్తాయి.

ఎయిర్‌టెల్ రూ.838 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్..
ఈ ఎయిర్‌టెల్ రూ.838 ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ వ్యాలిడిటీ 56 రోజుల పాటు లభిస్తుంది. ఇందులో మీరు ప్రతిరోజు 3 జీబీ డేటా పొందుతారు. అలాగే అపరిమిత లోకల్, ఎస్టీడీ, రోమింగ్ కాల్స్ కూడా లభిస్తాయి. ప్రతిరోజు 100 ఎస్ఎంఎస్లు అందుతాయి. దీంతో పాటు 5జీ నెట్‌వర్క్ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో అధిక వేగంతో ఇంటర్నెట్ సేవలను కూడా ఆస్వాదించవచ్చు.
అమెజాన్ ప్రైమ్ మరియు ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం

ఈ రీఛార్జ్ ప్లాన్తో మీరు పొందే అతిపెద్ద ప్రయోజనం ఓటీటీ సబ్స్క్రిప్షన్. 838 రీఛార్జ్తో దీర్ఘకాలిక వ్యాలిడిటీతో పాటు, ఓటీటీ కోసం అదనంగా డబ్బు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ ప్రీపెయిడ్ ప్లాన్తో 56 రోజుల పాటు ఉచిత అమెజాన్ ప్రైమ్ ట్రయల్ లభిస్తుంది. ఇందులో వన్-డే షిప్పింగ్ ప్రయోజనం కూడా పొందవచ్చు. అంతేకాకుండా, ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్ ప్రీమియం సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. దీని ద్వారా 18కు పైగా ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌లో కంటెంట్‌ను వీక్షించవచ్చు. ఇందులో సోనీ లివ్, లయన్స్ గేట్ ప్లే, ఆహా, చౌపాల్, సన్ నెక్స్ట్ వంటి ప్లాట్ ఫామ్స్ యాక్సెస్ కూడా లభిస్తుంది.

Read Also: ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్‌ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!

12 నెలల పాటు అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం..
ఈ రీఛార్జ్ ప్లాన్‌తో మీరు 12 నెలల పాటు ఎయిర్‌టెల్ ఎక్స్ట్రీమ్ అడోబ్ ఎక్స్‌ప్రెస్ ప్రీమియం కూడా పొందుతారు. దీని విలువ సుమారు రూ.4,000. ఈ టూల్ ద్వారా పోస్టర్లు, సోషల్ మీడియా పోస్టులు, థంబ్నెయిల్స్ ఇతర డిజైన్లను సులభంగా తయారు చేసుకోవచ్చు. కంటెంట్ క్రియేటర్స్ కు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే సోషల్ మీడియాలో తరచూ పోస్టులు చేసేవారికి కూడా ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Telugu News
Business News