• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

Schools Holiday For Two Days From October 28th To 29 In These States: దూసుకొస్తున్న తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో పలు చోట్ల విద్యార్థులకు సెలవులు ప్రకటించారు. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో ముందస్తు జాగ్రత్త చర్యగా పలు ప్రాంతాల్లో పాఠశాలలకు సెలవులు ఇచ్చారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 25, 2026, 04:56 PM IST|Updated: Oct 25, 2026, 04:59 PM IST
joinshare
Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు
Image Credit: Schools Holiday For Two Days

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
RCB: వేలంలో బెంగళూరు జట్టు భారీ వ్యూహం.. వదులుకునే 7 మంది ఆటగాళ్లు వీరే?

RCB: వేలంలో బెంగళూరు జట్టు భారీ వ్యూహం.. వదులుకునే 7 మంది ఆటగాళ్లు వీరే?

2

Schools Holiday: విద్యార్థులకు గుడ్‌న్యూస్‌.. రెండు రోజులు స్కూళ్లకు సెలవు

3

ఎయిర్‌టెల్‌ ధమాకా ప్లాన్.. 56 రోజుల వాలిడిటీ, రోజుకు 3GB డేటా, ఉచితంగా అమెజాన్ ప్రైమ్, ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం!

4

వామ్మో.. యువకుడి ప్యాంటులోకి నాగుపాము.. ఏం చేశారో చూడండి!

5

TGSRTC Weekly Pass: పండగపూట ప్రయాణికులకు ఆర్టీసీ వరం..రూ.600కే 7 రోజుల పాటు ఏసీ బస్సుల్లో ప్రయాణం అన్‌లిమిటెడ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Two Days Schools Holiday: తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఏపీతోపాటు పలు రాష్ట్రాలకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ మేరకు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ తీరం వైపు దూసుకొస్తున్న తీవ్ర తుఫాను హెచ్చరికల నేపథ్యంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో ఐదు జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ఏపీలోని పలు జిల్లాల్లో కూడా విద్యార్థులకు సెలవులు ఇచ్చే అవకాశం ఉంది.

తీవ్ర తుఫాను నేపథ్యంలో సముద్రంలోకి వెళ్లవద్దని మత్స్యకారులకు సూచించారు. ఇప్పటికే సముద్రంలో వేటకు వెళ్లిన వారు వెంటనే తీరానికి చేరుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలపడడంతో దక్షిణ, తూర్పు భారతదేశంలోని తీర ప్రాంతాలు అప్రమత్తమయ్యాయి. తమిళనాడు, పుదుచ్చేరిలలో భారీ వర్షాలు కురుస్తుండగా.. ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబర్ 28న తుఫాను తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

తీరం దాటే ప్రాంతం
అక్టోబర్ 28వ తేదీన మధ్యాహ్న సమయానికి బాపట్ల - విశాఖపట్నం మధ్య ఆంధ్రప్రదేశ్, యానాం తీరాలను ఈ తుఫాను దాటే అవకాశం ఉంది. తీరం దాటే సమయంలో గంటకు 115-125 కి.మీ వేగంతో, గరిష్టంగా 140 కి.మీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ తుఫానుకు 'అర్నాబ్' అని పేరు పెట్టారు. దీని అర్థం బెంగాలీ భాషలో 'సముద్రం'. అర్నార్‌ పేరును బంగ్లాదేశ్ సూచించింది.

ఆంధ్రప్రదేశ్‌ అధికార యంత్రాంగం అప్రమత్తం
అర్నాబ్‌ తుఫాను ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. తుఫాను ప్రభావంతో కోస్తాంధ్ర ప్రాంతంలో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. ఏపీలో ప్రత్యక్ష ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు ఏపీ యంత్రాంగం సన్నద్ధమైంది. తీర ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికార వర్గాలు చర్యలు చేపట్టాయి.

ఒడిశాలో పాఠశాలలు బంద్
భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో ఒడిశాలో పెద్ద ఎత్తున విద్యా సంస్థలకు సెలవులు ప్రకించారు. గంజాం, గజపాటి, రాయగడ, కొరాపుట్ మల్కన్‌గిరి జిల్లాల్లో అక్టోబర్ 28, 29 తేదీలలో పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలను మూసివేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో జిల్లా కలెక్టర్లు, మేజిస్ట్రేట్లు అప్రమత్తమై ఆయా ప్రాంతాల్లో సెలవులు ప్రకటించారు. అయితే తుఫాను హెచ్చరికల నేపథ్యంలో కీలక అధికారుల సెలవులను రద్దు చేశారు.

తమిళనాడు, పుదుచ్చేరిలో వర్షాలు
తుఫాను ప్రభావంతో తీర ప్రాంతాలైన చెన్నై, నాగపట్టణం, కడలూరు, కారైకాల్, పాంబన్, తూత్తుకుడి సహా తొమ్మిది ఓడరేవుల్లో తుఫాను హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికే పుదుచ్చేరిలో కురుస్తున్న భారీ వర్షాలతో కోస్ట్ రోడ్డు, కృష్ణానగర్, లాస్‌పేట్ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
Rain News
School Holiday
Telugu News
Trending News