• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Redmi K100 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదిరిపోయే ఫీచర్లు!

Redmi K100 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదిరిపోయే ఫీచర్లు!

Redmi K100: మార్కెట్లోకి రెడ్‌మి K100 సిరీస్ స్మార్ట్‌ఫోన్స్‌ విడుదల కాబోతున్నాయి. దీనిని కంపెనీ మోస్ట్ పవర్ఫుల్ ఫీచర్లతో అందుబాటులోకి తీసుకురాబోతోంది. ముఖ్యంగా ఇది 10,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్లను కలిగి ఉండడం విశేషం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 21, 2026, 03:15 PM IST|Updated: Oct 21, 2026, 03:17 PM IST
joinshare
Redmi K100 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదిరిపోయే ఫీచర్లు!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Video Viral: ఓర్నాయనో.. కాస్లీ కారులో వచ్చి మేకలను ఏంచేశారో తెలుసా..?.. వీడియో వైరల్..

Video Viral: ఓర్నాయనో.. కాస్లీ కారులో వచ్చి మేకలను ఏంచేశారో తెలుసా..?.. వీడియో వైరల్..

2

రైల్వేలో భారీ నోటిఫికేషన్ విడుదల.. 5,236 NTPC ఉద్యోగాలు, డిగ్రీ, ఇంటర్ అర్హతతో భర్తీ! పరీక్ష విధానంలో కీలక మార్పులు ఇవే!

3

వామ్మో.. సింహానికి స్నానం చేయిస్తున్న యువకుడు.. వీడియో

4

Hyderabad: వాహనదారులకు బిగ్ అలర్ట్.. హైదరాబాద్ మూడు రోజుల పాటు ఈ మార్గాల్లో ట్రాఫిక్ ఆంక్షలు.. పోలీసుల కీలక ప్రకటన..

5

Redmi K100 సిరీస్ వచ్చేస్తోంది.. 10,000mAh బ్యాటరీ, 100W ఫాస్ట్ ఛార్జింగ్‌తో అదిరిపోయే ఫీచర్లు!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Redmi K100: రెడ్‌మి స్మార్ట్‌ఫోన్స్‌కి మార్కెట్లో ఎంత డిమాండ్ ఉందో మనందరికీ తెలుసు. అత్యంత తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్స్‌ను విడుదల చేయడంలో ఈ కంపెనీ ఎప్పుడు ముందుంటుంది. అలాగే ఇది ఎప్పటికప్పుడు అద్భుతమైన ఫీచర్లతో కొత్త కొత్త మొబైల్స్ విడుదల చేయడంతో యువత కూడా ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే, ఈ కంపెనీ అత్యంత తొందరలోనే రెడ్‌మి K100 సిరీస్ విడుదల చెయ్యబోతున్నట్లు తెలుస్తోంది. ఇది అద్భుతమైన కెమెరా సెటప్ తో పాటు.. ఎన్నో శక్తివంతమైన ఫీచర్లతో అందుబాటులోకి రాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే దీనికి సంబంధించిన కొన్ని ఫీచర్స్ కూడా లీకై అందర్నీ ఆశ్చర్యపోయేలా చేశాయి.

రెడ్‌మి K100 స్మార్ట్‌ఫోన్‌ అక్టోబర్ 27వ తేదీన మార్కెట్లోకి విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ లాంచింగ్ ముందే.. దీనికి సంబంధించిన కీలకమైన స్పెసిఫికేషన్స్ ఒక్కొక్కటి లీకయ్యాయి.. ముఖ్యంగా ఇందులో అత్యంత శక్తివంతమైన బ్యాటరీ అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇది మోస్ట్ పవర్ఫుల్ 10,000mAh బ్యాటరీని కలిగి ఉండబోతుంది. అలాగే, ఈ కంపెనీలో వచ్చి మొట్టమొదటి పెద్ద బ్యాటరీ మొబైల్‌గా నిలిచే అవకాశాలు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇందులో అద్భుతమైన ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ సపోర్ట్ కూడా లభించబోతోంది. ముఖ్యంగా లీక్ అయిన వివరాల ప్రకారం..100W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుందని తెలుస్తోంది. అదేవిధంగా ఇది 27W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులో ఉండబోతోంది.

ఈ బ్యాటరీకి సంబంధించిన మరో అత్యంత విషయం ఏమిటంటే.. ఇందులో వచ్చే బ్యాటరీ సరికొత్త జిన్‌షాజియాంగ్ టెక్నాలజీని కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో 28 శాతం సిలికాన్ కార్బన్ కంటెంట్ ఉంటుందని.. దీనివల్ల డెన్సిటీలో మార్పులు వచ్చే అవకాశాలు ఉన్నాయని లీకైన వివరాలు చెబుతున్నాయి. అలాగే ఇది ఎంతో ప్రత్యేకమైన 6.83-అంగుళాల డిస్‌ప్లే కలిగి ఉంటుంది. దీంతో పాటు 165Hz రిఫ్రెష్ రేట్ సపోర్టుతో లభిస్తుంది. ఇది చాలా ప్రత్యేకమైన 3500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో పాటు.. 480Hz మల్టీ-ఫింగర్ టచ్ రేట్‌తో అందుబాటులోకి రావడం విశేషం..

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌ 40కి పైగా గేమ్‌లలో 165 fps గేమింగ్‌కు సపోర్ట్ చేసే అవకాశాలున్నట్లు లీకైన వివరాలు చెబుతున్నాయి. అంతేకాకుండా దీనిని కంపెనీ చాలా ప్రత్యేకమైన ఆండ్రాయిడ్ 17 ఆధారిత షియోమి హైపర్‌ఓఎస్ 4 ఆపరేటింగ్ సిస్టం పై అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఇందులో సెక్యూరిటీ కోసం.. 3D అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ స్కానర్‌ సపోర్టును కూడా అందించింది. అయితే ఈ ఫోన్ అధికారికంగా అక్టోబర్ 27వ తేదీన విడుదల కాబోతోంది.. అంతకుముందే ఫీచర్లు లీక్ అవ్వడం మార్కెట్లోని వినియోగదారులను మరింత ఆకర్షించేలా చేసింది..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tech News
Telugu News