• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ గిఫ్ట్.. 64 శాతానికి డీఏ..? జీతాల పెంపు లెక్కలు ఇవే..!

DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ గిఫ్ట్.. 64 శాతానికి డీఏ..? జీతాల పెంపు లెక్కలు ఇవే..!

Central Government Employees DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోదీ సర్కార్ త్వరలోనే తీపి కబురు అందించేందుకు సిద్ధమవుతోంది. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) తాజా గణాంకాల ప్రకారం జూలై డీఏ ఈసారి 4 శాతం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో ప్రస్తుతం 60 శాతంగా ఉన్న డీఏ 64 శాతానికి చేరుకోనుంది. వివరాలు ఇలా..

Written ByAshok Krindinti
Published: Sep 29, 2026, 12:21 PM IST|Updated: Sep 29, 2026, 12:24 PM IST
joinshare
DA Hike July 2026: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫెస్టివల్ గిఫ్ట్.. 64 శాతానికి డీఏ..? జీతాల పెంపు లెక్కలు ఇవే..!
Image Credit: DA Hike July 2026 (Source: File)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Central Government Employees DA Hike: కొత్త పే కమిషన్‌పై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో జోరుగా చర్చలు సాగుతున్న తరుణంలో మోదీ సర్కార్ మరో గుడ్‌న్యూస్ చెప్పే అవకాశం కనిపిస్తోంది. జూలై 2026 విడతకు సంబంధించిన కరవు భత్యం (DA) పెంపుపై తాజా అంచనాలు వెలువడుతున్నాయి. ఎకనామిక్ టైమ్స్ నివేదిక ప్రకారం.. ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (AICPI-IW) గణాంకాల ఆధారంగా ఈసారి డీఏను 60 శాతం నుంచి 64 శాతానికి పెంచే అవకాశం ఉందని తెలిపింది. ప్రస్తుతం కేంద్రం ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా.. దసరా, దీపావళి సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను పెంచుతుంది. ప్రభుత్వ నిర్ణయం ఎప్పుడు వచ్చినా.. జూలై 1వ తేదీ నుంచి జీతాల పెంపు వర్తించనుంది.

పండుగల సీజన్ సమీపిస్తుండటం.. ఖర్చులు పెరుగుతుండటంతో డీఏ/డీఆర్ పెంపు ఫైలు ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని 'కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్' డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌పెండిచర్‌ను కోరింది. తాము ఎలాంటి ముందస్తు చెల్లింపులు లేదా అదనపు ప్రయోజనాలను డిమాండ్ చేయడం లేదని.. సాధారణ ప్రక్రియ ప్రకారం ఉద్యోగులకు అందాల్సిన బకాయిలు, సవరించిన వేతనాలను ఆలస్యం లేకుండా విడుదల చేయాలని కాన్ఫెడరేషన్ సెక్రటరీ జనరల్ ఎం.ఎస్.వెంకటేశన్ లేఖలో రాశారు.

గతంలో డీఏ పెంపు ఇలా..

  • జూలై 2023: 46 శాతం
  • జనవరి 2024: 50 శాతం
  • జూలై 2024: 53 శాతం
  • జనవరి 2025: 55 శాతం
  • జూలై 2025: 58 శాతం
  • జనవరి 2026: 60 శాతం

జీతాల పెంపు ఎలా అంటే..?

ఉదాహరణకు ఒక ఉద్యోగి బేసిక్ పే రూ.18 వేలు అయితే.. ప్రస్తుత 60 శాతం ప్రకారం డీఏగా రూ.10,800 లభిస్తుంది. 64 శాతానికి పెంచితే.. ఇది రూ.11,520 అవుతుంది. అంటే నెలకు రూ.720 శాలరీ పెరుగుతుంది. రూ.44,900 బేసిక్ శాలరీకి డీఏ రూ.26,940 నుంచి రూ.28,736 వరకు పెరుగుతుంది. అంటే నెలకు రూ.1,796 జీతం పెరుగుతుంది. రూ.56,100 మూల వేతన ఉంటే.. నెలకు రూ.2,244 జీతం పెరుగుదల ఉంటుంది. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపిన వెంటనే కొత్త డీఏ పెంపు, జూలై నుంచి రావాల్సిన బకాయిలపై అధికారిక ఉత్తర్వులు రానున్నాయి.

Add Zee News as a Preferred Source
TAGS:
DA Hike
Govt Schemes
Telugu News