SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Samsung లవర్స్‌కు గుడ్ న్యూస్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో Galaxy A58 5G త్వరలోనే లాంచ్!

Samsung Galaxy A58 5G Launch Soon: సాంసంగ్ గెలాక్సీ A58 5G స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లోకి త్వరలోనే లాంచ్‌ కాబోతోంది. దీనిని కంపెనీ ప్రీమియం డిజైన్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 03, 2026, 03:49 PM IST | Updated: Nov 03, 2026, 03:50 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Samsung Galaxy A58 5G Launch Soon: ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ కంపెనీ సాంసంగ్ మార్కెట్‌లోకి త్వరలోనే అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయబోతోంది. దీనిని కంపెనీ సాంసంగ్ గెలాక్సీ A58 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే లాంచ్‌ చేయబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా లీక్‌ అయ్యాయి. దీనిని కంపెనీ వచ్చే ఏడాదిలో అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని మొదట భారత మార్కెట్‌లోకి విడుదల చేసి.. ఆ తర్వా అంతర్జాతీయ మార్కెట్‌లోకి అందుబాటులోకి తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

సాంసంగ్ గెలాక్సీ A58 5G స్మార్ట్‌ఫోన్‌ SM-A5860 మోడల్ నెంబర్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఎంతో శక్తివంతమైన 45W ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లభించబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ 2.0 టెక్నాలజీకి సపోర్ట్‌ను అందిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో బ్యాటరీని సుమారు 30 నిమిషాల్లో 0 నుంచి 60 శాతం వరకు ఛార్జ్ చేయవచ్చని సాంసంగ్‌ తెలిపింది. అంతేకాకుండా ఇది చాలా అద్భుతమైన డిజైన్‌ను కూడా కలగి ఉంటుంది..

సాంసంగ్ గెలాక్సీ A58 5G స్మార్ట్‌ఫోన్‌ ఎంతో శక్తివంతమైన 5,000 mAh బ్యాటరీని కలిగి ఉంటుందని టిప్‌స్టర్ తెలిపారు. ఈ స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలతో పాటు వీడియో కాల్స్ కోసం ఫ్రంట్‌ భాగంలో 12-మెగాపిక్సెల్ కెమెరాను కూడా కలిగి ఉండే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది 6.7-అంగుళాల FHD ప్లస్‌ సూపర్ AMOLED ప్లస్‌ డిస్‌ప్లేను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఇది 1,080 x 2,340 పిక్సెల్స్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ వెనుక భాగంలో చాలా అద్భుతమైన 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 5-మెగాపిక్సెల్ మాక్రో కెమెరాలు కూడా లభిస్తున్నాయి. అంతేకాకుండా 12-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. దీని ఫ్రంట్‌ భాగంలో 12-మెగాపిక్సెల్ కెమెరా కూడా లభిస్తోంది..

ఈ స్మార్ట్‌ఫోన్‌లో కనెక్టివిటీ కోసం.. అద్భుతమై GPS, బ్లూటూత్‌తో పాటు NFC, USB టైప్-సి పోర్ట్ ఆప్షన్లు అందిస్తోంది. ఇందులో సెన్సార్లుగా యాక్సిలరోమీటర్, గైరోస్కోప్‌తో పాటు యాంబియంట్ లైట్ సెన్సార్ కూడా లభించబోతున్నాయి. ఇప్పటికే.. సాంసంగ్ గెలాక్సీ A57 5G స్మార్ట్‌ఫోన్‌ కూడా లాంచ్‌ అయ్యింది. అయితే, ఇది 5,000 mAh బ్యాటరీ కూడా అందుబాటులో ఉండబోతున్నట్లు తెలుస్తోంది.. సెక్యూరిటీ కోసం ఇందులో ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా అందిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో అద్భుతమైన కెమెరా సపోర్ట్‌ కూడా లభిస్తోంది. ముఖ్యంగా ఇందులో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో కూడిన త్రిపుల్‌ రియర్ కెమెరా యూనిట్ అందుబాటులో ఉంది.. ఇది ఆండ్రాయిడ్ 17 ఆధారిత వన్ UI 9.5 పై రన్‌ అవుతుందని కంపెనీ తెలిపింది..

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES