Woman Rescued Huge Snake Video Goes viral on social media: సోషల్ మీడియాలో పాములు వీడియోలు కుప్పలు తెప్పలుగా వైరల్ గా మారుతుంటాయి. ఈ క్రమంలో నెటిజన్లు సైతం కోబ్రాల వీడియోలను చూసేందుకు ఆసక్తిని చూపిస్తారు. ఎక్కడ పాముల వీడియోలు కన్పించిన వెంటనే వాటిని వైరల్ చేస్తున్నారు.ఒకప్పుడు పాముల్ని చూసి భయపడే వారంతా ప్రస్తుతం వాటితో సెల్పీలు దిగుతూ, స్టంట్ లు చేస్తున్నారు. కొన్నిసార్లు వారి స్టంట్లు వారి ప్రాణాల మీదకు వస్తున్నాయి.ఈ క్రమంలో చాలా మంది తమ ఇళ్లలో పాములు బైటపడితే వెంటనే స్నేక్ టీమ్ లకు సమాచారం అందిస్తారు.
Talk about nerves of steel🤯 Watch this fearless woman calmly rescue a massive cobra using just a plastic jar. The way she gently guides the snake in with her bare hands without a hint of fear is truly unbelievable. https://t.co/ZrGktv4aQg
— Vertigo_Warrior (@VertigoWarrior) October 31, 2026
బ్రాను పట్టుకునే స్నేక్ క్యాచర్ కు సమాచారం అందించారు. అక్కడకు చేరుకున్న యువతి ఎంతో చాకచక్యంగా పాము ఉన్న గదిలోకి వెళ్లింది. దీంతో అది కోపంతో యువతిపై బుసలు కొడుతూ దాడికి ప్రయత్నించింది. కానీ ఆమె ఎంతో చాకచక్యంగా దాడి నుంచి బైట పడింది.
ఆ తర్వాత వెంటనే ఒక ప్లాస్టిక్ డబ్బాను తీసుకుని కోబ్రాను దానిలోకి దూరేలా చేసింది. అప్పటికి కూడా పాము పలు మార్లు ఆమెపై దాడికి యత్నించింది. చివరకు ఎలాగోలా పామును డబ్బాలోకి పంపించిన తర్వాత ఆమె దానికి మూతపెట్టింది. ఆతర్వాత దగ్గరలోని అడవిలొకి తీసుకెళ్లి పామును వదిలిపెట్టారు. ఈ ఘటనకు చెందిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది. పెద్ద ప్రమాదం తప్పడంతో ఇంట్లోని వారు ఊపిరిపీల్చుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.