• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Bandi Sanjay: సొంత కార్యకర్తలపై బండి సంజయ్‌ ఆగ్రహం.. 'సీఎం సీఎం అంటే మైక్ బంద్ చేస్తా!

Bandi Sanjay: సొంత కార్యకర్తలపై బండి సంజయ్‌ ఆగ్రహం.. 'సీఎం సీఎం అంటే మైక్ బంద్ చేస్తా!

Bandi Sanjay Fire On BJP Leaders In Nirmal: సొంత బీజేపీ కార్యకర్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నినాదాలతో తనకు చిరాకు తెప్పించడంతో అసహనం వ్యక్తం చేశారు. 'సీఎం సీఎం అంటే మైక్‌ బంద్‌ చేస్తా' అని బండి సంజయ్‌ హెచ్చరించడంతో బీజేపీ కార్యకర్తలు నినాదాలు ఆపివేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Nov 03, 2026, 04:32 PM IST|Updated: Nov 03, 2026, 04:38 PM IST
joinshare
Bandi Sanjay: సొంత కార్యకర్తలపై బండి సంజయ్‌ ఆగ్రహం.. 'సీఎం సీఎం అంటే మైక్ బంద్ చేస్తా!
Image Credit: Source: Bandi Sanjay Kumar Facebook

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Chandrababu: మున్సిపల్‌ ఫలితాల్లో 'కూటమి క్లీన్‌స్వీప్‌'.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

Chandrababu: మున్సిపల్‌ ఫలితాల్లో 'కూటమి క్లీన్‌స్వీప్‌'.. సీఎం చంద్రబాబు ఏమన్నారంటే?

2

Snake Video: బాప్ రే.. పడగ విప్పి బుసలు కొడుతున్న భారీ సర్పం.. యువతి ధైర్యానికి నెటిజన్లు షాక్.. వీడియో వైరల్.

3

Bandi Sanjay: సొంత కార్యకర్తలపై బండి సంజయ్‌ ఆగ్రహం.. 'సీఎం సీఎం అంటే మైక్ బంద్ చేస్తా!

4

Radhika Apte: పెద్దవయసు హీరోతో రొమాన్స్ చేయాల్సి వచ్చింది.. బాలయ్య మూవీపై రాధికా ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు..

5

Samsung లవర్స్‌కు గుడ్ న్యూస్.. 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో Galaxy A58 5G త్వరలోనే లాంచ్!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Nirmal BJP Rally: క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లిన సమయంలో 'సీఎం సీఎం' అంటూ నినాదాలతో ఇబ్బందులు పెడుతున్న బీజేపీ కార్యకర్తలపై కేంద్ర మంత్రి బండి సంజయ్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సీఎం అని ఏమిటా నినాదాలు అంటూ అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'సీఎం సీఎం అంటే మైక్‌ బంద్‌ చేస్తా' అని హెచ్చరించారు. ఈ సందర్భంగా కార్యకర్తలపై మండిపడ్డారు. ఈ సంఘటన నిర్మల్‌ పర్యటనలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.

సర్‌ ప్రక్రియకు మద్దతుగా నిర్మల్‌లో బీజేపీ ఆధ్వర్యంలో మహా పాదయాత్ర జరగ్గా.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ హాజరై ప్రసంగం ప్రారంభించారు. ప్రసంగం ప్రారంభం కాగానే సీఎం..సీఎం అంటూ బీజేపీ కార్యకర్తలు నినాదాలు చేశారు. సీఎం సీఎం అంటే మైక్ బంద్ చేస్తానంటూ కార్యకర్తలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్యకర్తలు నినాదాలు ఆపివేయడంతో బండి సంజయ్‌ ప్రసంగం ప్రారంభించి కాంగ్రెస్‌ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

'నిర్మల్‌కు వచ్చి ‘సర్’ వద్దంటే వీపంతా సాఫ్ చేయండి' అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులను ఉద్దేశించి బండి సంజయ్‌ తెలిపారు. '2004లో మాజీ ప్రధాని పీవీ, ఆ తరువాత ఎమ్మెస్సార్ వంటి నాయకులు చనిపోయి  ఏళ్లు గడుస్తున్నా ఇంకా ఓటర్లు గానే ఉన్నారు. వాళ్ల ఓట్లు తీసేయాలా? వద్దా? చనిపోయిన వారిని ఓట్లను, డూప్లికేట్ ఓట్లను ఓట్లను తీసివేస్తున్నారు' అని కరీంనగర్‌ ఎంపీ బండి సంజయ్‌ తెలిపారు. 'ఇటలీ సంతతి వాళ్లు ప్రధాని కావాలని కలలు కంటున్నారు. కాంగ్రెస్ రాక్షస సేన....వాళ్ల నిందలను మోదీ గరళ కంఠుడిగా భరిస్తున్నాడు' అని తెలిపారు.

'రాహుల్ గాంధీ మీ ముత్తాత, నానమ్మ, నాయన హయాంలో సర్ చేపడితే కాంగ్రెస్ పార్టీ ఎందుకు వ్యతిరేకించలేదు?' అని బండి సంజయ్‌ ప్రశ్నించారు. రాహుల్ గాంధీకి సర్ పై అవగాహన లేనేలేదని తీసిపడేశారు. 'ఈ దేశ పౌరులే ప్రధానిని, ఎంపీ, ఎమ్మెల్యేలను నిర్ణయించారు. బంగ్లాదేశ్, పాకిస్థాన్‌లాంటి కోన్ కిస్కాగాళ్లు ప్రధాని, ముఖ్యమంత్రిని నిర్ణయిస్తామంటే ఊరుకునేది లేదు. అట్లాంటి కౌన్ కిస్కాగాళ్లను ఉరికించి ఉరికించి బట్టలూడదీసి కొడతాం' అని హెచ్చరించారు.

సీఏఏ, ఎన్ఆర్సీలను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని బీజేపీ శ్రేణులకు కేంద్ర మంత్రి బండి సంజయ్‌ సూచించారు. 'సర్ కోరుతూ అమిత్ షా పాదయాత్ర చేస్తే లక్షలాది మంది తరలివచ్చి మద్దతు పలికారు. అమిత్ షాను వందనం చేస్తే నన్ను, రామచంద్రరావును కాంగ్రెస్ లుచ్చాగాళ్లు కించపరుస్తూ ట్రోల్ చేస్తున్నారు. మాకు మీలాగా గ్లాసులో మందుపోసే కల్చర్ నేర్పలేదు. డబ్బు సంచులు ఢిల్లీ పెద్దలకు పంపే సంస్కృతిని నేర్పలేదు. కాంగ్రెస్ నేతలారా.... మిమ్ముల్ని ఉరికించి కొట్టే రోజులు రాబోతున్నాయి' అని బండి సంజయ్‌ హెచ్చరించారు.

తెలంగాణ గడ్డపై ఇంకపై రంగు రంగుల జెండాలకు తావు లేదు.. ఇకపై ఎగరబోయేది కాషాయ జెండానే అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలంతా కాషాయ జెండానే కోరుకుంటున్నారని చెప్పారు. రామచంద్రరావు నాయకత్వంలో తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకొస్తామని ప్రకటించారు. కరెంట్ లేక, నీళ్లు లేక ప్రజలు బాధపడుతున్నారని.. పెన్షన్లు రాక వ్రుద్దులు, ఉద్యోగాలు రాక నిరుద్యోగులు, మహిళలుసహా అన్ని వర్గాలు బాధపడుతున్నారని తెలిపారు.

'ప్రజా సమస్యలను గాలికొదిలి కాంగ్రెస్ నాయకులు ఢిల్లీకి పోయి సర్ పేరుతో డ్రామాలు చేస్తున్నారు. కాంగ్రెస్ నేతలారా... మీరిట్లనే చేస్తే త్వరలోనే ఎన్ఆర్సీని తీసుకొచ్చి తీరుతాం' అని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ స్పష్టం చేశారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
BJP
Telugu News
Telangana News
Politics