School Principal playing tabla in student bald head in etawah: ఇటీవల కొంత మంది ఉపాధ్యాయులు తరచుగా వివాదాల్లో చిక్కుకుంటున్నారు. స్కూల్ పిల్లల పట్ల అమానవీయంగా ప్రవర్తిస్తున్నారు. వారితో తమ వ్యక్తిగత పనులు కూడా చేయించుకుంటున్నారు. కొంత మంది స్కూళ్లలో తమ తల వెంట్రుకలకు నూనె పెట్టించుకొవడం, మసాజ్ చేయించుకొవడం చేస్తున్నారు. మరికొంత మంది ఉపాధ్యాయులు తప్పతాగి స్కూల్ కు వచ్చి విద్యార్థులను, స్కూల్ విద్యార్థులను వేధిస్తున్నారు.
शर्मनाक :- सरकारी स्कूल के इंचार्ज शिक्षक ने बच्चे के घुटे हुए सिर पर तबला बजाते हुए Reel बनवाई..! शिक्षक ने खुद के फेसबुक Account से वीडियो किया Viral....📸 उत्तर प्रदेश के इटावा में एक सरकारी स्कूल के शिक्षक द्वारा बच्चे के गंजे सिर को तबले की तरह बजाने का वीडियो सोशल मीडिया पर वायरल हुआ है। इंचार्ज शिक्षक का नाम दिनेश माथुर है..BSA ने मास्टर साहब को सस्पेंड कर दिया है ! https://t.co/mETdhQIA41
— Rahul Saini (@JtrahulSaini) October 9, 2026
ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. తాజాగా.. యూపీలోని ప్రైమరీ స్కూల్ లో ఒక ఉపాధ్యాయుడు బాలుడు గుండుగీయించుకుంటే అతని తల మీద తబలా మాదిరి కొడుతూ రీల్స్ చేశాడు. ఈ వీడియో వైరల్గా మారింది.
ఉత్తర ప్రదేశ్ లోని బిరౌలీ పరిధిలోని ప్రైమరీ స్కూల్ లో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. దినేష్ కుమార్ మాథుర్ అనే ఉపాధ్యాయుడు స్కూళ్లోగుండు చేయించుకున్న ఒక విద్యార్థి తలపై తబలా వాయిస్తూ రచ్చచేశాడు. అచ్చం తబలా, గిటార్ ను ప్లే చేసినట్లు బాలుడి గుండు మీద ఇష్టమున్నట్టు కొట్టాడు.
పాపం క్లాస్ లో బాలుడు ఇబ్బందులు పడుతున్న అతడిని వదల్లేదు. తన చేతులతోనే బాలుడి తల మీద కొడుతూ రచ్చ చేశాడు. ఈ వీడియో వైరల్ గా మారడంతో విద్యాశాఖ దీనిపై సీరియస్ అయ్యింది. సదరు ఉపాధ్యాయుడు దినేష్ కుమార్ ను సస్పెండ్ చేస్తు ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం దీనిపై విద్యాశాఖ అధికారులు విచారణ చేపట్టారు.