దీపావళికి టపాసులు కాల్చని గ్రామాలు.. ఈ దేశాల నుంచి వచ్చే పక్షుల కోసం 600 ఏళ్లుగా వింత ఆచారం!
Silent Diwali: తమిళనాడులోని ఈ ప్రాంతంలో టపాసుల చప్పుడు కాకుండా దీపావళి పండగను ఎంతో ఘనంగా జరుపుకుంటారు.. ఎందుకో ఎవరికైనా తెలుసా? రష్యా తో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే అరుదైన పక్షులకు హాని కలుగుతుందనే కారణంతో చిన్నపిల్లలతో పాటు పెద్దలు కూడా టపాసులు పేల్చకుండా పండగను ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు.
Silent Diwali: దీపావళి వచ్చిందంటే చాలు టపాసులు మూతలు మరోవైపు చక చకా మెరిసే రంగురంగుల చిచ్చుబుడ్ల కాంతులు, ఊరు వాడలు పొగతో నిండిపోవడం సర్వసాధారణమే.. కానీ కొన్ని ఊళ్ళలో మాత్రం పండగ సమయాల్లో ప్రశాంతమైన వాతావరణం ఎలాంటి శబ్దాలు లేకుండా ఉండడం కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా మట్టి ప్రమిదల కాంతులు తప్ప ఒక్క టపాసు చప్పుడు కూడా కనిపించదు.. తమ ఊరికి వేల మహిళ దూరం నుంచి వచ్చే విదేశీ పక్షులకు ఎలాంటి ఆటంకం కలగకూడదన్న ఉద్దేశంతో తమిళనాడులోని పలు పల్లెలు దశాబ్దాలుగా పాటిస్తున్న ఈ అరుదైన ఆచారం కలిగిస్తుంది.
వేడంతాంగల్ పక్షుల సంరక్షణ కేంద్రం పరిసరాల్లోని వలపందల్‌తో పాటు తిరునెల్వేలి జిల్లాలోని కూంతన్‌కుళం, ఈరోడ్ పరిసర గ్రామాల్లో దీపావళి చాలా నిశ్శబ్దంగా జరుగుతుంది. అక్టోబర్ తో పాటు నవంబర్ నెలల్లో సైబీరియాతోపాటు రష్యా మయన్మార్ వంటి సుదూర దేశాల నుంచి ఫ్లెమింగోలు, పెలికాన్లు వంటి కొన్ని అరుదైన పక్షులు పునరుత్పత్తి కోసం ఇక్కడి సరస్సులకు తరలివస్తు ఉంటాయి ఈ సమయంలో బాణాసంచా కాల్చితే వచ్చే భారీ పేలుళ్లతో పాటు విషపూరిత పొగ కారణంగా పక్షులు తీవ్రభయాందోళనకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. గుడ్లు విడిచిపెట్టి పారిపోవడమే కాకుండా పిల్లలకు తల్లులు ఆహారం అందించలేక ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉంటుంది అందుకే ఈ పక్షులు తమ ఇంటి అతిథులుగా భావించి స్థానిక ప్రజలు టపాసులకు పూర్తిగా స్వస్తి పలుకుతూ దీపావళి వేడుకలను ఘనంగా జరుపుకుంటూ ఉంటారు.
ఇది నిన్న మొన్న మొదలైన నిర్ణయం కాదు దాదాపు 6 శతాబ్దాలకు పైగా వస్తున్న నిబంధన ఇప్పటికీ ఆచరణలో ఉందని స్థానికులు తెలుపుతున్నారు. పల్లెల్లోని చిన్నపిల్లలు సైతం బాణాసంచా కోసం మారం చేయకపోవడం ఇక్కడి విశేషం.. పక్షులపై ప్రేమను పెద్దలు చిన్నతనం నుంచే పిల్లల రక్తంలో నూరిపోస్తారని.. అందుకే పిల్లల సైతం దీపావళి సమయాల్లో టపాసులు కొని ఇవ్వమని అడగరని స్థానికులు తెలుపుతున్నారు. పండుగ రోజున కొత్త దుస్తులు ధరించి ఇళ్ళ ముందు అద్భుతమైన ముగ్గులు వేసి కేవలం నువ్వుల నూనెతో మట్టి దీపాలు వెలిగించి సంబరాలను ముగిస్తూ ఉంటారట అంతేకాకుండా స్వీట్లు పంచుకుంటూ ప్రేమను పంచుకుంటారు తప్ప.. శబ్ద కాలుష్యాన్ని చేయాలని అక్కడి స్థానికులు తెలుపుతున్నారు..
కాలుష్యంతో పాటు శబ్దాల తీవ్రతతో పర్యావరణ సమతుల్యత దెబ్బతింటున్న ప్రస్తుత కాలంలో తోటి ప్రాణుల మనుగడను గుర్తించి గౌరవించే ఈ గ్రామాలు యావత్ సమాజానికి మార్గదర్శకంగా నిలుస్తూ వస్తున్నాయి పండగ అంటే ఆడంబరం కాదని ప్రకృతితో ముడిపడి జీవించడమే అసలైన పండగని ఈ నిశ్శబ్ద దీపావళి ప్రపంచానికి తెలియజేస్తూ వస్తోంది..