• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /దేశమంతా దీపావళి ముగిస్తే.. అక్కడ మాత్రం 11 రోజుల తర్వాతే అసలైన సంబరాలు! ఎందుకో తెలుసా?

దేశమంతా దీపావళి ముగిస్తే.. అక్కడ మాత్రం 11 రోజుల తర్వాతే అసలైన సంబరాలు! ఎందుకో తెలుసా?

Diwali Late Celebrates: ఉత్తరాఖండ్ లోని కొన్ని ప్రాంతాల్లో దీపావళి ముగిసిన 11 రోజుల తర్వాత పండగను జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. అక్కడి కొండల్లో జీవించే అడవి మనుషులు ఈ పండగను ఎంతో అద్భుతంగా జరుపుకుంటారు. ఈ సమయాల్లో ప్రత్యేకంగా మూగజీవాలను కూడా పూజిస్తూ ఉంటారు.

Written ByDharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 01:54 PM IST|Updated: Nov 08, 2026, 01:55 PM IST
joinshare
దేశమంతా దీపావళి ముగిస్తే.. అక్కడ మాత్రం 11 రోజుల తర్వాతే అసలైన సంబరాలు! ఎందుకో తెలుసా?
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
భూమి పొత్తిళ్లలో ఇంకా ఎంత బంగారం మిగిలుంది? ఇప్పటివరకు మనం ఎంత తవ్వి తీశామో తెలుసా?

భూమి పొత్తిళ్లలో ఇంకా ఎంత బంగారం మిగిలుంది? ఇప్పటివరకు మనం ఎంత తవ్వి తీశామో తెలుసా?

2

ఎయిర్‌టెల్ బంపర్ ఆఫర్.. రూ.279 లకే నెట్‌ఫ్లిక్స్, ZEE5 సబ్‌స్క్రిప్షన్.. 30GB డేటా ఉచితం!

3

సోమవారం బ్యాంక్ పనులు ఉన్నాయా? అయితే ఈ వార్త మీకోసమే.. అసలు కారణం ఇదే!

4

దీపావళి రాత్రి పక్కింట్లో దొంగతనం చేస్తే అదృష్టం వస్తుందట.. హిమాచల్‌లో వింత ఆచారం!

5

దేశమంతా దీపావళి సంబరాలు.. ఈ 3 ప్రాంతాల్లో మాత్రం రావణుడికి ప్రత్యేక పూజలు.. అసలు కారణం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Diwali Late Celebrates: దేశవ్యాప్తంగా దీపాల పండగ దీపావళి అమావాస్యతో ఎంతో ఘనంగా ముగుస్తుంది.. అయితే, హిమాలయ కొండల్లో కొలువైన ఉత్తరాఖండ్ ప్రాంతంలో మాత్రం అసలైన దీపావళి వేడుకలు సరిగ్గా 11 రోజుల తర్వాత ప్రారంభమవుతూ ఉంటాయి.. స్థానికంగా వారు ఇగాస్ భగ్వాల్ లేదా బూఢీ దీపావళిగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ సాంప్రదాయ జానపద ఉత్సవాన్ని కార్తిక శుక్ల హరిబోధిని ఏకాదశి రోజున అత్యంత భక్తి శ్రద్ధలతో ఎంతో ఉత్సాహంగా వారు జరుపుకుంటూ ఉంటారు. అసలు దీపావళి అయిన తర్వాత 11 రోజులకు ఆ ప్రాంతంలో ఈ పండగను జరుపుకోవడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం..

రావణాసురుడిని సంహరించిన శ్రీరాముడు సీతాదేవితో పాటు లక్ష్మణులతో కలిసి అయోధ్యకు తిరిగివచ్చిన సందర్భంగా.. దేశమంతా ఆనందోత్సాహాలతో దీపాలు వెలిగించి దీపావళి పండుగను ఎంతో ఘనంగా జరుపుకుంది. అయితే, ఆ కాలంలో సరైన సమాచారంతోపాటు రవాణా మార్గాలు లేకపోవడం, అత్యంత క్లిష్టమైన ఎత్తైన హిమాలయ పర్వత లోయ అడ్డంకిగా మారడంతో శ్రీరాముడు అయోధ్య చేరిన వార్త ఉత్తరాఖండ్‌లోని గర్హ్వాల్, కుమావూన్ పర్వత ప్రాంతాలకు చేరడానికి మరో పదకొండు రోజుల సమయం పట్టేదని ఇక్కడి ప్రజల విశ్వాసం.. వార్త తెలిసిన వెంటనే అక్కడి కొండ జాతి ప్రజలు ఆనందంతో కార్తిక ఏకాదశి రోజే దీపాలు వెలిగించి సంబరాలు చేసుకున్నారట.. కాలక్రమంగా అదే ఆచారం ఇగాస్ భగ్వాల్‌గా స్థిరపడిందని అక్కడి ప్రజలు చెబుతూ ఉంటారు.

దీనితోపాటు మరోచరిత్రక కథనం కూడా అక్కడ ప్రచారంలో ఉంది. గర్హ్వాల్ రాజ్య సేనాధిపతి మాధో సింగ్ భండారీ టిబెట్ సరిహద్దులో యుద్ధం ముగించుకొని దీపావళి ముగిసిన 11 రోజులకే సైన్యంతో స్వదేశానికి సురక్షితంగా తిరిగి వచ్చారని.. ఆయన విజయానికి చిహ్నంగా ప్రజలు రెండోసారి దీపావళి జరుపుకున్నారని స్థానికులు చెబుతూ ఉంటారు.. అందుకే దీపావళి ముగిసిన 11 రోజుల తర్వాత పండగను జరుపుకోవడం ఆనవాతిగా వచ్చిందని వారు చెబుతూ ఉన్నారు.

ఈ పండగలో అత్యంత విశిష్టమైన ఆచారం భైలో.. దేవదారు కలపతో పాటు ఎండిన గడ్డి, అడవి తీగలతో ప్రత్యేకంగా కాగడాలను తయారు చేస్తారు.. చీకటి పడగానే ఆ కాగడాలని వెలిగించి గాల్లో గుండ్రంగా తిప్పుతూ ప్రత్యేకమైన నృత్యాలు చేస్తూ ఉంటారు.. మండుతున్న కాగడాలు చీకట్లో గాల్లో తిరిగే కాకర వత్తుల కనిపిస్తూ అద్భుతమైన దృశ్యాన్ని అందిస్తూ ఉంటాయి. అలాగే అక్కడే ఉండే స్థానికులు డోలుతో పాటు ప్రత్యేకమైన వాయుద్యాలతో శబ్దాలు చేస్తూ జానపద పాటలు మధ్య డాన్సులు చేస్తూ రాత్రంతా ఎంతో ఆనందంగా గడుపుతూ ఉంటారు..

అలాగే ఇదే సమయాల్లో రైతులు వ్యవసాయ పనుల్లో వారికి సహాయం చేసే పశువులను కూడా పూజిస్తూ ఉంటారు. వాటికి స్నానం చేయించి పూలమాలలు వేసి.. వాటికి తిలకం దిద్ది ప్రత్యేకమైన పూజలు చేస్తూ ఉంటారు స్వచ్ఛమైన తెల్లబెల్లంతో పాటు ప్రత్యేకమైన వంటకాలను తినిపిస్తూ ఉంటారు. ఇళ్ళ ముందు ప్రమిదలు వెలిగించి స్థానిక పిండి వంటలు తయారు చేసి బంధుమిత్రులతో కలిసి వాటిని పంచుకుంటూ తింటూ ఉంటారు ప్రస్తుతం నగరాలకు వలస వెళ్లిన వారు సైతం లకు చేరుకొని ఈ వేడుకల్లో పాల్గొంటారు. సాంస్కృతితో పాటు ప్రకృతి జీవకోటి పట్ల హిమాలయ వాసులు కృతజ్ఞత భావాన్ని ఇగాస్ భగ్వాల్ ద్వారా చూపుతూ ఉంటారు..

 

Add Zee News as a Preferred Source
TAGS:
Trending News
Telugu News