SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దేశం గర్విస్తోంది.. వందలాది ప్రయాణికులను కాపాడిన పైలట్ కెప్టెన్ స్మిత్‌కు ప్రధాని మోదీ సెల్యూట్.. ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?

Smith Machhar: తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ చూపిన ధైర్యం ఒక పెను విషాదాన్ని నివారించిందని అన్నారు ప్రధాని మోదీ. ఎవరీ స్మిత్ మచ్చర్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలుసుకుందాం.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 01, 2026, 09:35 AM IST | Updated: Oct 01, 2026, 09:36 AM IST
Image Credit: FlyDubai pilot attack
Join

FlyDubai pilot attack: దుబాయ్ నుంచి బయలుదేరిన ఫ్లై దుబాయ్ ఫ్లైట్ లో చోటుచేసుకున్న భయానక వాతావరణంలో.. వందలాది మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడిన భారత ఫైలట్ కెప్టెన్ స్మిత్ మచ్చర్ పై ప్రశంసల వర్షం కురుస్తోంది. కాక్ పిట్ లో తీవ్రంగా గాయపడినా.. చాకచక్యంగా వ్యవహరించి ఫ్లైట్ ను కూల్చివేసేందుకు కో పైలట్ చేసిన కుట్రను భగ్నం చేసిన ఆయన ధైర్య సాహసాలను భారత ప్రధాని నరేంద్ర మోదీ కొనియాడారు. ఆయన అసలైన హీరో అంటూ.. ఆయన చూపిన ధైర్య సాహసాలకు దేశం గర్విస్తోందని ప్రధాని మోదీ ప్రశంసించారు. తీవ్రంగా గాయపడినప్పటికీ స్మిత్ చూపిన ధైర్యం ఒక పెను విషాదాన్ని నివారించిందని అన్నారు ప్రధాని మోదీ. ఎవరీ స్మిత్ మచ్చర్.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి తెలుసుకుందాం.

అసలు ఏం జరిగిందో ముందు తెలుసుకుందాం: 
బుధవారం ఉదయం దుబాయ్ నుంచి టెల్ అవీవ్ కు 170 మందికి పైగా ప్రయాణికులతో బయలు దేరింది ఫ్లై దుబాయ్ విమానం. అయితే ఈ విమానంలో నాటకీయ పరిణామం చోటుచేసుకుంది. బోయింగ్ 737 ప్లైట్ 34,000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తున్ను సమయంలో కో పైలెట్ విమానాన్ని నేలకూల్చేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ప్రమాదాన్ని పసిగట్టిన కెప్టెన్ స్మిత్ మచ్చర్ అతడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు.

ఈ క్రమంలోనే కోపంతో రగిలిపోయిన కో పైలెట్ కెప్టెన్ స్మిత్ పై కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో స్మిత్ తీవ్రంగా గాయపడ్డారు. అయినప్పటికీ ఈ గందరగోళ వాతావరణంలో విమానం నియంత్రణ కోల్పోయింది. నిమిషానికి దాదాపు 23,000 అడుగుల వేగంతో కిందకి పడిపోతూ.. 15,600 అడుగుల ఎత్తు వరకు చేరింది. అంతటి క్లిష్ట పరిస్థితుల్లోనూ ఏమాత్రం ధైర్యం కోల్పోని కెప్టెన్ స్మిత్ ప్రయాణికుల సహాయంతో కో పైలట్ ను కంట్రోల్ చేసి విమానాన్ని సురక్షితంగా తన అదుపులోకి తీసుకున్నారు. దీంతో వందలాది మంది ప్రయాణాలను కాపాడారు.

దేశం గర్విస్తోందంటూ ప్రధాని ప్రశంసలు: 
కాగా ఈ ఘటనపై ప్రధాన మోదీ ఎక్స్ వేదికగా స్పందించారు. కెప్టెన్ స్మిత్ మచ్చర్ ఒక హీరో అంటూ ప్రశంసించారు. అత్యంత ప్రమాదకర పరిస్థితుల్లోనూ తీవ్రంగా గాయపడినా.. ఆయన అపారమైన ధైర్యాన్ని గుండె బలంతో ప్రదర్శించారు. వందల మంది ప్రాణాలను కాపాడాలన్న ఆయన సంకల్పం వారిని ప్రాణాలతో నిలబెట్టింది. ఒక పెను విషాదాన్ని నివారించింది. కెప్టెన్ మచ్చర్ ను చూసి యావత్ భారతావని గర్విస్తోందంటూ మోదీ తన పోస్టులో పేర్కొన్నారు. స్మిత్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

ఎవరీ కెప్టెన్ స్మిత్ మచ్చర్?
కెప్టెన్ స్మిత్ మచ్చర్ భారత సంతతికి చెందినవారు. గుజరాతీ మూలాలు ఉన్న ఆయన ముంబై లోని ఘాట్ కోపర్ ప్రాంతంలో ఉంటున్నారు. విమానయాన రంగంలో స్మిత్ కు అపారమైన అనుభవం ఉంది. 2022 జూన్ లో ఫ్లైదుబాయ్ లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్ గా విధుల్లో చేరారు. అంతకుముందు భారత చౌకధరల విమానయాన సంస్థ స్పైస్ జెట్ లో దాదాపు 11 సంవత్సరాల పాటు పనిచేశారు. అక్కడ సీనియర్ కమాండర్ గా, లైన్ ట్రైనింగ్ కెప్టెన్ గా ఉన్నత స్థాయికి ఎదిగారు స్మిత్. ఇతర పైలట్లకు ట్రైనింగ్ ఇచ్చి వారి సామర్థ్యాన్ని అంచనా వేసే కీలక బాధ్యతలను కూడా ఆయన నిర్వర్తించారు.

స్మిత్‌కు 737-800, 737 మ్యాక్స్ 8, 9తో సహా బోయింగ్ 737 మోడల్ విమానాలను నడపడంలో అపారమైన అనుభవం ఉంది. ఆయన సుమారు 9,750 గంటల పాటు విమానం నడిపారు. అందులో 6,400 గంటలకు పైగా పైలట్-ఇన్-కమాండ్‌గా (ప్రధాన పైలట్‌గా) ఉన్నారు. ఆయన వెలింకార్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ నుండి బిజినెస్ అడ్మినిస్ట్రేషన్‌లో డిగ్రీ కూడా పొందారు.

స్మిత్  అపారమైన ధైర్యాన్ని  ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు ప్రశంసించారు. ఒక పెద్ద విపత్తును నివారించడంలో ఆయన పాత్ర అసాధారణమైనదని కొనియాడారు. స్మిత్ ధైర్య సాహసాలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES