SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

హైదరాబాద్ - ఏపీ ప్రయాణికులకు బిగ్ రిలీఫ్! పండుగ స్పెషల్ రైళ్లు ఇవే.. పూర్తి టైమింగ్స్!

దసరా, దీపావళి పండుగల సందర్భంగా ప్రయాణికుల రద్దీ పెరగనున్న తరుణంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది. ముఖ్యంగా హైదరాబాద్, ఏపీ ప్రయాణికులకు ఇది ఒక శుభవార్త. పండుగ సీజన్ కోసం ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇవి ఏ రూట్లలో, ఎప్పుడు అందుబాటులో ఉంటాయో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 25, 2026, 06:53 AM IST | Updated: Sep 25, 2026, 06:58 AM IST
Image Credit: Festival Special Trains
Join

Festival Special Trains: భారతీయ రైల్వే అతిపెద్ద రవాణా వ్యవస్థ. ప్రతిరోజూ వేలాది రైళ్లు.. లక్షలాది మంది ప్రయాణికులను సుదూర ప్రాంతాలకు చేరుస్తూ ఉంటారు. సాధారణంగా రైలు టికెట్లు 60 రోజుల ముందే రిజర్వ్ చేసుకుంటే కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటుంది. లేదంటే తత్కాల్ టికెట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. అయితే పండుగ సమయాల్లో రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల టికెట్ కన్ఫర్మేషన్ కష్టమవుతుంది. ఉదయం 8 గంటలకు తత్కాల్ బుకింగ్స్ మొదలైనా నిమిషాల్లోనే టికెట్లు అయిపోతుంటాయి. ఇలాంటి వారు నిరాశ చెందకుండా ఉండటానికి సౌత్ సెంట్రల్ రైల్వే రద్దీ ఎక్కువగా ఉండే స్టేషన్ల నుండి ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా ప్రత్యేక రైళ్లు నడుస్తున్న తరుణంలో, విశాఖపట్నం, హైదరాబాద్ నుండి రాకపోకలు సాగించే వారికి ఇది భారీ ఊరటనిస్తుంది.

విశాఖపట్నం నుండి SMVT బెంగళూరుకు..
విశాఖపట్నం నుండి SMVT బెంగళూరు మధ్య పండుగ ప్రత్యేక రైళ్లను ప్రకటించారు (ట్రైన్ నెంబర్లు: 08583, 08584). ఇవి అక్టోబర్ 6 నుండి నవంబర్ 25 వరకు అందుబాటులో ఉంటాయి. ప్రతి దిశలో ఎనిమిది సర్వీసులు నడుస్తాయి.
08583: విశాఖపట్నం నుండి బెంగళూరుకు మంగళవారం సాయంత్రం 7 గంటలకు బయలుదేరి, మరుసటి రోజు మధ్యాహ్నం 12:45కు చేరుకుంటుంది.
08584: బెంగళూరు నుండి విశాఖపట్నంకు బుధవారం మధ్యాహ్నం 3:50కు బయలుదేరి, గురువారం రాత్రి 11:30కు చేరుకుంటుంది.

ఈ రైలు దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట, కాటపల్లి, జోలర్పెట్టా, బంగారుపేట, కృష్ణార్జపురం వంటి స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో జనరల్ కోసం 4 కోచ్‌లు, స్లీపర్ 7 కోచ్‌లు, సెకండ్ ఏసీ 2 కోచ్‌లు, అలాగే లగేజీ, దివ్యాంగుల కోసం ప్రత్యేక కోచ్ కూడా ఉంది.

సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్‌కు..
సికింద్రాబాద్ నుండి కాకినాడ టౌన్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించారు (ట్రైన్ నెంబర్లు: 07039, 07040). ఇవి అక్టోబర్ 7 నుండి నవంబర్ 26 వరకు మొత్తం ఎనిమిది సర్వీసులు నడుపుతాయి.
07039: సికింద్రాబాద్ నుండి కాకినాడకు బుధవారం రాత్రి 7:10కు బయలుదేరి, గురువారం ఉదయం 8 గంటలకు చేరుకుంటుంది.
07040: కాకినాడ టౌన్ నుండి సికింద్రాబాద్‌కు మంగళవారం రాత్రి 9 గంటలకు బయలుదేరి, శుక్రవారం ఉదయం 8:50కు చేరుకుంటుంది.

ఈ రైలు చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట వంటి ప్రాంతాల్లో ఆగుతుంది. ఇందులో కూడా జనరల్ (4 కోచ్‌లు), స్లీపర్ (7 కోచ్‌లు), సెకండ్ ఏసీ (2 కోచ్‌లు). దివ్యాంగుల కోసం ప్రత్యేక కోచ్ అందుబాటులో ఉన్నాయి.

నర్సాపూర్ - చర్లపల్లి.. 
నర్సాపూర్, చర్లపల్లి, పొదనూరు, బరోని ప్రాంతాల కోసం కూడా ప్రత్యేక రైళ్లు ప్రకటించారు.
070616: నర్సాపూర్ నుండి చర్లపల్లికి ఆదివారం రాత్రి 10 గంటలకు బయలుదేరుతుంది (మొత్తం 9 సర్వీసులు).
07063: చర్లపల్లి నుండి నర్సాపూర్‌కు ప్రతి సోమవారం రాత్రి 7:50కు అందుబాటులో ఉంటుంది (మొత్తం 9 సర్వీసులు).
ఈ రైలు పాలకొల్లు, భీమవరం, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ వంటి స్టేషన్లలో ఆగుతుంది. ఇందులో సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, స్లీపర్, జనరల్ కోచ్‌లు ఉంటాయి.

Also Read:  విశాఖ వాసులకు రైల్వే అలర్ట్.. ఈ ఎక్స్‌ప్రెస్ రైళ్ల మార్గాలు

Also Read:  రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా 20 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్‌ మీదుగా ఎన్నంటే?

06021: పొదనూరు నుండి బరోనికి ఆదివారం 5 సర్వీసులు.
06022: బరోని నుండి పొదనూరుకు బుధవారం 5 సర్వీసులు అందించబడతాయి.
పొదనూరు నుండి బరోని మధ్య నడిచే ప్రత్యేక రైలు మొత్తం 10 సర్వీసులు అందిస్తుంది. ఇది తిరుపూర్, సేలం,  కాట్పాడీ, నెల్లూరు, ఒంగోలు, విజయవాడ, ఖమ్మం, వరంగల్, సిర్పూర్, నాగపూర్, ఇటార్సీ, జబల్పూర్, ప్రయాగరాజ్, హాజీపూర్ వంటి అనేక ప్రధాన స్టేషన్లలో ఆగుతుంది. ప్రయాణికులు తమ ప్రయాణాన్ని వీలైనంత త్వరగా ప్లాన్ చేసుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే సూచించింది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES