SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పాఠశాల గదిలోనే క్రూరత్వం.. తోటి విద్యార్థినిపై బాలుడి వికృత దాడి.. స్పృహ కోల్పోయినా వదల్లేదు.. అసలేం జరిగిందంటే?

Panchkula School: హర్యానాలోని పంచ్‌కులాలో ఒక పాఠశాల ప్రాంగణంలోనే దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 20లోని సంస్కృతి మోడల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఒక బాలుడు.. ప్రత్యేక అవసరాలున్న (దివ్యాంగురాలైన) కేజీ విద్యార్థినిపై రాళ్లు.. పూలకుండీతో దారుణంగా దాడికి పాల్పడ్డాడు.

Written By Bhoomi
Published: Oct 31, 2026, 12:51 PM IST | Updated: Oct 31, 2026, 01:27 PM IST
Image Credit: Student Attack:
Join

Panchkula School: హర్యానాలోని పంచ్‌కులాలో ఒక పాఠశాల ప్రాంగణంలోనే దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. సెక్టార్ 20లోని సంస్కృతి మోడల్ స్కూల్‌లో మూడో తరగతి చదువుతున్న ఒక బాలుడు.. ప్రత్యేక అవసరాలున్న (దివ్యాంగురాలైన) కేజీ విద్యార్థినిపై రాళ్లు.. పూలకుండీతో దారుణంగా దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడి స్పృహతప్పిన ఆ చిన్నారిని బాలుడు కొంతదూరం ఈడ్చుకెళ్లినట్లు తెలుస్తోంది. రక్తం ఓడుతున్న చిన్నారిని గమనించిన సిబ్బంది వెంటనే స్థానిక ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం చండీగఢ్‌లోని పీజీఐఎంఈఆర్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పాఠశాల యాజమాన్యాన్ని, బాలుడి తల్లిదండ్రులను విచారిస్తున్నారు.

మూడో తరగతి చదువుతున్న బాలుడు.. చిన్నారిపై మొదట రాళ్లతో దాడి చేశాడు. ఆ తర్వాత అక్కడే ఉన్న పూలకుండీతో బలంగా చితకబాదాడు. ఈ దాడిలో ఆ బాలిక స్ప్రహ కోల్పోయింది. అయినా కూడా వదలడు.  స్ప్రుహ తప్పి పడిపోయిన ఆ చిన్నారిని కొంత దూరం లాక్కెళ్లాడు. ఈ ఘటనతో బాలిక పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

ఘటన వివరాలు తెలియగానే పాఠశాల సిబ్బంది వెంటనే స్పందించి.. తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారిని పంచ్‌కులా సెక్టార్ 6లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె ఆరోగ్యం అత్యంత విషమంగా మారడంతో.. మెరుగైన వైద్య సేవ నిమిత్తం చండీగఢ్‌లోని పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్‌ కు తరలించాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆ చిన్నారి పరిస్థితి విషమంగానే ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.

మరోవైపు విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన పాఠశాలకు చేరుకుని ప్రాథమిక ఆధారాలు సేకరించారు. దాడికి ఒడిగట్టిన బాలుడి తల్లిదండ్రులతో పాటు పాఠశాల యాజమాన్యాన్ని సుదీర్ఘంగా విచారిస్తున్నారు. కాగా.. స్కూల్ ప్రాంగణంలోనే చిన్నారిపై ఈ స్థాయిలో దాడి జరగడం విద్యార్థుల భద్రత, పర్యవేక్షణపై తీవ్ర ప్రశ్నలను, తల్లిదండ్రుల్లో ఆందోళనను రేకెత్తిస్తోంది.

 

Also Read: 

తెలంగాణ పింఛన్‌దారులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్.. అక్కడ అప్లై చేస్తే వెంటనే పెన్షన్..!!

 

 

బ్యాంక్ ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ లో ఏకంగా 16రోజులు బ్యాంకులు బంద్..!!

 

52 వేల మంది ఎస్జీటీల ఆవేదన.. పేద పిల్లల భవిష్యత్తు కోసం.. జీవో 25 సవరించండంటూ సీఎం రేవంత్‌కు విజ్ఞప్తి

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES