తమిళనాడులో సైన్‌బోర్డుపై హిందీ పదాలు.. ఇద్దరు అధికారులు సస్పెండ్!
Tamilnadu: తమిళనాడులో రోడ్డు సైన్‌బోర్డుపై హిందీ పదాలు ముద్రించడం తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో దశాబ్దాలుగా అమల్లో ఉన్న ద్విభాషా విధానానికి (తమిళం, ఇంగ్లీష్) విరుద్ధంగా రహదారి బోర్డుపై హిందీ పదాలను వాడడాన్ని తమిళనాడు ప్రభుత్వం అత్యంత తీవ్రంగా పరిగణించింది. ఈ నిబంధనల ఉల్లంఘనకు బాధ్యులైన ఇద్దరు అధికారులను తక్షణమే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

తూత్తుకుడి జిల్లాలోని సాత్తాన్ కుళం-నజరేత్ రాష్ట్ర రహదారిపై కొత్తగా ఏర్పాటు చేసిన సైన్ బోర్డుపై తమిళం, ఇంగ్లీష్ తోపాటుగా హిందీ భాషను కూడా ఉపయోగించారు. ఈ విషయం కాస్త సర్కార్ ద్రుష్టికి వెళ్లింది. దీంతో అధికారులు వెంటనే స్పందించి.. సైన్ బోర్డుపై ఉన్న హిందీ పదాలను తొలగించేశారు. రాష్ట్ర ద్విభాషా విధానాన్ని ఉల్లంఘించినందుకు గాను హైవేస్ శాఖకు చెందిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజీనిర్, అసిస్టెంట్ ఇంజనీర్స్ ను విజయ్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అంతేకాదు ఈ ఘటనపై శాఖాపరమైన విచారణకు ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు మరోసారి పునరావ్రుతమైతే.. మరింత కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వం హెచ్చరించింది.
కాగా తమిళనాడులో 1965లో జరిగిన హిందీ వ్యతిరేక ఉద్యమాల తర్వాత ద్విభాషా విధానం రాజకీయంగా సామాజికంగా ప్రాధాన్యం సంతరించుకుంది. 1968లో అప్పటి సీఎం సీ.ఎన్. అన్నాదురై నేత్రుత్వంలోని ప్రభుత్వం ఈ ద్విభాషా విధానానికి సంబంధించి తీర్మానానికి ఆమోదం తెలిపింది. ఆ తీర్మానం ప్రకారం రాష్ట్రంలో హిందీ, సంస్క్రుతం వంటి ఇతర భాషలకు పాఠ్య ప్రణాళికలో కానీ, అధికారిక వినియోగంలో కానీ చోటు లేకుండా తమిళం, ఇంగ్లీష్ లను మాత్రమే ప్రాథమిక భాషలుగా కొనసాగిస్తున్నారు. ప్రభుత్వాలు మారినా.. దశాబ్దాలుగా ఈ విధానం తమిళనాడులో కచ్చితంగా అమలు అవుతోంది.