SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Thrissur Gang Rape Case: ప్రియురాలితో లాడ్జిలో భర్త..సుపారీ ఇచ్చి మహిళపై అత్యాచారం చేయించిన భార్య!

Thrissur Gang Rape Case Update: కేరళలోని త్రిశ్శూర్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఇటీవలే ఓ మహిళపై సామూహిక అత్యాచారం జరగ్గా.. దానిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విచారణలో భాగంగా ఇది పథకం ప్రకారం జరిగిన కుట్ర అని తేలింది. బాధిత మహిళ ఓ వ్యక్తితో లాడ్జిలో ఉన్న క్రమంలో సమాచారం తెలుసుకున్న వ్యక్తి భార్య.. ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది. కొందరు సుపారీ ఇచ్చి సదరు మహిళపై అత్యాచారం చేయించినట్లు పోలీసుల విచారణలో తెలిసింది.

Written By Harish Darla
Published: Oct 02, 2026, 08:59 AM IST | Updated: Oct 02, 2026, 09:02 AM IST
Join

Thrissur Gang Rape Case Update: కేరళలోని త్రిశ్శూర్ ఆర్టీసీ బస్టాండు సమీపంలో సెప్టెంబర్ 22న  అత్యాచార ఘటన చోటుచేసుకుంది. బస్టాండ్ సమీపంలోని లాడ్జిలో ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. మలప్పురం జిల్లా నిలంబూర్ ప్రాంతానికి చెందిన 38 ఏళ్ల మహిళ, వివాహితుడైన తన ప్రియుడు గుణశేఖరన్‌తో కలిసి ఆ లాడ్జిలో గది తీసుకొని అందులో కలిసున్నారు. అయితే గుణశేఖరన్ తమిళనాడులోని తిరుప్పూర్‌కు చెందినవాడిగా పోలీసులు విచారణలో తేలింది.

అయితే తన భర్త వేరొక మహిళతో లాడ్జిలో ఉన్నాడని గుణశేఖరన్ భార్యకు విషయం తెలిసిపోయింది. వెంటనే తన భర్త మొబైల్ లోకేషన్ ద్వారా.. ఆ లవర్స్ ఇద్దరూ బస చేసిన లాడ్జిని కచ్చితంగా గుర్తించారు. ఈ క్రమంలో వారిద్దరిపై ప్రతీకారం తీర్చుకోవాలని గుణశేఖరన్ భార్య పన్నాగం పన్నింది. ప్రతీకారం నేపథ్యంలో ఓ క్రిమినల్ గ్యాంగ్‌కు డబ్బు (సుపారీ) ఇచ్చి ఈ దారుణానికి ఒడిగట్టింది.

ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం.. ఆ క్రిమినల్ గ్యాంగ్‌లోని నలుగురు వ్యక్తులు పోలీసుల వేషధారణలో లాడ్జిలోకి ప్రవేశించారు. ఈ క్రమంలో గుణశేఖర్ ఉన్న రూమ్‌కి వెళ్లి.. ప్రియురాలిని కొట్టి, అతడ్ని గట్టిగా కట్టేసి.. కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి.. బలవంతంగా కారులో కిడ్నాప్ చేసినట్లు సమాచారం. మార్గమధ్యంలో క్రిమినల్ గ్యాంగ్ గుణశేఖరన్ కాళ్లు, చేతులు విరగ్గొట్టి ఓ ఆస్పత్రి బయట పడేశారు. ఆ తర్వాత బాధితురాలిని వేరొక కారులో నిర్మాణుష ప్రదేశానికి తీసుకెళ్లి క్రిమినల్ గ్యాంగ్ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.

అయితే ఆ గ్యాంగ్ బారి నుంచి ఎట్టకేలకు తప్పించుకున్న బాధితురాలు నిలంబూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. జరిగినదంతా పోలీసులకు వివరించి కేసు నమోదు చేయడంతో విచారణలో ఈ బాగోతం అంతా బయటపడింది. త్రిశ్శూర్ సిటీ పోలీస్ కమిషనర్ నకుల్ రాజేంద్ర దేశ్‌ముఖ్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి.

పోలీసు బృందాలు నెడుంబస్సేరి, తిరుప్పూర్, కోయంబత్తూర్, పళని తదితర ప్రాంతాల్లో గాలింపు చేపట్టి దేవి, థామస్ ప్రియదర్శన్ దేవ (27), రఘుపతి రాజా (20), శంకర్ (20), పాల్‌రాజ్ (31) అనే ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితులను కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం వారికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది. అయితే ఈ ఘటనలో పాలుపంచున్న ఓ మైనర్ పరారీలో ఉన్నట్లు తేలింది. అతని కోసం పోలీసులు తీవ్రంగా గాలిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES