SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

రైలు టికెట్ క్యాన్సల్ చేస్తున్నారా? ఈ కొత్త రూల్స్ తెలిస్తే మీ డబ్బులు సేఫ్.. రిఫండ్ ప్రాసెస్ ఇదే!

మీరు కూడా భారతీయ రైల్వేలో ప్రయాణించాలనుకుంటూ, కొన్ని కారణాల వల్ల టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తుందా? సాధారణంగా టికెట్ క్యాన్సిల్ చేస్తే ఎంత డబ్బు రిఫండ్ అవుతుంది? ఏ సమయం వరకు క్యాన్సిల్ చేయవచ్చు? భారతీయ రైల్వే నియమాలు ఏమిటి? ఈ విషయాల గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written By Renuka Godugu
Published: Sep 16, 2026, 11:07 AM IST | Updated: Sep 16, 2026, 11:14 AM IST
Image Credit: Railway Ticket Cancellation
Join

Ticket Cancellation Rules: భారతదేశవ్యాప్తంగా ప్రతిరోజూ వేల సంఖ్యలో రైళ్లు ప్రయాణిస్తుంటాయి. చాలా మంది రైలు ప్రయాణాన్ని ఇష్టపడతారు. మీరు కూడా ట్రైన్, ఫ్లైట్ లేదా బస్సు ద్వారా ప్రయాణం చేస్తుండవచ్చు. అయితే, ప్రత్యేకంగా రైలు ప్రయాణం చేసేవారు ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే ఏం చేయాలి? రిఫండ్ వస్తుందా? ఏ పరిస్థితుల్లో టికెట్ క్యాన్సిల్ చేసుకోవచ్చు? ఎంత డబ్బు తిరిగి వస్తుంది? వాటి నియమాలు ఏమిటి? అనేది తెలుసుకోవడం ముఖ్యం.

సాధారణంగా కన్ఫర్మ్స్ ట్రైన్ టికెట్ల రిఫండ్ అమౌంట్, మీరు ఎంత సమయం లోపు టికెట్ క్యాన్సిల్ చేస్తున్నారు. ట్రైన్ షెడ్యూల్‌పై ఆధారపడి ఉంటుంది. రైలు వెళ్ళిపోయిన తర్వాత క్యాన్సిల్ చేస్తే మీకు ఒక్క రూపాయి కూడా వెనక్కి రాదు. మీరు 72 గంటల లోపు ముందే టికెట్‌ను క్యాన్సిల్ చేయాల్సి ఉంటుంది. మీ ట్రావెల్ క్లాస్‌ను బట్టి రిఫండ్ అమౌంట్ ఉంటుంది. అలాగే 24 నుండి 72 గంటల మధ్యలో క్యాన్సిల్ చేస్తే కూడా కొంత ఛార్జీలు కట్ చేసి మిగిలిన డబ్బును రిఫండ్ చేస్తారు.
ఒకవేళ సమయం ఇంకా తక్కువగా ఉండి, అంటే 8 నుండి 24 గంటల లోపు టికెట్ క్యాన్సిల్ చేయాల్సి వస్తే, ఛార్జీలు మరింత ఎక్కువగా కట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి, మీరు రైల్వే టికెట్‌ను ముందుగానే ప్లాన్ చేసుకుని క్యాన్సిల్ చేస్తే, ఎక్కువ మొత్తంలో రిఫండ్ పొందే అవకాశం ఉంటుంది.

RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్లు..
మీ వద్ద RAC లేదా వెయిటింగ్ లిస్ట్ టికెట్ ఉన్నా కూడా, నిర్ణీత సమయానికి క్యాన్సిలేషన్ చేసుకోవాలి. ఏదైనా క్యాన్సిలేషన్ ఛార్జీలు తీసేసి మిగిలిన డబ్బును రిఫండ్ చేస్తారు. అందుకే ఎప్పటికప్పుడు మీ టికెట్ స్టేటస్‌ను, ట్రైన్ షెడ్యూల్‌ను గమనిస్తూ ఉండాలి. రైలు బయలుదేరే ముందే టికెట్ క్యాన్సిల్ చేస్తేనే, కొన్ని క్లారికల్ ఛార్జీలు పోగా మిగిలిన డబ్బు రిఫండ్ అవుతుంది.

ట్రైన్ 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే..?
మీరు అనుకున్న సమయం కంటే ట్రైన్ 3 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే, మీరు ప్రయాణం చేయకూడదని నిర్ణయించుకుంటే ఫుల్ రిఫండ్ పొందవచ్చు. అయితే, దీని కోసం మీరు రైలు బయలుదేరే ముందే రిఫండ్ ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉంటుంది, అప్పుడే మీకు పూర్తి రీఫండ్ లభిస్తుంది.

ట్రైన్ క్యాన్సిల్ అయితే?
ఒకవేళ రైలు పూర్తిగా క్యాన్సిల్ అయితే, మీరు టికెట్ బుక్ చేసిన మొత్తం డబ్బు అంతా రిఫండ్ చేయబడుతుంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్న విధానంలోనే తిరిగి మీ ఖాతాలోకి డబ్బులు వస్తాయి. అటువంటప్పుడు మీరు ప్రత్యేకంగా టికెట్ క్యాన్సిల్ చేయాల్సిన అవసరం లేదు.

Also Read: రైలు ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. బ్రిక్స్ సదస్సు ఎఫెక్ట్

Also Read:  రైల్వే ప్రయాణీకులకు శుభవార్త.. దీపావళి సందర్భంగా 20 ప్రత్యేక రైళ్లు, హైదరాబాద్‌ మీదుగా ఎన్నంటే?
 

టికెట్ బుక్ చేసేటప్పుడు డబ్బులు డెబిట్ అయ్యి, టికెట్ రాకపోతే ఏం చేయాలి?
ఈ మధ్యకాలంలో ఆన్‌లైన్‌లో టికెట్లు బుక్ చేసేటప్పుడు చాలా మంది ఈ సమస్యను ఎదుర్కొంటున్నారు. డబ్బులు డెబిట్ అయినప్పటికీ టికెట్ కన్ఫర్మ్ కాకపోవడం వంటివి జరుగుతున్నాయి. అటువంటి సమయంలో ముందుగా మీ స్టేటస్‌ను చెక్ చేయండి. టికెట్ జనరేట్ కాలేదంటే, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందో లేదో చూడండి. ఒకవేళ డబ్బులు డెబిట్ అయితే, అవి త్వరలోనే మీకు రిఫండ్ అవుతాయి. ఒకవేళ సరైన సమయంలో మీకు రిఫండ్ రాకపోతే, వెంటనే మీ PNR నంబర్, పేమెంట్ వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES