Two Headed Snake Viral Video: సోషల్ మీడియాలో నిత్యం రకరకాల జంతువులతో పాటు వింత జీవులకు సంబంధించిన వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో ప్రత్యక్షమైన ఓ నాగుపాము వీడియో సోషల్ మీడియా వినియోగదారులను తీవ్రంగా ఆశ్చర్యాన్ని గురి చేస్తూ వస్తోంది. ఒకే చోట రెండు తలలు కలిగిన.. రెండు పడగలు విప్పి బుసలు కొడుతున్న ఓ విషెస్ సర్పానికి సంబంధించిన వీడియో ఇప్పుడు విపరీతంగా వైరల్ అవుతుంది. అసలు ఇలా పాముకి రెండు తలలు ఉంటాయా? దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
వైరల్ అవుతున్న ఈ వీడియో వివరాల్లోకి వెళితే.. ఒక చిన్న పైపు రంధ్రంలో నుంచి నాగుపాము బయటికి వచ్చేందుకు ప్రయత్నిస్తూ ఉండడం మీరు వీడియోలో చూడొచ్చు. అయితే సాధారణంగా కనిపించే పాములకు ఇది భిన్నంగా ఉంది.. ఈ పాముకు ఒకే ముండెంపై రెండు వేరువేరు తలలు ఉండడం మీరు గమనించవచ్చు. పైపు నుంచి బయటికి చూస్తూ ఆ రెండు తలలతో.. పడక విప్పడం మీకు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా జనావాసాల్లో కనిపించే.. రెండు తలల పాములు అంటే ఒకవైపు నిజమైన తల తోక భాగంలో కూడా తల ఆకారం కలిగి ఉండడం సర్వసాధారణం. కానీ ఈ వీడియోలో కనిపించే పాముకు ఒకే మెడ భాగం నుంచి రెండు పూర్తిస్థాయి తలలు చీలి ఉండడం మీరు క్లియర్ గా చూడొచ్చు..
ఈ వింత సర్ప దృశ్యాలు ఎవరు.. ఎక్కడ తీశారనే వివరాల స్పష్టంగా తెలియనప్పటికీ.. వీడియో మాత్రం సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతూ వస్తోంది. ఈ వీడియోను లక్షలాదిమందికి పైగా వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వేల సంఖ్యలో షేర్ కూడా చేశారు. అయితే, దీనిని చూసిన సోషల్ మీడియా వినియోగదారులు ఆశ్చర్యంతో నోరెళ్లబెడుతున్నారు.. సైన్స్ పరంగా చూస్తే.. న్యూ పరమైన లోపాలతో పాటు పిండం సరిగ్గా విభజించకపోవడం వల్ల ఇలాంటి జీవులు పుడతాయని కొంతమంది నిపుణులు తెలుపుతున్నారు..
అయితే, ప్రస్తుతం డిజిటల్ యుగంలో ఆధునిక సాంకేతికత విపరీతంగా పెరిగిపోయిన నేపథ్యంలో.. చాలామంది సోషల్ మీడియా వినియోగదారులు ఈ వీడియోను చూసి భిన్నభిప్రాయాలు వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఇది సహజమైన పాము కాదని.. ఆర్టిఫిషియన్ ఇంటిలిజెన్సీ లేదా కంప్యూటర్ గ్రాఫిక్స్ వినియోగించి క్రియేట్ చేశారని కామెంట్లలో పెడుతూ వస్తున్నారు. ఏది ఏమైనా పట్టి కళ్ళ ముందు రెండు తలలతో పడకవిప్పి కనిపిస్తున్న ఈ పాముకు సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది..