• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /రైతులకు బిగ్ అలర్ట్.. రూ.2000 మీ ఖాతాలో పడ్డాయో లేదో మొబైల్లో ఇలా చెక్ చేసుకోండి!

రైతులకు బిగ్ అలర్ట్.. రూ.2000 మీ ఖాతాలో పడ్డాయో లేదో మొబైల్లో ఇలా చెక్ చేసుకోండి!

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత నిధులు త్వరలోనే రైతుల ఖాతాల్లో జమ కానున్నాయి. అక్టోబర్ 30వ తేదీన ఈ నిధులు జమయ్యే అవకాశం ఉన్నందున, రైతులు ముందుగానే ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేసుకోవడం అత్యంత అవసరం. డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ ద్వారా నిధులు ఖాతాలో జమ అయిన వెంటనే ఆన్‌లైన్‌లో స్టేటస్‌ను కూడా తనిఖీ చేసుకోవచ్చు. ఈ అంశాలన్నింటి పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Oct 25, 2026, 12:18 PM IST|Updated: Oct 25, 2026, 01:27 PM IST
joinshare
రైతులకు బిగ్ అలర్ట్.. రూ.2000 మీ ఖాతాలో పడ్డాయో లేదో మొబైల్లో ఇలా చెక్ చేసుకోండి!
Image Credit: PM Kisan 24th Installment:

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హీరోయిన్స్ యాక్షన్ మోడ్..  హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

2

విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..

3

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 28న రాబోతుంది తుఫాను కాదు..తీవ్ర తుఫాను..ఐఎండీ హెచ్చరిక!

4

డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు తెర.. ప్రొబేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని DEOలకు ఆఫీసర్లకు విద్యాశాఖ ఆదేశం..!!

5

Censor Board Data Leak: సెన్సార్‌ బోర్డులో భారీ డేటా లీక్..ఇంటర్నెట్‌లో 500కు పైగా సినిమాల సమాచారం బహిర్గతం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

PM Kisan 24th Installment: కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఒక ప్రధాన పథకమే ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన. ఇది చిన్న, సన్నకారు రైతులకు ఎంతగానో ఉపయోగపడుతోంది. ఈ పథకం ద్వారా ప్రతి సంవత్సరం రూ.6,000 అర్హులైన రైతుల ఖాతాల్లో డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో జమ చేస్తున్నారు. ప్రతి నాలుగు నెలలకు ఒకసారి 2,000 రూపాయల చొప్పున నిధులు విడుదల అవుతాయి. అర్హత కలిగిన రైతులకు మాత్రమే ఈ పీఎం కిసాన్ నిధులు అందుతాయి. ఇందుకోసం ముందుగా ఈకేవైసీ పూర్తి చేసుకోవడం తప్పనిసరి. అలాగే పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్ కూడా రైతుల వద్ద ఉండాలి. నిధులు జమ అయిన తర్వాత వాటి స్థితిని ఆన్లైన్‌లో సులభంగా తెలుసుకోవచ్చు.

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019లో కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. రైతులకు ఆర్థికంగా చేయూతనివ్వడమే ఈ పథకం ప్రధాన లక్ష్యం. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నారు. ఎలాంటి మధ్యవర్తిత్వం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాల్లోనే నిధులు జమ అవుతున్నాయి. ప్రతి ఏడాది మొత్తం రూ.6,000 పొందుతున్న రైతులు, ఏప్రిల్ నుంచి జూలై మధ్య, ఆగస్టు నుంచి నవంబర్ మధ్య, డిసెంబర్ నుంచి మార్చి మధ్య కాలాల్లో ఒక్కో విడతగా రూ. 2,000 చొప్పున అందుకుంటున్నారు.

మీ ఖాతాలో ఈ రూ. 2,000 జమ అయ్యాయా? లేదా? అనే విషయాన్ని పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్, మొబైల్ యాప్, లేదా కిసాన్ ఈ-మిత్ర చాట్‌బాట్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక 23వ విడత నిధులు జూన్ 20వ తేదీన జమయ్యాయి. ఇప్పుడు అక్టోబర్ 30వ తేదీన 24వ విడత రూ. 2,000 జమ అవుతాయని భావిస్తున్నందున, దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది రైతులు దాని కోసం ఎదురుచూస్తున్నారు.

Read Also: ఈ చిన్న QR కోడ్‌తో పీఎం కిసాన్‌ యాప్ డౌన్‌లోడ్ చేయండి.. మీ స్టేటస్ వెంటనే చెక్ చేసుకోండి!

పీఎం కిసాన్ స్టేటస్ తనిఖీ చేసుకునే విధానం..
1. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్‌సైట్ pmkisan.gov.in ను ఓపెన్ చేయండి.
2. అక్కడ "Know Your Status" ఆప్షన్ కనిపిస్తుంది, దాన్ని ఎంచుకోండి.
3. తర్వాత పీఎం కిసాన్ రిజిస్ట్రేషన్ నంబర్‌ను నమోదు చేయాలి.
4. క్యాప్చర్ కోడ్‌ను ఎంటర్ చేసిన తర్వాత "Get OTP" పై క్లిక్ చేయండి.
5. వెరిఫికేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత, మీ నిధుల స్థితి ఆన్‌లైన్‌లో కనిపిస్తుంది.

Add Zee News as a Preferred Source
TAGS:
PM Kisan
PM Kisan 2026
PM Modi
Govt Schemes