Two killed several injured delhi building collapse: దేశ రాజధాని ఢిల్లీలో రెండస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలీంది. షహదరా జిల్లాలోని జ్వాలా నగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. పెద్ద శబ్దం రావడంతో ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భారీగా శిథిలాలు ఆప్రదేశంలో పేరుకుపోయాయి.
#WATCH | Delhi | An old house collapsed in the Jwala Nagar area, under the jurisdiction of the Vivek Vihar police station in the Shahdara district, today. Teams from the Fire Department and Delhi Police, and ambulance services rushed to the site and rescued 7-8 people. A three-month-old child has lost his life in the incident North MCD Chairman Pankaj Luthra says, " This was a 40- 50-year-old building. A three-month-old child died in the incident."
— ANI (@ANI) November 17, 2026
శిథిలాల కింద ఆరుగురు చిక్కుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. మరోవైపు ఇద్దరు ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన వారిలో మూడేళ్ల బాలిక, 35 ఏళ్ల మరో వ్యక్తి ఉన్నట్లు స్థానికులు గుర్తించారు వెంటనే ఫైర్ సిబ్బంది, పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న సహయక బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యల్ని ముమ్మరం చేశాయి. చనిపోయిన ఇద్దరిలో ఒక చిన్నారి కూడా ఉంది. గాయపడ్డ వారిని హుటా హుటీన దగ్గరలోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో స్థానికంగా టెన్షన్ వాతావరణం తలెత్తింది. ఘటనపై ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఢిల్లీలో గత కొన్ని నెలలుగా జరిగిన ఘటనలు..
గత కొన్ని నెలలుగా ఢిల్లీలో వరుస భవనాలు కుప్పకూలడంతో స్థానికులు సైతం ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. సెప్టెంబర్ 6న సత్య నికేతన్‌లో పేయింగ్ గెస్ట్ వసతి ఉన్న ఐదు అంతస్తుల భవనం కూలిపోవడంతో విద్యార్థులతో సహా ఏడుగురు మరణించారు. అక్టోబర్ 7న ఉత్తర ఢిల్లీలోని సీమాపురిలో మరో భవనం కూలి నలుగురు మృతి చెందారు. ఆతర్వాత మరల
అక్టోబర్ 25న, ఈశాన్య ఢిల్లీలోని హర్ష్ విహార్‌లోని మిలన్ గార్డెన్‌లో నిర్మాణంలో ఉన్న కట్టడం కూలిపోవడంతో 60 ఏళ్ల చందర్‌పాల్, అతని 33 ఏళ్ల కుమారుడు విజయ్ కుమార్ మృతి చెందారు. నవంబర్ 15న పహర్‌గంజ్‌లో భవనం కూలిన ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.