SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Video Viral: తమిళనాడులో షాకింగ్.. రన్నింగ్ ట్రైన్‌నుంచి సముద్రంలోకి దూకిన యువతి.. వీడియో వైరల్..

Pamban bridge tragedy: కొన్ని గంటల వ్యవధిలో పాంబన్ రైల్వే వంతెన నుంచి సముద్రంలోకి ఇద్దరు ప్రయాణికులు దూకిన ఘటనపై రైల్వే అధికారులు విచారణ చేపట్టారు.ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 16, 2026, 16:12 IST | Updated: Nov 16, 2026, 16:23 IST
Image Credit: Two passenger jump into sea in tamil nadu
Join

Two passenger jump into sea from moving train on pamban bridge: ఇటీవల కొంత మంది ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి  చూసి పెద్దది చేసుకుంటున్నారు. ప్రతి దానికి ఆత్మహత్యలు మాత్రమే పరిష్కారం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు.  దీంతో కుటుంబ సభ్యులకు చెప్పకుండా ఇంటి నుంచి బైటకు వచ్చేసి దారుణాలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో తమిళనాడులో పాంబర్ రైల్వే వంతెన  మీద రన్నింగ్ ట్రైన్ నుంచి ఇద్దరు ప్రయాణికలు సూసైడ్ కు యత్నించడం తీవ్ర సంచలనంగా మారింది. దీనిపై రైల్వే అధికారులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. 

 

 

తమిళనాడులోని పాంబన్ రైల్వే వంతెన మీద చోటుచేసుకున్న ఘటనలు షాకింగ్ ఘటనలు అందర్నిషాకింగ్ కు గురి చేస్తున్నాయి. మొదటి ఘటనలో, శనివారం రాత్రి రామేశ్వరం-మదురై ప్యాసింజర్ రైలు పాంబన్ రైల్వే వంతెన మధ్య సముద్ర పై నుంచి వెళ్తుండగా ఒక యువకుడు సముద్రంలోకి దూకాడు. అతడు దూకిన తర్వత కొంత మంది రైలులో ప్రయాణిస్తున్న వారు రైల్వే అధికారులకు సమాచారం అందించారు. అతని కోసం రైల్వే పోలీసులు గాలింపు చేపట్టగా అతని శవం కాస్త స్థానికంగా ముల్లిమునై సమీపంలో ఓడ్డుకు కొట్టుకొని వచ్చినట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటన జరిగిన గంటల వ్యవధిలోనే మరో యువతిసైతం అచ్చం ఇదే విధంగా రన్నింగ్ ట్రైన్ నుంచి సముద్రంలోకి దూకేందుకు ప్రయత్నించింది.

 

కేరళలోని పాలక్కాడ్ నుంచి రామేశ్వరం వెళ్తున్న అమృత ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఒక మహిళ, రైలు పాంబన్ రైల్వే వంతెనను దాటుతుండగా ఒక్క సారిగా సముంద్రంలోకి దూకింది. ఆమె సముద్రంలోకి దూకిన ఘటన కాస్త రైల్వేలోని సీసీ కెమెరికాలో రికార్డు అయ్యాయి. కానీ ఆమె సముద్రంలో పడకుండా ఐరన్ రాడ్ లోకి బలంగా ఢీకొని కింద పక్కన పడింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి.

 దీంతో ఆమెను రైల్వే సిబ్బంది గుర్తించి వెంటనే స్థానికంగా ఉన్నరామనాథపురం ప్రభుత్వ వైద్య కళాశాల ఆసుపత్రికి తరలించారు. ఆమె ప్రస్తుతం కొలుకుంటుంది.ఆమె వివరాలు తెలుసుకునేందుకు అధికారులు ప్రయత్నాలు చేపట్టారు. గంటల వ్యవధిలో రెండు ఘటనలు అది కూడా  పాంబన్ వంతెన మీదనే చోటు చేసుకొవడం పల్ల రైల్వే అధికారులు ఆందోళనలు వ్యక్తం చేశారు. ట్రైన్ లలో బందో బస్తు నిర్వహించే ఆర్పీఎఫ్ దళాల్ని అప్రమత్తం చేశారు.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES