SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: దోశ షాపులో ఇద్దరమ్మాయిల రచ్చ.. గిన్నెలు పడేస్తు, సిబ్బందిపై బూతులు .. వీడియో వైరల్..

Two Varanasi sister row in up: ఇద్దరమ్మాయిలు దోశ షాపులో నానా రచ్చ చేశారు. అక్కడి వారు సముదాయించేందుకు చూస్తున్న కూడా విన్పించుకోలేదు. యూపీలోని వారణాసిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో నెట్టింట వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Nov 16, 2026, 16:54 IST | Updated: Nov 16, 2026, 17:03 IST
Image Credit: Two Varanasi sisters attacks on dosa shop owner:
Join

Two Varanasi sisters attacks on dosa shop owner: కొన్నిసార్లు మనం ఏదైన కారణాలతో బైటకు వెళ్లినప్పుడు  అనుకొని ఘటనలు జరుగుతాయి. కొంత మంది చిన్న చిన్న వాటికే అతిగా రియాక్ట్ అవుతారు. అంతే కాకుండా ఎదుటి వారితో గొడవలు పడతారు. కావాలని చేయలేదని చెప్పిన కూడా పట్టించుకోరు. చిన్న విషయాల్ని పెద్దది చేసుకుని వాగ్వాదం, చివరకు గొడవలు, పోలీసుల వరకు వెళ్లిపోతారు. ఇలాంటి ఘటనలు తరచుగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతాయి. తాజాగా.. ఒక వ్యక్తి హోటల్ కు వెళ్లగాచిన్న పాటి గొడవ అయ్యింది. దీనిపై పోలీసులు చర్యలు తీసుకొలేదని అతని కూతుళ్లు  హోటల్ కు చేరుకుని రచ్చ రచ్చ చేశారు. యూపీలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్గా మారింది.

 

 


ఉత్తరప్రదేశ్ వారణాసి మహమూర్‌గంజ్‌లో  షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. లీలా రామ్ దోశ  షాపుకు ఇద్దరు అమ్మాయిలు వెళ్లారు.  ఆ తర్వాత అక్కడ గట్టిగా అరుస్తు హోటల్ లో ఉన్న సామాగ్రిని రోడ్డు మీద పడేశారు. అడ్డొచ్చిన సిబ్బందిపై నానా బూతులు తిట్టారు. ఇద్దరు యువతుల్ని ఆపేందుకు ఎంతగా ప్రయత్నించిన కూడా వారు ఆగలేదు. మొత్తంగా  ఈ ఘటనపై స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. 

అయితే.. నవంబర్ 4న ఈ షాపుకు వచ్చిన తమ తండ్రిని సిబ్బంది దారుణంగా కొట్టారని దానిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకొలేదని చెప్పారు.  అందుకు షాపుపై తాము దాడి చేసినట్లు స్థానికులకు చెప్పారు. మరోవైపు దుకాణ సిబ్బంది మాత్రం అమ్మాయిలకు తమను డబ్బులు కావాలని డిమాండ్ చేశారని ఇవ్వనందుకు ఈవిధంగా దాడులు చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటన ప్రస్తుతం స్థానికంగా తీవ్ర రచ్చగా మారింది. దీనిపై పోలీసులు రంగంలోకి  దిగి సీసీ ఫుటేజీ ఆధారంగా విచారణ చేపట్టారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

ZEENEWS TRENDING STORIES