నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్ పూర్తి వివరాలు!
యూనైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ (UIIC) భారీ నోటిఫికేషన్ విడుదల చేయనుంది. దీని ద్వారా మొత్తం దేశవ్యాప్తంగా ఉన్న 450 ఖాళీలను భర్తీ చేయనుంది. నిరుద్యోగులు అధికారిక వెబ్‌సైట్ uiic.co.in లో నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం.
UIIC Assistant Recruitment 2026: కేంద్ర బీమా సంస్థ నోటిఫికేషన్ అతి త్వరలో 450 పోస్టుల భర్తీ చేయనుంది. యూఐఐసీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 పూర్తి వివరాలతో కూడిన నోటిఫికేషన్ విడుదల చేయనుంది. అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్ వెబ్‌సైట్ uiic.co.in లో పూర్తి వివరాలు పొందుపరుస్తారు. ఇందులో ఎంపిక విధానం, అప్లికేషన్ ప్రక్రియ, ఫీజు, ఏజ్ రిలాక్సేషన్ వివరాలు ఉంటాయి.
యూఐఐసీ అసిస్టెంట్ రిక్రూట్మెంట్ 2026 అసిస్టెంట్ ఖాళీలను దేశవ్యాప్తంగా భర్తీ చేయనుంది. కాబట్టి ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకోవచ్చు. దీనికి కేవలం ఆన్‌లైన్‌లోనే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
అర్హత వివరాలు..
యూఐఐసీ అసిస్టెంట్ పోస్టులకు అర్హత ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి డిగ్రీ పొంది ఉండాలి. అంతేకాదు స్థానిక భాష, రాయగలగాలి, మాట్లాడాలి, చదవాలి.
యూఐఐసీ అసిస్టెంట్ పోస్టులకు వయస్సు..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21 నుంచి 30 మధ్య ఉండాలి. ఇక ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది.
దరఖాస్తు చేసుకునే విధానం..
యూఐఐసీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు విధానం అతి త్వరలో ప్రారంభం కానుంది. నోటిఫికేషన్ విడుదలైన వెంటనే దరఖాస్తు చేసుకునే ఆన్‌లైన్ లింక్ కూడా యాక్టివేట్ అవుతుంది.
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ వారికి రూ.1000 తోపాటు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఇక దివ్యాంగులకు రూ.250తోపాటు జీఎస్టీ.
Read Also: లక్షల్లో జీతం.. GATE 2027 స్కోర్‌తో GAIL లో డ్రీమ్ జాబ్! ఎలా అప్లై చేయాలంటే?
సిలబస్ పరీక్షా విధానం..
యూఐఐసీ అసిస్టెంట్ ఎగ్జామ్ సిలబస్ గురించి తెలుసుకుందాం. ఇది సబ్జెక్టువారీగా ఉంటుంది. స్థానిక భాషలో కూడా రాయవచ్చు. ప్రధానంగా రీజనింగ్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్, కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 200 ప్రశ్నలకు 250 మార్కులు, సమయం 120 నిమిషాలు ఉంటుంది. ఇందులో ఒక్క తప్పు జవాబుకు 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది.