GAIL Recruitment 2027: గెయిల్ ఇండియాలో జాబ్ కొట్టాలన్నది మీ కలనా? గేట్ స్కోర్ కార్డు కూడా ఉందా? అయితే, మీకు బంపర్ ఆఫర్. గేయిల్ ఇండియా లిమిటెడ్‌లో ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ పోస్టుల భర్తీ జరుగుతోంది. గేట్ స్కోర్ కార్డు ఉంటే చాలు మీరు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ అప్లికేషన్ ప్రక్రియ 2027 ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం అవుతుంది. మార్చి 18వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. కేవలం గెయిల్ అధికారిక వెబ్‌సైట్ ద్వారానే ఈ దరఖాస్తుల స్వీకరణ జరుగుతుంది.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027 అర్హత..
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారికి ఇంజినీరింగ్‌లో బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కనీసం 65 శాతం మార్కులతో పాస్ పర్సంటేజ్ ఉన్నవారు అర్హులు.
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (కెమికల్)..
కెమికల్, పెట్రోకెమికల్, కెమికల్ టెక్నాలజీ సంబంధిత క్యాటగిరీ ఇంజినీరింగ్ చేసిన వారు అర్హులు.
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (ఇన్‌స్ట్రూమెంటేషన్)..
ఇన్‌స్ట్రూమెంటేషన్, ఇన్‌స్ట్రూమెంటేషన్ అండ్ కంట్రోల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రూమెంటేషన్
ఎగ్జిక్యూటీవ ట్రైనీ (ఎలక్ట్రికల్)..
ఎలక్ట్రికల్, ఎలక్ట్రికల్ అండ్ పవర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ పవర్ సంబంధిత కేటగిరీ చేసిన వారు అర్హులు.
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ (మెకానికల్)..
మెకానికల్, ప్రొడక్షన్, ప్రొడక్షన్ అడ్ ఇండస్ట్రీయల్, మ్యానుఫ్యాక్చరింగ్, మెకానికల్, ఆటోమొబైల్
వయో పరిమితి..
ఈ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీకి వయో పరిమితి 2027 మార్చి 18 నాటికి 26 ఏళ్లు ఉండాలి.
గెయిల్ రిక్రూట్మెంట్ 2027 ఎంపిక ప్రక్రియ..
గేట్ స్కోర్ కార్డు 2027 ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు.
గేట్ 2027 రిజిస్టర్ చేసి పరీక్ష రాయాలి. ఈ పోస్టులకు సంబంధించిన సబ్జెక్టులు గేట్‌లో పేపర్ ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది.
ఇక అభ్యర్థుల ఎంపిక అనేది గేట్ మార్కులు, దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల సంఖ్య ఆధారంగా షార్ట్‌లిస్ట్ చేస్తారు.
గెయిల్ 2027 ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే విధానం..
గెయిల్ అధికారిక వెబ్‌సైట్ https://www.gailonline.com/ ఓపెన్ చేయండి.
ఎగ్జిక్యూటీవ్ ట్రైనీ రిక్రూట్మెంట్ లింక్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ ప్రక్రియను పూర్తి చేయండి.
ఆ తర్వాత లాగిన్ చేసి అప్లికేషన్ ఫారమ్ ఫిల్ చేయండి
అప్లికేషన్ ఫీజు చెల్లించండి.
చివరగా ఫారమ్ సబ్మిట్ చేసి కన్ఫర్మేషన్ పేజీ డౌన్‌లోడ్ చేయండి
మీ వద్ద ఒక కాపీ పెట్టుకోండి.
ఈ గెయిల్ ఇండియా ట్రైనీ ఎగ్జిక్యూటీవ్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ముందు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదవండి. మరిన్ని వివరాలుకు గెయిల్ అధికారిక వెబ్‌సైట్ ఎప్పటికప్పుడు చెక్ చేయండి. ఇందులో ఖాళీు, గేట్ పేపర్స్, ఫీజు ఇతర రిక్రూట్మెంట్ వివరాలు కూడా అప్‌డేట్ చేస్తారు.