• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ రెడీ.. హాట్రిక్ పై బీజేపీ కన్ను..

అసెంబ్లీ ఎన్నికలకు ఉత్తర్ ప్రదేశ్ రెడీ.. హాట్రిక్ పై బీజేపీ కన్ను..

Uttara Pradesh Election 2027: ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పార్టీలు అసెంబ్లీ ఎన్నికలకు సన్నద్ధమవుతున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ను సమర్థవంతంగా ఎదుర్కోడానికి విపక్షాలు వినూత్న పంథాను అనుసరిస్తున్నాయి. ప్రజల్లో తిరిగి, వారి విశ్వాసంతో అధికారంలోకి రావాలని ప్రతిపక్షాలు వ్యూహాత్మక ప్రణాళికను సిద్ధం చేశాయి. కొత్త రాజకీయ సమీకరణలతో అస్త్ర శస్త్రాలకోసం శ్రమిస్తున్నాయి. దేశ రాజకీయాలకు కీలకమై ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ పార్టీల స్థితిగతులు ఎలా ఉన్నాయి? ఉత్తర్ ప్రదేశ్ సీఎం పీఠం ఎవరి సొంతమయ్యే అవకాశాలున్నాయి? రాజకీయ సమీకరణాల్లో మార్పులపై జీన్యూస్ తెలుగు స్పెషల్ ఫోకస్..!!

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 22, 2026, 14:34 IST|Updated: Nov 22, 2026, 14:38 IST
joinshare
అసెంబ్లీ ఎన్నికలకు  ఉత్తర్ ప్రదేశ్ రెడీ.. హాట్రిక్ పై బీజేపీ కన్ను..
Image Credit: Uttara Pradesh Assembly Election (Source/File)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

UP Election 2027:దేశ రాజకీయాలను ప్రభావితం చేసే ఉత్తర్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు ప్రజల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అధికారంలో ఉన్న భారతీయ జనతాపార్టీకి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు ప్రాంతీయ పార్టీల కలయితో కొత్తపంథాలో అడుగులు వేస్తున్నాయి. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో ఈ సారి మజ్లిస్ పార్టీ కీ రోల్ పోషించాలని ప్రయత్నిస్తోంది.


అధికారం చేజిక్కించుకోవడమే పరమావధిగా రాజకీయ పక్షాలు ఎత్తులకుపై ఎత్తులు వేస్తున్నాయి. యోగి ఆదిత్యనాథ్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం పీఠాన్ని చేజిక్కించుకుని చారిత్రక రికార్డ్ సొంతం చేసుకునేందుకు ఎదురుచూస్తున్నారు. యోగి ఆదిత్యనాథ్ నాయకత్వానికి రాష్ట్రీయ లోక్ దళ్, అప్నాదళ్,  నిషద్ పార్టీ, సుహల్ దేవ్ భారతీయ సమాజ్ పార్టీల కలయికతో జాతీయ ప్రజాస్వామ్య కూటమిగా బరిలో దిగుతున్నారు. బీజేపీ పాలనలో ప్రజాసంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి, విద్యావంతులను, విద్యార్థుల ప్రయోజనాల కోసం అమలు చేసిన పథకాలు తిరుగులేని మెజారిటీ సాధిస్తామనే ధీమా బీజేపీలో వ్యక్తమవుతోంది.

ఆజాద్ సమాజ్ పార్టీతో జట్టు..

సామాజిక్ పరివర్తన్ నినాదంతో ఆల్ ఇండియా మజ్లిస్ ఇతేదుల్ ముస్లిమీన్ జాతీయ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీ ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ ముఖచిత్రం మార్చాలని ప్రయత్నిస్తున్నారు. చంద్ర శేఖర్ ఆజాద్ సారథ్యంలో ఆజాద్ సమాజ్ పార్టీతో జతకట్టి యూపీ రాజకీయాలను శాసించాలని చూస్తున్నారు. తాజాగా ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నో నగరంలో సామాజిక్ పరివర్తన్ మోర్చాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మద్ధతుగా నిలిచిన మజ్లిస్ జాతీయ అధ్యక్షుడు అసదుద్ధీన్ ఒవైసీకీ చంద్రశేఖర్ ఆజాద్ పరివార్ గౌరవ వందనం సమర్పించింది. తమ కూటమి అభ్యర్థి, కాన్షీరామ్ - ఆజాద్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకులు చంద్రశేఖర్ ఆజాద్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాల్లో మార్పు తీసుకురావడానికి, అధికార మార్పే లక్ష్యంగా కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీలు మద్ధతు ఇవ్వాలని ఒవైసీ పిలుపునిచ్చారు.

యూపీ ఎన్నికలను సీరియస్‌గా తీసుకున్న రాహుల్ గాంధీ.. 
అధికార పార్టీపై వ్యతిరేకతను సొమ్ముచేసుకోడానికి కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ప్రధాన మిత్రపక్షం సమాజ్ వాదిపార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్ తో కలిసి చక్రం తిప్పాలని ప్రయత్నిస్తున్నారు. యూపీలోని జన్ అధికార్ పార్టీ, లోక్ దళ్, అప్నీ జనతాపార్టీ వంటి చిన్న రాజకీయ పార్టీల మద్ధతుతో  ఇండియా కూటమిగా ప్రజల్లోకి వెళ్లి మెజారిటీ స్థానాలను సొంతం చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు.

అత్యధిక ఎంపీ, ఎమ్మెల్యేలున్న రాష్ట్రం..

ఉత్తర ప్రదేశ్... భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్రం మాత్రమే కాదు — 403 అసెంబ్లీ స్థానాలు, 80 లోక్ సభస్థానాలతో దేశ రాజకీయాలను శాసించే రాష్ట్రంగా పేరుంది. ఇది దేశంలోనే అత్యంత ప్రభావవంతమైన రాజకీయ క్షేత్రం. ఈ  దేశ రాజకీయాలను ప్రభావితం చేస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఏర్పాటులో రాజకీయాలు కీ రోల్ పోషిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో సామాజిక సమీకరణలు, నాయకత్వ పటిమ, పాలనా సామర్థ్యం, ప్రజలతో మమేకమయ్యే నాయకులకు ఇక్కడ ఓటర్లు ప్రాధాన్యత ఇస్తారని ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలు నిరూపించాయి.

ఉత్తర ప్రదేశ్ రాజకీయాలను శాసించిన ముఖ్యమంత్రులు.. 
ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ పరిస్థితులు, ప్రజాధరణతో వేర్వరు సందర్భాల్లో అధికారం చేపట్టిన ఉద్ధండులు రాజకీయాలకే వన్నెతెచ్చారు. కాలక్రమంలో రాజకీయాల్లో మార్పులు అనివార్యమయ్యాయి. 1990 ముందు పరిస్థితులు వేరు.. 1990 తర్వాత రాజకీయ పరిస్థితులు, సామాజిక మార్పులు కన్పించాయి. కాంగ్రెస్, బీజేపీ, జనతాదళ్ తర్వాత పుట్టుకొచ్చిన ప్రాంతీయ పార్టీలు రాజకీయాలను శాసించాయి.  ఉత్తర్ ప్రదేశ్ రాజకీయాలు గతంలో ఎలా ఉన్నాయి? ఏయే సందర్భాల్లో ఎవరెవరు ముఖ్యమంత్రులయ్యారు? ఇపుడు చూద్ధాం..!!

1991లో భారతీయ జనతాపార్టీ తరఫున కళ్యాణ్ సింగ్ సారథ్యంలో లక్నో కోటపై కాషాయి జెండాను రెపరెపలాడించారు. 1993లో సమాజ్ వాది పార్టీ తరఫున ములాయం సింగ్ యాదవ్ సెన్సేషన్ క్రియేట్ చేశారు. జాతీయ పార్టీలకు చెక్ పెట్టి ప్రాంతీయ పార్టీ తరఫున ముఖ్యమంత్రి పీఠం కైవసం చేసుకున్నారు.

కాన్షీరాం శిష్యురాలిగా మాయావతి ప్రభంజనం..

ఉత్తర్ ప్రదేశ్ లో రాజకీయ చైతన్యంతో కాన్షీరామ్ స్థాపించిన బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మాయావతి ప్రభంజనం సృష్టించారు. 1995, 1997, 2002, 2007 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీ తరఫున నాలుగుసార్లు యూపీ సీఎంగా ప్రాతినిథ్యం వహించారు. ప్రాంతీయ పార్టీల హవా నడుస్తున్న రోజుల్లో కళ్యాణ్ సింగ్ సారథ్యంలో అధికార పార్టీలను ఎండగట్టి, ప్రజావిశ్వాసానికి చేరువయ్యారు. 1997 ఎన్నికల్లో మరోసారి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఉత్తర్ ప్రదేశ్ రెండో ముఖ్యమంత్రిగా కళ్యాణ్ సింగ్ ప్రమాణ స్వీకారం చేసిన సంవత్సరం తర్వాత ఆ పదవినుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత బీజేపీ సీనియర్ నేత రామ్ ప్రకాష్ గుప్త సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. యేడాది కాలంపాటు సీఎంగా ప్రాతినిధ్యం వహించారు. ఆతర్వాత రాజ్ నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్ సీఎం పీఠాన్ని చేజిక్కించుకున్నారు.

తండ్రి ములాయం సింగ్ తర్వాత పార్టీ పగ్గాలను చేపట్టిన యువనేత అఖిలేశ్ యాదవ్ సమాజ్ వాదిపార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ప్రభుత్వాన్ని పూర్తికాలాన్ని నడపగలిగారు. పాలనా వైఫల్యాలు, గూండాయిజం, భూ కబ్జా మాఫియా విలవిలలాడిన ఉత్తర్ ప్రదేశ్ సమర్థ పాలకుడిని కోరుకుంటోందని బీజేపీ పసిగట్టింది. లోక్ సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న యోగి ఆదిత్యనాథ్ ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించింది. ఎన్నికల ప్రచారం ఆ దిశగానే సాగింది. బీజేపీని ప్రజలు ఆదరించడంతో యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలో ఉత్తర్ ప్రదేశ్ లో కాషాయ జెండా రెపరెపలాడింది.

యూపీ రాజకీయ ముఖచిత్రంలో యోగి విప్లవాత్మక మార్పులు..

ఉత్తరప్రదేశ్ రాజకీయ ముఖచిత్రంలో విప్లవాత్మక మార్పులు చోటుచేసుకున్నాయి. సర్వసంఘ పరిత్యాగిగా యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠం చేజిక్కించుకున్న తర్వాత ఉత్తర్ ప్రదేశ్ స్వరూపమే మారిపోయింది. ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల పనితీరులో మార్పు తీసుకొచ్చారు. అధికారులను చురుగ్గా పనిచేయించే విధంగా చర్యలు చేపట్టారు. ప్రజాపనుల్లో జవాబుదారితనం పెంపొందించి పాలనపై పట్టుసాధించారు. బుల్డోజర్ విధానంతో రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని, భూ మాఫియాను వణికించారు. ముఖ్యమంత్రి నివాసం ఆవరణలోనే ప్రజాదర్భార్ తో  మమేకంకావడంతో ప్రజల్లో విశ్వాసం పెంపొందించుకున్నారు. కేంద్ర ప్రభుత్వ సహాయసహకారాలు తోడుకావడంతో ఉత్తర్ ప్రదేశ్ లో పారిశ్రామిక ఉత్పత్తులు, వ్యవసాయం, రైతు ప్రయోజనాలకు పెద్దపీట వేసి ఆర్థిక వృద్ధిలో మెరుగుదల సాధించారు.

వరుసగా రెండోసారి యూపీ సీఎంగా యోగి రికార్డు.. 
యోగి ఆదిత్యనాథ్ పాలన ఉత్తర్ ప్రదేశ్ కు స్వర్ణయుగంగా మారిపోయింది. దీంతో తర్వాత జరిగిన 2022 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ మరోసారి తిరుగులేని శక్తిగా ఎదిగింది. రెండో సారి యోగి ఆదిత్యనాథ్ సీఎం పీఠాన్ని కైవసం చేసుకుని చారిత్రక రికార్డు సొంతం చేసుకున్నారు. 2027లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లోనూ ప్రజావిశ్వాసంతో మెజారిటీ సీట్లను కైవసం చేసుకుని విపక్షాలకు దిమ్మతిరిగే సమాధానం ఇవ్వాలని యోగి  ఆదిత్యనాథ్ చూస్తున్నారు.


కుల సమీకరణాలు.. 
ఉత్తరప్రదేశ్‌లో 2027 అసెంబ్లీ ఎన్నికలకు రాజకీయ పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలకు పదును పెడుతున్నాయి. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులతో పాటు ఇప్పుడు జెన్-జీ ఓటర్లపై ప్రధాన పార్టీల దృష్టి పడింది. సోషల్ మీడియా, విద్య, ఉద్యోగ అవకాశాల వంటి అంశాలతో యువ ఓటర్లను ఆకట్టుకునేందుకు బీజేపీ, ఎస్పీ, కాంగ్రెస్, బీఎస్పీలు డిజిటల్ వ్యూహాలను అమలు చేస్తున్నాయి. రాష్ట్రంలోని యువ ఓటర్ల మద్దతు వచ్చే ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేసే అవకాశం ఉండటంతో, వారిని ప్రసన్నం చేసుకోవడం పార్టీలకు కీలకంగా మారింది.

ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో 2027 అసెంబ్లీ ఎన్నికల వేడి ఇప్పుడే మొదలైంది. కుల సమీకరణాలు, సంప్రదాయ ఓటు బ్యాంకులు దాటి, ఇప్పుడు అన్ని పార్టీల దృష్టి ఆ ఓటర్లపై పడింది. వారే జెన్-జీ ఓటర్లు. సోషల్ మీడియా, ఉద్యోగ అవకాశాలు, విద్య.. ఇలా యువతను ఆకర్షించేందుకు ప్రధాన పార్టీలు సరికొత్త వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. ఉత్తరప్రదేశ్ రాజకీయాల్లో సుమారు 20 శాతం వాటా ఉన్న యువ ఓటర్లే తదుపరి ప్రభుత్వాన్ని నిర్ణయించబోతున్నారు. 2027 ఎన్నికల్లో ఏ పార్టీ గెలుస్తుందనేది ఈ  జెన్-జీ ఓటర్ల మద్దతుపైనే ఆధారపడి ఉంటుంది. దీంతో అధికార బీజేపీతో పాటు ప్రతిపక్ష సమాజ్‌వాదీ పార్టీ , కాంగ్రెస్, బహుజన్ సమాజ్ పార్టీ  వంటి పార్టీలు తమ పాత పద్ధతులకు స్వస్తి పలికి డిజిటల్ బాట పడుతున్నాయి. జెన్ జీ ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా తమ వ్యూహాలకు మరింత పదునుపెడుతున్నారు.

వ్యూహం మార్చిన ఎస్పీ, కాంగ్రెస్..

యూపీ అసెంబ్లీకి ఎన్నికలు సమీపిస్తున్న వేళ అఖిలేష్ యాదవ్ నేతృత్వంలో ఎస్పీ తన వ్యూహాన్ని పూర్తిగా మార్చింది. కేవలం ర్యాలీలపైనే ఆధారపడకుండా, 200 మందికి పైగా డిజిటల్ కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లతో నేరుగా సమావేశమవుతున్నారు. నిరుద్యోగం, పేపర్ లీక్ వంటి అంశాలను యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పల్లెటూరి యువతకు చేరువ చేసే పనిలో పడ్డారు. యువ ఎంపీలను ముందుంచి డిజిటల్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు.

కాంగ్రెస్ అధినేత  రాహుల్ గాంధీ గూంజ్   కార్యక్రమం ద్వారా నేరుగా విద్యార్థులతో మమేకమయ్యారు. NSUI ద్వారా యూనివర్సిటీలు, కాలేజీ క్యాంపస్‌లలో సభ్యత్వ నమోదును పెంచడంపై దృష్టి సారించారు.

బహుజన్ సమాజ్ పార్టీ  ఆకాష్ ఆనంద్‌ను యువ సారథిగా ప్రొజెక్ట్ చేస్తోంది. అఖిలేష్, రాహుల్‌లను అంకుల్స్ గా సంబోధిస్తూ, యువత సమస్యలను తాము మాత్రమే అర్థం చేసుకోగలమని ఆకాష్ ఆనంద్ బలంగా ప్రచారం చేస్తున్నారు.

ఉత్తర్ ప్రదేశ్ రాజకీయ పార్టీలను శాసించనున్న యువ ఓటర్లు..

బీజేపీ  యోగి సర్కార్  యువ చక్రవ్యూహం సిద్ధం చేసింది. యువ నీతి , యువ ఆయోగ్ ల ద్వారా సమస్యలను పరిష్కరించాలని చూస్తోంది. ముఖ్యమంత్రి స్వయంగా వర్సిటీలకు వెళ్లి విద్యార్థుల ప్రశ్నలకు సమాధానాలిచ్చేలా  టూ-వే కమ్యూనికేషన్  ప్లాన్ చేస్తోంది. అంతే కాకుండా, జిల్లా స్థాయిల్లో  యువ సలహా కమిటీలను ఏర్పాటు చేసి క్షేత్రస్థాయిలో యువతతో టచ్‌లో ఉండాలని నిర్ణయించింది. ఆరెస్సెస్ కూడా క్యాంపస్‌ల వారీగా రిపోర్టింగ్ చేసేందుకు రంగంలోకి దిగింది.

యూపీలో చాలా నియోజకవర్గాల్లో విజయావకాశాలు కొన్ని వేల ఓట్ల తేడాతోనే మారుతుంటాయి. యువతలో ఉన్న ఉద్యోగ భద్రత, పేపర్ లీక్ ఆందోళనలు, స్టార్టప్ అవకాశాలు, సామాజిక ప్రాతినిధ్యం వంటి అంశాలపై ఏ పార్టీ ఆకర్షణీయమైన హామీలు ఇస్తే వారే విజేతలుగా నిలుస్తారు.

జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు కేవలం కులాల పోరును తలపిస్తున్నాయి.. మొబైల్ స్క్రీన్ల నుంచి యూనివర్సిటీ క్యాంపస్‌ల వరకు సాగే హై-వోల్టేజ్  డిజిటల్ వార్ గా మారబోతున్నాయి. మరి ఈ యువ ఓటర్ల మద్దతు ఎవరికి దక్కుతుందో వేచి చూడాలి.
 

Add Zee News as a Preferred Source
TAGS:
BJP
Congress
Rahul Gandhi
PM Modi