నిద్రపోతున్న పెంపుడు కుక్కపై నాగుపాము మెరుపు దాడి.. షాకింగ్ దృశ్యాలు!
Cobra Attacks Video: తాజాగా సోషల్ మీడియాలో ఓ పెంపుడు కుక్కపై పాము కాటేసిన దృశ్యాలు అందర్నీ ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి. ఎక్కడి నుంచో వచ్చింది కానీ ఆ నాగుపాము కుక్కపై ఊహించని రీతిలో దాడి చేసింది. ఈ ఘటన సీసీ కెమెరాలు రికార్డు అయింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
Cobra Attacks Video: సోషల్ మీడియాలో నిత్యం ఎన్నో రకాల వింతలతో పాటు విశేషాలకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. అయితే తాజాగా సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్న ఒక సీసీటీవీ దృశ్యం సోషల్ మీడియా వినియోగదారులను భయాందోళనకు గురిచేస్తుంది. అర్ధరాత్రి వేళ ప్రశాంతంగా నిద్రపోతున్న ఒక పెంపుడు కుక్కపై అత్యంత ప్రమాదకరమైన విష సర్పం మెరుపు దాడి చేసి ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీ ఈ అంశంగా మారింది. అసలు ఆ పాము ఎలా వచ్చింది? ఆ కుక్కపై మాత్రమే దాడి చేయడానికి గల కారణాలేంటి? దీనికి సంబంధించిన అన్ని వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.
వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. ఒక ఇంటి ముందు ఏర్పాటుచేసిన ఇనుప గ్రిల్ జాలి వద్ద ఓ కుక్క పడుకొని నిద్రపోతూ ఉంది. చుట్టూ చిమ్మ చీకటి తో పాటు నిశ్శబ్ద వాతావరణం నెలకొన్న సమయంలో ఎవరు ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. బయట నుంచి నెమ్మదిగా పాకుతూ వచ్చిన ఒక పొడవైన విషయనాగు.. ఆ గ్రిల్ జాలి నుంచి తొంగి నెమ్మదిగా తలను ఇవతల వైపుకు పెట్టడం మీరు గమనించవచ్చు..
సమీపంలోనే పడుకొని ఉన్న ఓ కుక్కను లక్ష్యంగా చేసుకున్న ఆ పాము.. క్షణాల వ్యవధిలోనే మెరుపు వేగంతో దానిపైకి అక్కడే ఉండి కాటు వేయడం మీరు చూడొచ్చు. అకస్మాత్తుగా జరిగిన దాడితో ఉలిక్కిపడ్డ ఆ కుక్క తీవ్ర నొప్పితో.. మొరగడం మీరు గమనించవచ్చు. అక్కడి నుంచి వెనకకు వెళ్ళిపోయి ఆ కుక్క మొరుగుతూనే ఉంది.. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు ఆ ఇంటి ముందు ఉంచిన సీసీ కెమెరాలు రికార్డు అయ్యాయి..
ఈ షాకింగ్ ఘటన ఇంస్టాగ్రామ్‌తో పాటు ఎక్స్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో స్వల్ప వ్యవధిలోనే లక్షలాదిమంది వీక్షించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోను చూసిన చాలా మంది విపరీతంగా కామెంట్లు కూడా పెడుతున్నారు. నిద్రలో ఉన్న మూగజీవులపై పాములు దాడి చేసిన తీరు చూసి పలువురు సోషల్ మీడియా వినియోగదారులు ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆ కుక్క బతికిందా లేదా అన్నదానిపై ఆందోళన చెందుతూ కామెంట్లు కూడా పెడుతూ వస్తున్నారు..
ఈ ఘటన చూశాక వన్యప్రాణి సంరక్షకులకు తో పాటు పెంపుడు జంతువు ప్రేమికులు పలు కీలకమైన సూచనలు కూడా చేస్తూ వస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంతో పాటు చలికాలం లేదా అడవి ప్రాంతాల్లో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని రాత్రి సమయాల్లో పెంపుడు జంతువులను ఆరు బయట వదిలేయకుండా సురక్షితమైన ప్రదేశాల్లో ఉంచాలని సూచిస్తున్నారు. ఇంటి చుట్టూ పిచ్చి మొక్కలతో పాటు చెత్తాచెదారం లేకుండా అత్యంత శుభ్రంగా ఉంచుకోవాలని చెబుతూ వస్తున్నారు..