SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Haryana Monkey Attack: కోతిపై రూ. 51 వేల రికార్డు.. హర్యానా ఘటనపై జంతు ప్రేమికుల ఆగ్రహం.. వీడియో..

Reward on money in haryana Video: వానరంను ఒక వ్యక్తి భుజం మీద ఎక్కించుకుని వీధుల్లో నుంచి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో కొంత మంది కొడుతూ దాని పట్ల అమానవీయంగా ప్రవర్తించారు.ఈ వీడియో వైరల్గా మారింది.

Written By Inamdar Paresh
Published: Oct 23, 2026, 11:08 AM IST | Updated: Oct 23, 2026, 11:20 AM IST
Image Credit: Haryana monkey row
Join

Villages attack on monkey for 51 thousand reward in Haryana: సాధారణంగా కోతులు ఎక్కువగా గ్రామాల్లో  ఉంటాయి. మూకుమ్మడిగా తిరుగుతూ ఇళ్లపైకి వచ్చి దాడులు చేస్తున్నాయి. ఏ మాత్రం అజాగ్రత్తగా ఉన్న కూడా కోతులు ఇంట్లోకి ప్రవేశించి అందిన వాటిని తీసుకెళ్లి పోతున్నాయి.ఈ  క్రమంలో   కొన్ని చోట్ల వానరాలు మనుషులపైన దాడులు చేస్తున్నాయి. మనుషులు కూడా తీవ్రంగా గాయపడుతున్నారు. 

 

 

 

పంట పొలాల్ని కూడా ధ్వంసం చేస్తున్నాయి. ఈ క్రమంలో గ్రామస్తులు అంత కలిసి డబ్బులు వేసుకుని మరీ కోతుల్ని పట్టించి అడవుల్లో వదిలేలా చేస్తున్నారు. ఇలాంటి క్రమంలో ఇటీవల హర్యానాలోని ఫరీదాబాద్ లో జరిగిన ఘటన వార్తలలో నిలిచింది.


హర్యానాలోని ఫరీదాబాద్ లో ఇటీవల ఒక వానరం బీభత్సం చేసింది.  పల్వాన్ లోని హాతిన్ ప్రాంతంలో ఒక గండు కోతి సుమారు పది రోజులుగా గ్రామంలో హల్ చల్ చేస్తుంది. స్థానికులు, చిన్న పిల్లలపై, వృద్ధులపై దాడి చేస్తూ 30 మందికి పైగా గాయపరిచింది. దీంతో స్థానిక మున్సిపల్ అధికారులు కోతిని బంధించిన వారికి రూ. 51 వేల రివార్డు ప్రకటించారు. దీంతో ఒక యువకుడు వలపన్ని కోతిని బంధించాడు. ఆ తర్వాత దాన్ని కాళ్లు చేతులు కట్టేసి వీపుపై పెట్టుకుని గ్రామంలో తీసుకెళ్లాడు.   వానరంను కొంత మంది కొడుతూ దానిపై తమ పైశాచీకం చూపించారు. 

చెంపదెబ్బలు కొడుతూ,  కర్రలతో కొడుతూ దారుణంగా ప్రవర్తించారు. ఈ ఘటనను వీడియో తీసి తమ పైశాచీకత్వంను చూపించారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారడంతో దీనిపై జంతు ప్రేమికులు మండిపడుతున్నారు. కోతిని పట్టుకుని అడవిలో వదిలేస్తే సరిపోతుందని.. ఇలా మూగజీవిపై కొట్టి దాడి చేయడం ఏంటని మండిపడుతున్నారు. ఆలోచించే తెలివి, విఘ్నత కల్గి ఉండి ఈ పైశాచీకత్వం ఏంటని ఫైర్ అవుతున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES