SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

10,000mAh బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే.. వివో Y600 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది!

Vivo Y600 Launched: వివో Y600 స్మార్ట్‌ఫోన్‌ ఎట్టకేలకు చైనా మార్కెట్‌లోకి విడుదలైంది. దీనిని కంపెనీ మోస్ట్ పవర్‌ఫుల్ ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. అయితే, ఇది మూడు కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ అయ్యింది. దీనికి సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 01:35 PM IST | Updated: Oct 26, 2026, 01:36 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Vivo Y600 Launched: వివో కంపెనీ విడుదల చేసే స్మార్ట్‌ఫోన్స్‌కి అద్భుతమైన డిమాండ్‌ ఉంది. ప్రీమియం ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యేవి ఎక్కువగా కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే, మీరు కూడా త్వరలోనే మంచి స్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేయాలనుకుంటే వివో Y600 స్మార్ట్‌ఫోన్‌ బెస్ట్ ఆప్షన్‌గా భావించవచ్చు. వివో కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం చైనాలో విడుదల చేసింది. ఇది ఎన్నో రకాల అద్భుతమైన ఫీచర్స్‌తో లాంచ్‌ అయ్యింది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

వివో Y600 స్మార్ట్‌ఫోన్‌ను సోమవారం చైనాలో విడుదల చేసింది. ఇందులో కంపెనీ 44W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే భారీ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది మీడియాటెక్ డైమెన్సిటీ 7000 సిరీస్ చిప్‌సెట్‌ ప్రాసెసర్‌పై పని చేస్తుంది. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా లభిస్తున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన సేల్స్‌ ఈ వారం ప్రారంభమవుతాయి.

ఈ వివో Y600 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. అయితే, దీని మొదటి వేరియంట్‌ 6GB+128GB స్టోరేజ్‌తో రూ.29,000తో అందుబాటులో ఉంది. అంతేకాకుండా రెండవది 8GB+128GB స్టోరేజ్ వేరియంట్‌ రూ.30,000తో లభిస్తోంది. ఇక మూడవది 6GB+256GB స్టోరేజ్ రూ.31,000తో, చివరిది 8GB+256GB స్టోరేజ్‌తో రూ.36,000 లభించడం విశేషం.. ఈ ఫోన్ ప్రీ-ఆర్డర్స్‌ చైనాలో ప్రారంభమయ్యాయి.. అక్టోబర్ 30న సేల్స్‌ కూడా అందుబాటులోకి రాబోతోంది.. ఈ స్మార్ట్‌ఫోన్‌ డైమండ్ గోల్డ్, అబ్సిడియన్ బ్లాక్‌తో పాటు సఫైర్ బ్లూ కలర్‌ ఆప్షన్స్‌లో లాంచ్‌ అయ్యింది.

వివో Y600 ఫీచర్లు..
వివో Y600 స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ వివరాల్లోకి వెళితే... ఇది 1260x2800 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.83-అంగుళాల 1.5K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది.     అంతేకాకుండా ఈ డిస్‌ప్లే 1.07 బిలియన్ కలర్స్‌తో లాంచ్‌ అయ్యింది. ఇది HDR సపోర్ట్, DCI-P3 వైడ్ కలర్ గామట్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇక Y600 ఆండ్రాయిడ్ 16 ఆధారిత ఒరిజిన్OS 6 ఆపరేటింగ్‌ సిస్టమ్‌పై రన్‌ అవుతుంది.. Y600 వెనుక భాగంలో 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా కూడా లభిస్తోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 2x డిజిటల్ జూమ్‌తో కూడిన 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కూడా అందుబాటులో ఉంది.. ఇది మోస్ట్ పవర్‌ఫుల్ 10,000mAh బ్యాటరీని కూడా కలిగి ఉంటుంది. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే భారత మార్కెట్‌లోకి కూడా అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES