• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /ఎల్నినో ఎఫెక్ట్‌.. దేశంలో ఎరువుల అమ్మకాలు భారీగా పతనం!

ఎల్నినో ఎఫెక్ట్‌.. దేశంలో ఎరువుల అమ్మకాలు భారీగా పతనం!

El Nino Effect: ఎల్నినో కారణంగా ఎరువుల వినియోగం పూర్తిగా తగ్గిపోయిన్నట్లు మార్కెట్‌ నిపుణులు తెలుపుతున్నారు. ముఖ్యంగా వచ్చే సీజన్‌లో వీటి వినియోగం భారీ తగ్గే ఛాన్స్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, ఎందుకు ఇలా తగ్గుతున్నాయో? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written ByDharmaraju Dhurishetty
Published: Oct 26, 2026, 03:09 PM IST|Updated: Oct 26, 2026, 03:11 PM IST
joinshare
ఎల్నినో ఎఫెక్ట్‌.. దేశంలో ఎరువుల అమ్మకాలు భారీగా పతనం!
Image Credit: ZEE TELUGU NEWS

About the Author

Dharmaraju Dhurishetty

Dharmaraju Dhurishetty

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..

తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..

2

తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

3

Tamil nadu: తమిళనాడును వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ.!.

4

Dhanush Meet 3000 Women: బీజేపీలో చేరనున్న హీరో ధనుష్?! గిఫ్ట్‌గా ఇచ్చిన వెండి దీపాలపై కమలం గుర్తు..ఏం జరుగుతోంది?

5

Komal Nahta: సినీ విభాగంలో ZEEL భారీ మార్పులు.. జీ మూవీస్ క్రియేటివ్ డైరెక్టర్‌గా కోమల్ నహతా..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

El Nino Effect Telugu: దేశవ్యాప్తంగా ఉన్న వర్షాభావ పరిస్థితులతో పాటు ఎల్నినో తీవ్ర ప్రభావం వ్యవసాయయ రంగాన్ని ముప్పు తిప్పలు పెట్టిస్తోంది. వర్షాలు ఆశించిన స్థాయిలో రాకపోవడంతో సాగు విస్తీర్ణం తగ్గడమే కాకుండా.. పంటలకు అవసరమైన వ్యవసాయ ఉత్పాదకాల వాడకం కూడా భారీగా తగ్గుతూ వస్తోంది. ఫలితంగా దేశంలోని రసాయన ఎరువుల అమ్మకాలు గత ఏడాదితో పోలిస్తే.. గణనీయంగా పడిపోయినట్లు తాజా గణాంకాలు స్పష్టం చేస్తూ వస్తున్నాయి.

అయితే, 2026 సంబంధించిన ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు నమోదైన ఎరువుల అమ్మకాలను క్లియర్‌గా గమనిస్తే.. పరిస్థితి తీవ్రత స్పష్టమవుతూ వస్తున్నాయి. గత ఏడాది ఇదే సమయం పోలిస్తే.. ప్రధాన ఎరువుల విక్రయాలు రికార్డు స్థాయిలో తగ్గుముఖం పడుతూ వచ్చాయి. ముఖ్యంగా నత్రజనితో పాటు.. భాస్వరం, పొటాషియం, సల్ఫర్  వంటి కీలక పోషకాలు కలిగిన కాంప్లెక్స్ ఎరువుల డిమాండ్ ఏకంగా 22.2 శాతం తగ్గిపోతూ వచ్చింది.. అయితే, ఖరీఫ్ సీజన్‌లో పంట ఎదుగుదలకు కాంప్లెక్స్ ఎరువులను రైతులు ఎక్కువగా వినియోగిస్తూ ఉండడం సహజం. అయితే, వర్షాలు అనుకూలించకపోవడంతో.. సాగు పనులు ఆలస్యం కావడం.. భూముల్లో తేమ లేకపోవడంతో రైతులు ఎరువుల వినియోగాన్ని భారీగా తగ్గించిన్నట్లు స్పష్టమవుతుంది..

రైతులు అత్యంత ఎక్కువగా వినియోగించే.. పొటాష్‌కి సంబంధించిన అమ్మకాలు 11.7 శాతం వరకు తగ్గుతూ వచ్చిన్నట్లు స్పష్టమవుతున్నాయి. పంటపోలాలకు అత్యంత కీలకమైన యూరియా అమ్మకాలు సైతం గత ఏడాదితో పోలిస్తే.. 4.1 శాతం పడిపోయాయిన్నట్లు తెలుస్తోంది.. సకాలంలో రుతుపవనాలు విస్తరించకపోవడంతో పాటు పలు రాష్ట్రాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో పంటల సాగు పూర్తిగా మందగించిన్నట్లు తెలస్తోంది.. దీంతో ఎరువుల రిటైల్ దుకాణాలతో పాటు డీలర్ల వద్ద నిల్వలు పేరుకుపోయాయి క్రయవిక్రయాలు జరగలేనట్లు తెలుస్తోంది.

ఇక ఖరీఫ్‌లో ఎదురైన ఈ ప్రతికూల వాతావరణ పరిస్థితులు.. త్వరలో ప్రారంభం కానున్న రబీ సీజన్‌పైనా ఎఫెక్ట్‌ పడే ఛాన్స్‌లు ఉన్నట్లు వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు. భూగర్భ జలాలు తగ్గడంతో పాటు ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రాబోయే శీతాకాల పంటల విస్తీర్ణం కూడా తగ్గిపోయే అవకాశాలు కూడా మెండుగా ఉన్నట్లు తెలుస్తోంది.. దీంతో రబీ కాలంలోనూ ఎరువుల అమ్మకాలు ఇదే తీరుగా తగ్గుముఖం పట్టే అవకాశముందని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
National News