• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /అంతర్జాతీయం
  • /దుబాయ్‌లో ఏకంగా 16 కిలోల బంగారు జుమ్కాలు.. రెండు గిన్నిస్ రికార్డులు..!!

దుబాయ్‌లో ఏకంగా 16 కిలోల బంగారు జుమ్కాలు.. రెండు గిన్నిస్ రికార్డులు..!!

World Largest Earrings: దుబాయ్ నగరం స్వర్ణాభరణాల తయారీలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది. ఆభరణాల తయారీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జాయ్ఆలుక్కాస్ ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఒక జత భారీ బంగారు జుమ్కాలు ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తమ సొంతం చేసుకున్నాయి.

Written ByBhoomi
Published: Oct 26, 2026, 03:02 PM IST|Updated: Oct 26, 2026, 03:05 PM IST
joinshare
దుబాయ్‌లో ఏకంగా 16 కిలోల బంగారు జుమ్కాలు.. రెండు గిన్నిస్ రికార్డులు..!!
Image Credit: World Largest Earrings

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..

తుమ్మడిహట్టి పై సీఎం రేవంత్ మహా సక్సెస్.. మహారాష్ట్ర సీఎం ఫడ్నవిస్‌తో చర్చలు సఫలం..

2

తేలుపై పాము దాడి.. చివరికి ఏం జరిగిందో ఈ వీడియోలో చూడండి!

3

Tamil nadu: తమిళనాడును వణికిస్తున్న అర్నాబ్ తుపాను.. పలు ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ.!.

4

Dhanush Meet 3000 Women: బీజేపీలో చేరనున్న హీరో ధనుష్?! గిఫ్ట్‌గా ఇచ్చిన వెండి దీపాలపై కమలం గుర్తు..ఏం జరుగుతోంది?

5

Komal Nahta: సినీ విభాగంలో ZEEL భారీ మార్పులు.. జీ మూవీస్ క్రియేటివ్ డైరెక్టర్‌గా కోమల్ నహతా..!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

World Largest Earrings: దుబాయ్ నగరం స్వర్ణాభరణాల తయారీలో తన ప్రత్యేకతను మరోసారి చాటుకుంది.  ఆభరణాల తయారీలో ఒక అద్భుతమైన మైలురాయిని చేరుకుంది. ప్రముఖ జ్యువెలరీ బ్రాండ్ జాయ్ఆలుక్కాస్ ఎంతో నైపుణ్యంతో తయారు చేసిన ఒక జత భారీ బంగారు జుమ్కాలు ఏకంగా రెండు గిన్నిస్ వరల్డ్ రికార్డులను తమ సొంతం చేసుకున్నాయి. ప్రపంచంలోనే అత్యంత భారీ బరువు కలిగినవిగా.. అలాగే అత్యంత భారీ పరిమాణంలో ఉన్న బంగారు చెవిపోగులుగా ఇవి సరికొత్త చరిత్రను లిఖించాయి. ఈ మైమరిపించే అరుదైన స్వర్ణాభరణాల ఆవిష్కరణ... ప్రదర్శన దుబాయ్ నగరంలో ఎంతో వేడుకగా.. కన్నులపండువగా నిర్వహించారు.

ఈ అద్భుత జుమ్కాలకు మయూర సహస్ర అని పేరు పెట్టారు. సంస్క్రుతంలో ఈ పదానికి వెయ్యి నెమళ్లు అని అర్థం వస్తుంది. పేరుకు తగ్గట్లుగానే నెమలి అందాలను స్పూర్తిగా తీసుకుని.. సంప్రదాయ దక్షిణాసియా జుమ్కా డిజైన్ లో వీటిని తీర్చిదిద్దారు. 22 క్యారెట్ల స్వచ్చమైన బంగారంతో తయారు చేసిన ఈ జుమ్కాల జత బరువు 16.514 కిలోలు ఉన్నాయి. వీటి పొడవు 1.215 మీటర్లు ఉండగా.. వ్యాసం 0.682 మీటర్లు ఉంది. ఈ కొలతలు చూస్తేనే వీటి భారీతనం.. డిజైన్ లోని గొప్పతనం అర్థం చేసుకోవచ్చు.

మయూర సహస్ర డిజైన్ అత్యద్భుతమైన హస్తకళా నైపుణ్యానికి ఒక అద్భుతం. దీనిని రూపొందించడానికి 55 మంది నైపుణ్యం గల కళాకారులు నెలల తరబడి పగలు, రాత్రి శ్రమించారు. ఈ కళాఖండాన్ని పూర్తి చేయడానికి మొత్తం 5,840 గంటల సమయం పట్టింది. భారతీయ ఆభరణాల తయారీ సంప్రదాయంలో ఆధునిక హస్తకళా నైపుణ్యం మేళవించేలా ప్రతి వివరమూ జాగ్రత్తగా రూపొందించింది.

ఈ పెద్ద చెవిపోగులను అక్టోబర్ 24న దుబాయ్‌లోని గోల్డ్ డిస్ట్రిక్ట్‌లో ఉన్న 'జ్యూయల్ ఆఫ్ జాయ్' షోరూమ్‌లో ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి యూఏఈ ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌహిద్ అల్ మర్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వీటిని ప్రజలకు ఆవిష్కరించడానికి ముందు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ వారు ఈ చెవిపోగులను తనిఖీ చేసి, రెండు టైటిళ్లను అధికారికంగా ధృవీకరించారు. ఈ ఘనత, బంగారం వ్యాపారం మరియు ఆవిష్కరణలకు కేంద్రంగా దుబాయ్‌కి ఉన్న హోదాకు నిదర్శనంగా నిలిచిందని చెప్పాలి. 

 

 

 

 

 

View this post on Instagram

 

 

 

 

 

 

 

 

 

 

 

A post shared by Joyalukkas Middle East (@joyalukkas_me)

 

Also Read: 

డీఎస్సీ షార్ట్ నోటిఫికేషన్ పై నిరుద్యోగుల అసంతృప్తి...పోస్టులు పెంచాలని డిమాండ్..!!

Add Zee News as a Preferred Source
TAGS:
World News
Gold Rate
Telugu News