Volkswagen టిగువాన్ EV కారు వచ్చేస్తోంది.. ఒక్క ఛార్జ్‌తో 600 కిలోమీటర్ల మైలేజీ..
Volkswagen Tiguan Ev 2026: ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్ EV వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. దీనిని కంపెనీ అద్భుతమైన మైలేజీతో విడుదల కాబోతోంది. అయితే, దీనికి సంబంధించిన ఫీచర్స్‌తో పాటు స్పెషిఫికేషన్ వివరాలు ఇప్పుడు మనం తెసుకుందాం.
Volkswagen Tiguan Ev: ప్రముఖ గ్లోబల్ ఆటోమొబైల్ దిగ్గజం ఫోక్స్‌వ్యాగన్ (Volkswagen) తన EV కార్ల పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు అద్భుతమైన ముందడుగు వేసేందుకు సిద్ధమేంది.. మార్కెట్‌లో మంచి డిమాండ్ కలిగిన టిగువాన్ మోడల్‌ను ఎలక్ట్రిక్ వేరియంట్‌లో అందుబాటులోకి తీసుకు వచ్చేందుకు సిద్ధమైన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని కంపెనీ Tiguan EV పేరుతో విడుదల చేసేందుకు సిద్దమైంది. అలాగే ఇది హై-ఎండ్ భద్రతా ప్రమాణాలతో విడుదల కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఫ్యూచరిస్టిక్ డిజైన్..
టిగువాన్ ఈవీ గతంలో విడుదల చేసిన కార్ల డిజైన్ కంటే చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది చాలా ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌తో లాంచ్ అయ్యేందుకు సిద్ధమైంది. ఇది చాలా అద్భుతమైన క్లోజ్డ్-ఆఫ్ ఫ్రంట్ గ్రిల్‌తో పాటు సిగ్నేచర్ LED లైట్ బార్లతో ఫ్రంట్ లుక్ చాలా అద్భుతంగా ఉంటుంది.. మైలేజ్ రేంజ్‌ను పెంచేందుకు ప్రత్యేకంగా రూపొందించిన ఏరోడైనమిక్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో అందుబాటులో ఉన్నాయి. వెనుక భాగంలో స్పోర్టీ స్పాయిలర్‌తో పాటు అత్యాధునిక కనెక్టెడ్ LED టెయిల్‌ల్యాంప్స్‌ను కూడా అందిస్తోంది.
పవర్‌ఫుల్ బ్యాటరీ..
ఫోక్స్‌వ్యాగన్ ఈవీ కారును అత్యాధునిక MEB+ ఈవీ ప్లాట్‌ఫామ్‌పై రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ఎక్కువ సామర్థ్యం కలిగిన అధునాతన లిథియం-అయాన్ బ్యాటరీ ప్యాక్‌ను కూడా అందుబాటులోకి తీసుకు వచ్చారు. సింగిల్ ఫుల్ ఛార్జ్‌తో సుమారు 500 నుంచి 600 కిలోమీటర్లకు పైగా డ్రైవింగ్ రేంజ్ ఉండబోతున్నట్లు లీక్ అయిన వివరాలు చెబుతున్నాయి..
అవంతేకాకుండా ఇందులో అల్ట్రా-ఫాస్ట్ DC ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వస్తోంది. దీని వల్ల కేవలం 25 నుంచి 30 నిమిషాల వ్యవధిలోనే 10 శాతం నుంచి 80 శాతం వరకు స్పీడ్‌గా బ్యాటరీని ఛార్జ్ చేస్తుంది.. లగ్జరీ ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు ఇంటీరియర్‌లో అత్యాధునిక సాంకేతికతో కూడిన ఫీచర్స్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది.. ఇందులో లేన్ కీప్ అసిస్ట్, అడాప్టివ్ క్రూయిజ్ కంట్రోల్‌తో పాటు అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్‌తో కూడిన లెవల్-2 ADAS సేఫ్టీ సూట్ వంటి ఫీచర్స్‌ను కూడా అందిస్తోంది.