వామ్మె, పాడైన దొండకాయలకు ఆకుపచ్చ రంగు.. వీడియో!
Viral Video: ఓ మార్కెట్లో మహిళ రంగు పూసిన దొండకాయలను విక్రయిస్తున్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అయితే, అందరూ చూస్తుండగానే ఆ మహిళ బకెట్లో రంగు కలిపి దొండకాయలను అందులో వేసి.. ఒకచోట పోస్తుండడం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్గా మారింది.
Viral Video: నిత్యం మనం మార్కెట్లో కొనుగోలు చేసే పచ్చని కూరగాయలు నిజంగా తాజావేనా? లేక ప్రమాదకరమైన రసాయనాల పూతలా? అని అనుమానాలకు బలం పెంచే ఒక భయానక ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది. పాడైపోయిన దొండకాయలను ఆకుపచ్చని రంగులో ముంచి.. సరికొత్తవిగా కనిపించేలా చేస్తూ విక్రయిస్తున్న ఓ కూరగాయల వ్యాపారి వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ వస్తోంది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న వ్యవహారంపై అందరూ ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన అన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళ్తే.. రద్దీగా ఉండే ఒక కూరగాయల మార్కెట్లో కూరగాయలు విక్రయించే మహిళ ఓ బకెట్లో ఆకుపచ్చని రంగు కలుపుకొని దాని ముందే కూర్చుని ఉండడం మీరు గమనించవచ్చు. రంగు వెలసిపోయిన.. పూర్తిగా పాడైపోయిన దొండకాయలను ఆమె ఆ రంగు నీటిలో ఉంచడం కూడా మీరు గమనించవచ్చు. క్షణాల వ్యవధిలోనే ఆ కాయలు ఎంతో పచ్చగా.. తాజాగా మారిపోవడం మీరు గమనించవచ్చు. వాటిని తీసి దుకాణంలో కస్టమర్లకు ఆకర్షణీయంగా కనిపించేలా కుప్పగా పోయడం మీరు చూడొచ్చు..
ఈ వీడియో బయటికి రావడంతో సోషల్ మీడియా వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. కొద్దిపాటి లాభాల కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఇలాంటి నకిలీ వ్యవహారాలపై కఠిన చర్యలు తీసుకోవాలని నటిజన్లో డిమాండ్ చేస్తున్నారు. ఆహార పదార్థాలపై పూసే కృత్రిమ రంగులు మానవ శరీరానికి అత్యంత ప్రమాదకరమని వైద్య నిపుణులు సైతం హెచ్చరిస్తూ వస్తున్నారు. వీటిని తరచూ తీసుకోవడం వల్ల జీర్ణ సమస్యలే కాకుండా వాంతులు, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు..
కూరగాయల మార్కెట్లలో ఇలాంటి కల్తీ కొత్త కాక పోయినప్పటికీ.. ఇంత బహిరంగంగా రంగులు అద్దుతూ విక్రయించడంతో ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా ఫుడ్ సేఫ్టీ అధికారులు తక్షణమే మార్కెట్లో ఆకస్మిక తనిఖీలు చేపట్టాలని. ఇలాంటి మోసాలకు పాల్పడే వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు. వినియోగదారులు కూడా మితిమీరిన మెరుపు, పచ్చదనంతో కనిపించే కూరగాయలను కొనుగోలు చేసేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, ఈ వీడియో ఎక్కడిది అనేది ఇంకా స్పష్టత రాలేదు. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఊహించని స్థాయిలో వైరల్ అవుతుంది.