SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Uttar Pradesh: సెల్ టవర్ ఎక్కిన యువతి.. వీడియో కాల్ లో పెళ్లి చేసిన పెద్దలు.. యూపీలో వింత ఘటన..

Woman Climbs Mobile tower in UP: తన ప్రియుడితో పెళ్లి చేయాలని బహరాయిచ్ గ్రామంకు చెందిన యువతి సెల్ టవర్ ఎక్కి రచ్చ చేసింది. ఈ క్రమంలో పోలీసులు ఇరు కుటుంబాలతో మాట్లాడి వివాదంను పరిష్కరించారు. యూపీలో జరిగిన ఈ ఘటన వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Oct 24, 2026, 11:12 AM IST | Updated: Oct 24, 2026, 11:28 AM IST
Image Credit: woman climbs cell tower in up
Join

Woman climbs mobile tower demanding marriage with lover in uttar Pradesh: ఇటీవల సమాజంలో  చాలా మంది ప్రేమ పెళ్లిళ్లకే ఎక్కువగా మోగ్గుచూపుతున్నారు. కొన్ని రోజులపాటు డేటింగ్ లో ఉంటున్నారు. ఆతర్వాత వారి అభిప్రాయాలు ఒకటైతే పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. లేకుంటే బ్రేకప్ లు చెప్పుకుంటున్నారు. ఇలాంటి ఘటనలు నిత్యం వార్తలలో ఉంటున్నాయి. కొంత మంది పెద్దలను ఎదిరించి కూడా ప్రేమ పెళ్లిళ్లు చేసుకుంటున్నారు. తమ ప్రేమ పెళ్లిళ్లకు ఆత్మహత్యలకు కూడా వెనుకాడటంలేదు.

 

 

 ఈ క్రమంలో  ఉత్తర ప్రదేశ్ లోని బహరాయిచ్ గ్రామంలో సైదా అనే యువతి, నూరుద్దీన్ లు ప్రేమించుకున్నారు. అయితే నూరుద్దీన్ పఠాన్ వర్గానికి చెందిన వాడు కావడంతో ఇంట్లో వారు పెళ్లికి అంగీకరించలేదు.  దీంతో ఇంట్లో గొడవ పడి పెళ్లిచేసుకుంటే నూరుద్దీన్ ను మాత్రమే చేసుకుంటానని చెప్పి సైదా మోతీపూర్ పీఎస్ పరిధిలో ఉన్న సెల్ టవర్ ఎక్కింది. దీంతో స్థానికులు, యువతి కుటుంబ సభ్యులు సెల్ టవర్ వద్దకు చేరుకున్నారు. 

తన ప్రియుడితో వీడియో కాల్ లో నిఖా చేస్తేనే కిందకు దిగుతానని లేకుంటే దూకేస్తానని బెదిరించింది. ఈ క్రమంలో ఇరుకుటుంబాలు మాట్లాడుకుని సైదాకు, ముంబైలో ఉన్నన నూరుద్దీన్ కు వాళ్ల మతాచారం ప్రకారం'ఖాజీ'ని పిలిపించి గ్రాండ్ గా పెళ్లి చేశారు. పెళ్లి తర్వాత యువతి సెల్ టవర్ నుంచి కూల్ గా కిందకు దిగింది. యువతి కోరిక కాదనకుండా.. ఇరు కుటుంబాలు తీసుకున్న నిర్ణయంపై పోలీసులు అభినందించారు. ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES