• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..

విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..

Stars Career Speed up After Marriage: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో పెళ్లి తర్వాత నటీనటుల కెరీర్ గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగింది. రీసెంట్‌గా విజయ్ దేవరకొండ నుంచి మొదలు పెడితే... అక్కినేని అఖిల్ అంతకు ముందు సామ్, చైతూ, కిరణ్ అబ్బవరం వరకు పెళ్లి తర్వాత బాక్సాఫీస్ దగ్గర గ్రాండ్‌గా రీ ఎంట్రీ ఇచ్చి సక్సెస్ రుచి చూసారు. దీంతో హీరోలు కానీ హీరోయిన్స్ కానీ సక్సెస్ కావాలంటే మ్యారేజ్ చేసుకోవాలనే మాట వినిపిస్తోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 02:09 PM IST|Updated: Oct 25, 2026, 02:13 PM IST
joinshare
విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..
Image Credit: Vijay Akhil Sam Chaitu (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హీరోయిన్స్ యాక్షన్ మోడ్..  హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

2

విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..

3

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 28న రాబోతుంది తుఫాను కాదు..తీవ్ర తుఫాను..ఐఎండీ హెచ్చరిక!

4

డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు తెర.. ప్రొబేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని DEOలకు ఆఫీసర్లకు విద్యాశాఖ ఆదేశం..!!

5

Censor Board Data Leak: సెన్సార్‌ బోర్డులో భారీ డేటా లీక్..ఇంటర్నెట్‌లో 500కు పైగా సినిమాల సమాచారం బహిర్గతం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vijay Devarakonda to Samantha Via Chaitu Kiran Abbavaram akhil: ప్రస్తుతం టాలీవుడ్‌లో మ్యారేజ్  తర్వాత కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ అందుకుంటున్న స్టార్స్ సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. విజయ్ దేవరకొండ హీరోగా మంచి సక్సెస్ అందుకోని చాలా యేళ్లే అవుతుంది. అపుడెపుడో ‘గీతా గోవిందం’, ‘టాక్సీవాలా’ తర్వాత ఆ రేంజ్ హిట్ పడలేదు. కానీ రష్మిక మందన్నతో మ్యారేజ్ తర్వాత తన జీవిత భాగస్వామితో కలిసి నటించిన ‘రణబాలి’ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్నే అందుకున్నాడు. విజయ దశమి కానుకగా విడుదలైన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని లాభాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మొత్తంగా విజయ్ దేవరకొండ పెళ్లి తర్వాత గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడనే చెప్పాలి.

లెనిన్‌తో అఖిల్ కెరీర్ కు కొత్త మలుపు.. 

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా  ఎంట్రీ ఇచ్చి దాదాపు 11 యేళ్లు కావొస్తోంది. ఇన్నేళ్ల కెరీర్‌లో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా మాత్రమే ఓ మోస్తరుగా నడిచింది. ఆ తర్వాత చేసిన ‘ఏజెంట్’ అఖిల్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత మూడేళ్ల లాంగ్ తర్వాత ‘లెనిన్’ చిత్రంతో పలకరించాడు. మురళీ కిషోర్ అబ్బూరి డైరెక్ట్ చేసిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్‌తో బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. మొత్తంగా జైనబ్ రవ్‌జీని పెళ్లి చేసుకున్న తర్వాతే అయ్యగారి కెరీర్ స్పీడ్ అందుకుంది.

రెండో పెళ్లి తర్వాత సామ్ కెరీర్.. 

అంతకు ముందు సమంత కూడా నాగ చైతన్యతో విడాకుల తర్వాత దర్శకుడు రాజ్‌నిడుమోరును పెళ్లి చేసుకుంది. శాదీ  తర్వాత తన భర్త అందించిన కథతో నందిని రెడ్డి డైరెక్షన్‌లో చేసిన ‘మా ఇంటి బంగారం’ సినిమాతో మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. ఈ సినిమా లేడీ ఓరియంటెడ్ చిత్రాల్లో  సరికొత్త బెంచ్ మార్క్ క్రియేట్ చేసింది. ఈ సినిమా ఏకంగా రూ. 100 కోట్ల గ్రాస్‌ క్లబ్బులో ప్రవేశించి సంచలనం రేపింది.

నాగ చైతన్య కు సెకండ్ మ్యారేజ్ తర్వాత తండేల్‌తో సక్సెస్..

నాగచైతన్య కూడా సమంతతో విడాకుల తర్వాత శోభితను రెండో  పెళ్లి చేసుకున్నాడు. శోభిత ఇంట అడుగుపెట్టిన వేళా విశేషం ఏమో కానీ..చైతూ హీరోగా నటించిన ‘తండేల్’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అంతేకాదు.. చైతూ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలోని నటనకు తెలంగాణ ప్రభుత్వం  నుంచి ఉత్తమ నటుడి అవార్డును అందుకున్నారు. డిసెంబర్ 4న  ‘వృషకర్మ’ సినిమాతో చైతూ  పలకరించబోతున్నాడు.

కిరణ్ అబ్బవరం..

ఆ నలుగురి కంటే ముందే  కిరణ్ అబ్బవరం .. రహస్య గోరఖ్‌ను వివాహాం చేసుకున్న తర్వాత ‘క’ మూవీతో పలకరించాడు. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సస్ అందుకుంది. తొలిసారి కిరణ్ అబ్బవరం ద్విపాత్రాభినయం చేసిన ఈ చిత్రం కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే గుర్తుండిపోయే చిత్రంగా నిలిచింది. ఆ తర్వాత కిరణ్ అబ్బవరం తన పేరు కలిసొచ్చేలా ‘క’  ప్రొడక్షన్ స్టార్ట్ చేసి వరుసగా చిత్రాలను నిర్మిస్తున్నాడు. ఈ రకంగా ఈ ఐదుగురి కెరీర్ పెళ్లి తర్వాత ఊపందుకోవడం విశేషమనే చెప్పాలి. 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie