• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

heroins Mass Charecters: ఇండస్ట్రీతో సంబంధం లేదు.. టాలీవుడ్ నుంచి కోలీవుడ్ వరకు స్టార్ హీరోయిన్స్ అంతా రొటీన్ గ్లామర్ పాత్రలకి గుడ్ బై బై చెప్పేస్తున్నారు. అంతేకాదు కేవలం గ్లామర్ పాత్రలే కాకుండా ఊరమాస్ ఇమేజ్ వైపు అడుగులేస్తున్నారు. ఇన్నాళ్లూ హీరోలకే పరిమితమైన రస్టిక్ క్యారెక్టర్స్‌ని హీరోయిన్స్ చేస్తూ తాములో దాగున్న యాక్షన్ యాంగిల్ బయటికి తీస్తున్నారు. వెబ్ సిరీస్ నుంచి వెండితెర వరకు ఎక్కడ చూసినా ఫుల్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు భామలు.

Written ByTA Kiran Kumar Sharma
Published: Oct 25, 2026, 02:13 PM IST|Updated: Oct 25, 2026, 02:15 PM IST
joinshare
హీరోయిన్స్ యాక్షన్ మోడ్..  హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..
Image Credit: Heroins Mass Avatar (File Pics/Source)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
హీరోయిన్స్ యాక్షన్ మోడ్..  హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

హీరోయిన్స్ యాక్షన్ మోడ్.. హీరోలకు ధీటుగా మాస్ సినిమాలతో అలరిస్తున్నకథానాయికలు..

2

విజయ్ టూ సామ్.. అఖిల్ టూ చైతూ ..పెళ్లి తెచ్చిన అదృష్టం..

3

AP Cyclone Alert: ఆంధ్రప్రదేశ్‌లో అక్టోబరు 28న రాబోతుంది తుఫాను కాదు..తీవ్ర తుఫాను..ఐఎండీ హెచ్చరిక!

4

డీఎస్సీ 2024 టీచర్ల నిరీక్షణకు తెర.. ప్రొబేషన్ ఉత్తర్వులు ఇవ్వాలని DEOలకు ఆఫీసర్లకు విద్యాశాఖ ఆదేశం..!!

5

Censor Board Data Leak: సెన్సార్‌ బోర్డులో భారీ డేటా లీక్..ఇంటర్నెట్‌లో 500కు పైగా సినిమాల సమాచారం బహిర్గతం!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Heroins Action Mode: నెట్ ఫ్లిక్స్ కోసం కీర్తి సురేష్ చేస్తున్న ‘అక్క’ వెబ్ సిరీస్ తనలోని మరో యాంగిల్‌ను బయటకు తీసింది.  ట్రైలర్‌లో తనలోని పవర్ ఫుల్ మాస్ యాంగిల్ తాజాగా విడుదలై ట్రైల్ చూస్తే తెలుస్తుంది.  గ్లామర్‌తో పాటు నెక్స్ట్ లెవెల్ యాక్షన్‌తో డిజైన్ చేసిన ఈ క్యారెక్టర్‌లో రాధికా ఆప్టేతో కీర్తి సురేష్ సీన్స్ ఓ రేంజ్‌లో ఉన్నాయి.  అంతకు ముందు ‘రివాల్వర్ రీటా’ లో కాస్త యాక్షన్ మోడ్‌లో కనిపించింది.  మరోవైపు రష్మిక సైతం ‘మైసా’ సినిమాలో చాలా రఫ్ అండ్ రస్టిక్‌గా కనిపిస్తూ టీజర్‌తోనే సినిమా ఎలా ఉండబోతోందో ప్రేక్షకులకు క్లారిటీ ఇచ్చేసింది.

నయనతార సైతం ‘రెక్కయ్’ సినిమాతో ఊర మాస్ అవతారం ఎత్తి బాక్సాఫీస్ దగ్గర తన స్టామినా ఏంటో మరోసారి ప్రూవ్ చేయడానికి రెడీ అవుతోంది.  చేతిలో బైసా పట్టుకుని శత్రువులతో యుద్ధం చేయడానికి సిద్ధమైన ఆమెను చూస్తేనే అర్థమవుతుంది. గ్లామర్‌కు స్కోప్ లేకుండా కంప్లీట్ మాస్ వైబ్స్‌తో నయన్ చేస్తున్న ఈ కొత్త ప్రయోగం ప్రేక్షకులకు ఏ మేరకు అలరిస్తుందో చూడాలి మరి.

సమంత అయితే ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ నుంచే తన రూట్ పూర్తిగా మార్చుకున్నారు. అందులో యాక్షన్ వైబ్స్ ఈ సినిమా సక్సెస్‌లో కీ రోల్ పోషించాయి. ఆ తర్వాత  సిటాడెల్‌ సిరీస్‌లతో కూడా పూర్తి యాక్షన్ మోడ్‌లో అదరగొట్టేసింది.  పాటు మా ఇంటి బంగారం సినిమాలో కూడా అదే పవర్ రిపీట్ చేసి హిట్ అందుకుంది. మొత్తానికి ఒకప్పుడు క్యూట్‌గా కనిపించిన ఈ స్టార్ హీరోయిన్స్ అంతా ఇప్పుడు సరికొత్తగా ఊర మాస్ యాక్షన్‌తో ఇండస్ట్రీని షేక్ చేస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu Movie
Telugu News