SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

పెళ్లి బారాత్‌లో భారీ కొండచిలువతో యువతి డ్యాన్స్.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే!

Wedding Baraat Viral Video: తాజాగా సోషల్ మీడియాలో పెళ్లి బారత్‌కు సంబంధించిన వీడియో ఊహించని స్థాయిలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ఆ యువతి పామును పట్టుకున్ని డ్యాన్స్ చేయడం మీరు చూడొచ్చు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Written By Dharmaraju Dhurishetty
Published: Oct 30, 2026, 03:26 PM IST | Updated: Oct 30, 2026, 03:28 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Wedding Baraat Video: సాధారణంగా పెళ్లి బారత్‌ అంటే బంధుమిత్రుల కోలాహలంతో పాటు డీజే పాటలు, డ్యాన్సులు అందరికీ గుర్తుకొస్తూ ఉంటాయి. అయితే, ఒక వివహ ఊరేగింపులో మాత్రం ఒక మహిళ చేసిన విన్యాసాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎవరైనా బారాత్‌లో పూలదండలు లేదా రకరకాల వస్తువులతో ఆనందంగా డ్యాన్సులు వేస్తూ ఉంటారు. కానీ ఇక్కడ ఆ మహిళ ఏకంగా భారీ కొండచిలువను చేతితో పట్టుకుని.. మెడలో వేసుకుని.. స్టెప్పులు వేయడం మీరు గమనించవచ్చు.. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతోంది.

వైరల్ అవుతున్న వీడియో వివరాల్లోకి వెళితే.. ఇందులో ఒక పెళ్లి బారాత్ వేడుక ఘనంగా జరగడం మీరు గమనించవచ్చు.. డీజే పాటలతో మోగుతుండగా.. చుట్టూ జనం డ్యాన్సులు చేయడం మీరు గమనించవచ్చు. ఆ సమయంలో ఒక మహిళ తన చేతుల్లో అత్యంత పొడవైన.. బరువైన కొండచిలువతో అక్కడ కనిపించడం మీరు గమనించవచ్చు.. సాధారణంగా చిన్న పామును చూస్తేనే.. ఎంతో దూరం పరిగెత్తే ఈ రోజుల్లో.. ఆమె ఏమాత్రం భయం లేకుండా ఆ భారీ పాము తల భాగాన్ని ఒక చేత్తో.. తోక భాగాన్ని మరో చేత్తో పట్టుకుని ఉండడం మీరు చూడొచ్చు.. అంతేకాకుండా దానిని తన మెడ చుట్టూ.. దండలా వేసుకుంటూ సంగీతానికి అనుగుణంగా ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఉండడం మీరు క్లియర్‌గా చూడొచ్చు.

ఆ మహిళ డ్యాన్స్ చేస్తున్నంతసేపు చుట్టూ.. ఉన్న జనాలు ఆమెను ఆశ్చర్యపోతూ చూశారు. కొందరు భయంతో కాస్త దూరంగా జరిగితే.. మరికొందరు తమ స్మార్ట్‌ఫోన్లలో ఈ అరుదైన దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ అయ్యింది. వేలాది కామెంట్లతో నెట్టింట ఈ వీడియో దూసుకుపోతూ వచ్చింది..

ఈ వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తూ వస్తున్నారు. కొందరు ఆమె ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉండగా.. మరికొందరు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. భారీ శబ్దాలు ఉండే పెళ్లి వేడుకల్లో మూగజీవులను ఇలా వినియోగించడం అస్సలు మంచిది కాదని జంతువు ప్రేమికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అడవుల్లో ఉండాల్సిన ప్రమాదకర వన్యప్రాణులతో ఇలాంటి బహిరంగంగా సాహసాలు చేయడం ఇతరుల ప్రాణాలకే కాకుండా ఆ జీవికి కూడా హానికరమని పలువురు అభిప్రాయపడుతూ వస్తున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES