• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /IND vs NZ Highlights: భారత్‌ గెలుపు యాత్రకు బ్రేక్‌.. భారీ విజయంతో పరువు నిలబెట్టుకున్న న్యూజిలాండ్‌

IND vs NZ Highlights: భారత్‌ గెలుపు యాత్రకు బ్రేక్‌.. భారీ విజయంతో పరువు నిలబెట్టుకున్న న్యూజిలాండ్‌

New Zealand Defeat India By 87 Runs In Fourth T20I At Auckland: భారీ విజయాలతో ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత జట్టుకు న్యూజిలాండ్‌ భారీ షాక్‌ ఇచ్చింది. కివీస్‌ కోల్పోయిన సమయంలో పరువు కోసం పోరాడిన కివీస్‌ భారీ విజయాన్ని సాధించింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో భారత్‌పై 87 పరుగుల తేడాతో ఆతిథ్య జట్టు నెగ్గింది.

Written By Ravi Kumar Sargam
Published: Oct 30, 2026, 04:48 PM IST|Updated: Oct 30, 2026, 05:21 PM IST
joinshare
IND vs NZ Highlights: భారత్‌ గెలుపు యాత్రకు బ్రేక్‌.. భారీ విజయంతో పరువు నిలబెట్టుకున్న న్యూజిలాండ్‌
Image Credit: Source: New Zealand X Account (Twitter)

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మళ్లీ మార్కెట్‌లోకి Karbonn స్మార్ట్‌ఫోన్లు.. Rebel Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మళ్లీ మార్కెట్‌లోకి Karbonn స్మార్ట్‌ఫోన్లు.. Rebel Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

2

Monkey Video: ఇది కదా పొదుపు చేయడం.. నీళ్లను తాగి ట్యాప్ కట్టేసిన వానరం.. వీడియో వైరల్..

3

రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

4

AP Inter Exam Fee Deadline: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడుపు పెంపు! ఎప్పటి వరకు?

5

Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

New Zealand Beat India By 87 Runs: హ్యాట్రిక్‌ విజయాలతో ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుని ఫుల్‌ జోష్‌లో ఉన్న భారత జట్టుకు ఆతిథ్య న్యూజిలాండ్‌ భారీ షాక్‌ ఇచ్చింది. నాలుగో టీ20 మ్యాచ్‌లో ఆల్‌రౌండ్‌ ప్రదర్శన చేసిన కివీస్‌ జట్టు మ్యాచ్‌ను సొంతం చేసుకుని పరువు నిలబెట్టుకుంది. ప్రత్యర్థి జట్టు విధించిన భారీ లక్ష్యాన్ని ఛేదించలేక భారత ఆటగాళ్లు చేతులెత్తేసిన వేళ.. న్యూజిలాండ్‌ భారీ విజయాన్ని నమోదు చేసుకుంది. అటు బ్యాటింగ్‌లోనూ.. బౌలింగ్‌లోనూ అదరగొట్టిన కివీస్‌ మ్యాచ్‌ను సొంతం చేసుకుని ఊరట పొందింది.

పరువు కోసం పోరాటం
ఆక్లాండ్‌లో శుక్రవారం జరిగిన నాలుగో టీ20 మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన భారత్‌ బౌలింగ్‌ ఎంచుకుని ప్రత్యర్థిని బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 259 పరుగులు సాధించింది. ఓపెనర్‌ టిమ్‌ సీఫర్ట్‌ (3) విఫలమవగా.. ఫిన్‌ అలెన్‌ 17 బంతుల్లో 31 పరుగులతో రాణించగా.. డారిల్‌ మిచెల్‌ (9 బంతుల్లో 24) కొంత స్కోర్‌తో మెరిశాడు. బ్యాటింగ్‌కు దిగిన గ్లెన్‌ ఫిలిప్స్‌ ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడి సెంచరీ నమోదు చేశాడు. 49 బంతుల్లో 107 పరుగులు సాధించిన గ్లెన్‌.. 6 ఫోర్లు, పది సిక్సర్లతో విధ్వంసం సృష్టించాడు. మైకేల్‌ బ్రేస్‌వెల్‌ ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడి అర్ధ శతకాన్ని నమోదు చేశాడు. 25 బంతుల్లో 65 పరుగులు చేసి జట్టుకు భారీ స్కోర్‌ అందించాడు. తొలి దశలో భారత బౌలర్లు పొదుపుగా బంతులు వేయగా.. అనంతరం చేతులెత్తేశారు. ఫిలిప్స్‌ను, బ్రేస్‌వెల్‌ వికెట్లు తీయడంలో విఫలమయ్యారు. మయాంక్‌ యాదవ్‌ పోరాడి మూడు వికెట్లు తీయగా.. అర్ష్‌దీప్‌ సింగ్‌, ప్రిన్స్‌ యాదవ్‌, నితీశ్‌ కుమార్‌ రెడ్డి, అక్షర్‌ పటేల్‌ ఒక వికెట్‌ పడగొట్టేలోపు జరగాల్సిన నష్టం జరిగిపోయింది. న్యూజిలాండ్‌ భారీ స్కోర్‌ నమోదు చేసింది.

ఘోరంగా విఫలం
క్లీన్‌ స్వీప్‌ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత్‌ నాలుగో మ్యాచ్‌లో ఘోరంగా విఫలమైంది. భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి ఏమాత్రం ప్రయత్నం చేయలేకపోయింది. నిర్ణీత ఓవర్లు పూర్తి చేసుకునే సరికి 9 వికెట్లు కోల్పోయిన భారత్‌ 192 పరుగులకు పరిమితమైంది. ఆలౌట్‌ నుంచి తృటిలో జట్టు తప్పించుకుంది. సంజూ శాంసన్‌ (4) విఫలం చెందగా.. గత మ్యాచ్‌ సెంచరీ వీరుడు అభిషేక్‌ శర్మ 27 పరుగులకే పరిమితమయ్యాడు. ఇక ఇషాన్‌ కిషన్‌ డకౌట్‌ కాగా.. కెప్టెన్‌ శ్రేయస్‌ అయ్యర్‌ (11 బంతుల్లో 22) తక్కువ పరుగులే చేశాడు. అక్షర్‌ పటేల్‌ 7 పరుగులకే ఔటవగా.. మరోసారి నమన్‌ ధీర్‌ బ్యాట్‌తో మెరిశాడు. 13 బంతుల్లో 28 పరుగులు చేసి.. రెండు సిక్సర్లు, రెండు ఫోర్లు కొట్టాడు. కివీస్‌ పర్యటనలో నమన్‌ ధీర్‌ పూర్తిస్థాయి ఆల్‌రౌండర్‌గా మారిపోయాడు. మరోసారి తెలంగాణ క్రికెటర్‌ తిలక్‌ వర్మ మెరిసినా జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. 35 బంతుల్లో 35 పరుగులతో తిలక్‌ పోరాడినా అప్పటికే మ్యాచ్‌పై ఆశలు సన్నగిల్లాయి. యువ బౌలర్‌ ప్రిన్స్‌ యాదవ్‌ 18 పరుగులతో ఆకట్టుకోగా.. మయాంక్‌ యాదవ్‌ 3 పరుగులు చేశాడు.

భారత్‌ను దెబ్బతీసిన డఫీ
సిరీస్‌ కోల్పోయిన సమయంలో పరువు నిలబెట్టుకునేందుకు ఈ మ్యాచ్‌లో కివీస్‌ బౌలర్లు అద్భుతం చేశారు. బ్యాటర్లు చేసిన భారీ స్కోర్‌ను కాపాడుతూ ప్రత్యర్థి భారత జట్టును నిలువరించారు. ఏ ఒక్క బ్యాటర్‌ను భారీ స్కోర్‌ చేయకుండా అడ్డుకున్నారు. జాకబ్‌ డఫీ నాలుగు వికెట్లతో భారత్‌ బ్యాటింగ్‌ను భారీ దెబ్బతీయగా.. మ్యాథ్యూ ఫిషర్‌, కెప్టెన్‌ మిచెల్‌ శాంట్నర్‌ రెండేసి వికెట్లు తీయగా.. ఆడమ్‌ మిల్నే ఒక వికెట్‌ పడగొట్టారు. ఫలితంగా భారత్‌పై కివీస్‌ 87 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

ఆఖరి మ్యాచ్‌లో గెలుపెవరిది?
క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా జరిగిన మొదటి, రెండో టీ20లో నాలుగు వికెట్ల తేడాతో భారత జట్టు గెలుపొందింది. వెల్లింగ్టన్‌లో మూడో టీ20లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి భారత్‌ టీ20 సిరీస్‌ను సొంతం చేసుకుంది. క్లీన్‌స్వీప్‌ లక్ష్యంగా బరిలో దిగగా నాలుగో మ్యాచ్‌లో భారత్‌కు న్యూజిలాండ్‌ దెబ్బతీసింది. నాలుగో టీ20లో న్యూజిలాండ్‌ గెలవగా.. నవంబర్‌ 4వ తేదీన జరగనున్న ఆఖరి మ్యాచ్‌లో ఎవరూ సత్తా చాటుతారో ఆసక్తి నెలకొంది.

Add Zee News as a Preferred Source
TAGS:
Team India
Cricket
Sports News
Telugu News
Trending News