• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /హైదరాబాద్
  • /Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..

Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..

Water Crisis in Hyderabad: ప్రాజెక్టులలో నీటి మట్టాలు క్రమంగా పడిపోతున్నాయని, భూగర్భ జలాలు తగ్గడం వల్ల నీటి సమస్య తీవ్రంగా మారిందని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి కీలక హెచ్చరిక జారీ చేశారు. అంతే కాకుండా ప్రజలంతా నీటిని జాగ్రత్తగా వినియోగించుకొవాలన్నారు.

Written ByInamdar Paresh
Published: Oct 30, 2026, 05:11 PM IST|Updated: Oct 30, 2026, 05:21 PM IST
joinshare
Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..
Image Credit: hyderabad water board

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
మళ్లీ మార్కెట్‌లోకి Karbonn స్మార్ట్‌ఫోన్లు.. Rebel Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

మళ్లీ మార్కెట్‌లోకి Karbonn స్మార్ట్‌ఫోన్లు.. Rebel Pro ఫీచర్లు చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే!

2

Monkey Video: ఇది కదా పొదుపు చేయడం.. నీళ్లను తాగి ట్యాప్ కట్టేసిన వానరం.. వీడియో వైరల్..

3

రూ.69,999తో Infinix GT 50 Pro లాంచ్.. 24 వేల విలువైన గేమింగ్ యాక్సెసరీస్ ఫ్రీగా!

4

AP Inter Exam Fee Deadline: ఏపీలో ఇంటర్ విద్యార్థులకు గుడ్‌న్యూస్..పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లింపునకు గడుపు పెంపు! ఎప్పటి వరకు?

5

Hyderabad: రాబోయే 8 నెలలు హైదరాబాద్‌లో నీటి సంక్షోభం.. నగర వాసులకు జలమండలి కీలక హెచ్చరిక..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Hyderabad water board key alert to people over water crisis: తెలంగాణలో ప్రస్తుతం ఎల్ నినో ప్రభావం స్పష్టంగా కన్పిస్తుంది. ఈ క్రమంలో ఇప్పటికే ఎల్ నినోపై అప్రమత్తంగా  ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు, రైతన్నలకు సూచించారు. నీటిని పొదుపుగా ఉపయోగించుకొవాలని, సాగునీరు తక్కువగా అవసరం అయ్యే పంటలను పండించాలని కూడా ఇప్పటికే సూచించారు. ఈక్రమంలో అనవసరంగా నీటిని వృథా  చేయడం మానుకొవాలని స్పష్టం చేశారు.  దీనిలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికే పానీయాప్ ను సైతం లాంచ్ చేసింది. 

దీనిలో నీటిని వృథా చేసేవారిపై ఫిర్యాదులు చేయోచ్చని తెలిపింది. తెలంగాణ రాష్ట్రం తీవ్రమైన నీటి సంక్షోభం ఎదురుకుంటున్న నేపథ్యంలో.. పానీ యాప్ లాంచ్ చేయడం ఆసక్తికరంగామారింది. దీనిలో వాలంటీర్ లు చేరి నీరు వృథా చేసే వారిపై ఫిర్యాదు చేయవచ్చని, ఫిర్యాదులు చేసే వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అధికారులు తెలిపారు.  ఈ క్రమంలో హైదరాబాద్ మహ నగరంలో రాబోయే 8 నెలల పాటు నీటి కష్టాలు తప్పవని జలమండలి ఎండీ ఒక ప్రకటనలో తెలిపారు. మంజీరా, సింగూరు జలాశయాలు అడుగంటిపోయాయని తెలిపారు. రోజుకు 100 మిలియన్ గ్యాలన్ల (MGD) నీటి కొరత ఏర్పడనుందని అన్నారు. 

వచ్చే ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు దీని ప్రభావం ఉంటుందన్నారు. ప్రజలు తమ అవసరాలకు నీళ్లను జాగ్రత్తగా, పొదుపుగా ఉపయోగించుకొవాలన్నారు.  ప్రాజెక్టులలో నీటి మట్టాలు పడిపోవడం, భూగర్భ జలాలు తగ్గడంతో, ఇప్పటికే ఎల్ నినో ప్రభావం వల్ల ఈవిధమైన సమస్య తలెత్తిందన్నారు. దీనిపై ఇప్పటికే ప్రత్యామ్నాయ మార్గాలపై జలమండలి చర్యలు తీసుకుంటుందన్నారు.

 గోదావరి నుంచి 100 MGD, కృష్ణా నది నుంచి 10-15 MGD, ఉస్మాన్‌సాగర్ నుంచి మరో 5 MGD నీటిని హైదరాబాద్ మహానగరంకు వివిధ అవసరాల కోసం తరలించేందుకు ప్రణాళికలు సిద్దం చేసినట్లు తెలిపారు. ఈ నీటి సమస్య వల్ల ప్రజలు రాబోయే 8 నెలల పాటు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుందన్నారు. అందుకే నీటిని ఇప్పటి నుంచి పొదుపుగా ఉఫయోగించుకొవాలని హైదరాబాద్ నగర వాసులకు జలమండలి ఎండీ పలు సూచనలు చేశారు. దీంతో నగర వాసులు సైతం ఎల్ నినోప్రభావంపై ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Telangana News
Telangana Weather